హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSRCP: వైసీపీలో సీనియర్ నేత కొత్త రాజకీయ వ్యూహం.. ఆ జిల్లాను గుప్పిట్లో పెట్టుకునే ప్లాన్..

YSRCP: వైసీపీలో సీనియర్ నేత కొత్త రాజకీయ వ్యూహం.. ఆ జిల్లాను గుప్పిట్లో పెట్టుకునే ప్లాన్..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేతల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasad Rao) ఒకరు. శాసనసభకు ఎన్నికైన తొలిసారే మంత్రి పదవి దక్కించుకున్నారు.

ఇంకా చదవండి ...

P Anand Mohan, News18, Visakhapatnam 

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేతల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasad Rao) ఒకరు. శాసనసభకు ఎన్నికైన తొలిసారే మంత్రి పదవి దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో సీనియర్ నేతగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) కి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరిగా, వైఎస్ కోటరీ వ్యక్తిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా వైఎస్ జగన్ (YS Jagan) మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ధర్మాన.. ఇప్పుడు తన సొంత జిల్లా అయిన శ్రీకాకుళంలో తన బలాన్నిsrik మరింత పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన నాలుగు స్థానాల్లో తన వర్గానికి చెందిన నేతలను బరిలో నిలిపేందుకు ధర్మాన ప్రసాదరావు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ సొంత నియోజకవర్గం నరసన్నపేట నుంచి ప్రస్తుతం ధర్మాన సోదరుడు మాజీ మంత్రి కృష్ణదాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈయనను తప్పించాలని ఇప్పటికే పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో కొత్తగా ప్రస్తుత సారవకోట ఎంపీపీ కూర్మినాయుడును ఎమ్మెల్యేగా బరిలోకి నిలిపేందుకు ధర్మాన ప్రసాదరావు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు.. పెరిగిన జీతాల వివరాలివే..!


ఇటు పాతపట్నం నియోజకవర్గం ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిని మార్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేవలం జగన్ ఆదేశించిన తర్వాతే నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తొలి నుంచి కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఢిల్లీలో నివసిస్తున్న రెడ్డి శాంతి రెండు నెలలకు ఓ సారి పాతపట్నంలో పర్యటిస్తున్నారు. దీంతో ఆమెను కూడా మార్చేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: 70 మంది ఎమ్మెల్యేలకు జగన్ కొత్త టార్గెట్... తేడా వస్తే నో టికెట్.. లిస్ట్ ఇదేనా..?


ఇక టెక్కలిలో కూడా ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పేరాడ తిలక్ వర్గానికి మధ్య పచ్చగట్టి వస్తే భగ్గు మంటోంది. ఇప్పుడు తాజాగా కేంద్ర మాజీ మంత్రి కృపారాణి వర్గం కూడా ఇప్పుడు టెక్కలిలో అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో టెక్కలిలో ఈ ముగ్గురిని కాదని కొత్త వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనేది వైసీపీ నేతల భావన. ఈ బాధ్యత కూడా ధర్మానకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఓ క్లారిటీకి వచ్చిన ధర్మాన ప్రసాదరావు... శ్రీకాకుళం, పాతపట్నం, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు ఓటములు, అభ్యర్థులపై ఓ నివేదికను కూడా పార్టీ అధిష్ఠానానికి సమర్పించినట్లు తెలుస్తోంది. రాబోయే ప్లీనరీ సమావేశాల్లో దీనిపై చర్చించిన తర్వాత ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, AP Politics, Srikakulam, Ysrcp

ఉత్తమ కథలు