Home /News /andhra-pradesh /

AP POLITICS MINISTER CHELLUBOINA VENU FIRES ON TDP AND JANASENA AS HE GIVES CLARITY ON LAYING ON KNEES IN FRONT OF YV SUBBA REDDY FULL DETAILS HERE PRN

AP Minister: అందుకే మోకాళ్లపై పడ్డా..! మనోభావాలు దెబ్బతిని ఉంటే సారీ.. మంత్రి కీలక వ్యాఖ్యలు

వైవీ సుబ్బారెడ్డికి మోకరిల్లి నమస్కరిస్తున్న మంత్రి వేణు (file)

వైవీ సుబ్బారెడ్డికి మోకరిల్లి నమస్కరిస్తున్న మంత్రి వేణు (file)

ఏపీలో అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల తప్పిదాలపై ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నలు సంధిస్తుంటే.....అధికార పార్టీ నేతలు సైతం అంటే ధీటుగా జవాబిస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులకు సంబంధించి దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుంటే..,అధికార పార్టీకి చెందిన వారు సైతం అంతే ధీటుగా సమాధానం చెబుతున్నారు. మొన్నామధ్య మంత్రి వేణుగోపాల కృష్ణ., టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మోకరిల్లారంటూ ప్రతిపక్షం చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన చిట్టబ్బాయ్ కుటుంబాన్ని....తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదుకున్నారని.....ఆ కృతజ్ఞతతోనే సీఎం ప్రతినిధిగా సభకు వచ్చిన వైవీ సుబ్బారెడ్డికి నమస్కరించడాన్ని ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు చిలువలు పలువలు చేసి చూపిస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన.....అధికారంలో ఉండగా శెట్టిబలిజ వర్గాన్ని మోసం చేసింది టీడీపీ కాదా అంటూ ప్రశ్నించారు.

    శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని నేనేదో తాకట్టు పెట్టినట్లుగా టీడీపీ, జనసేన పార్టీల నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి మోకాళ్ళపై వంగి నమస్కారం చేస్తే.. దానికి వక్రభాష్యాలు చెప్పడం సరికాదన్న ఆయన.., ఆ నమస్కారాన్ని తాను సంస్కారంగానే భావించానే తప్ప, ఎవరినీ అవమానించడానికి కాదని స్పష్టం చేశారు. అయినా ఈ ఘటనతో ఎవరికైనా బాధకలిగితే అందుకు చింతిస్తున్నానన్నారు. మా సామాజికవర్గంలో చిచ్చు పెట్టి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నదే టీడీపీ, జనసేన పార్టీల ఉద్దేశంగా ఉందని మంత్రి వేణు వ్యాఖ్యానించారు. చీకటి రాజకీయాలు చేయడం తనకు చేతకాదన్న మంత్రి.., తాను ఎవరికాళ్లూ పట్టుకోలేదని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ని ఉద్దేశించి అన్నారు.

    ఇది చదవండి: పొత్తుల‌పై క‌న్ఫ్యూజ‌న్ లో ప‌వ‌న్..? టీడీపీ వైపే మొగ్గు? త్వర‌లో కీల‌క ప్ర‌క‌టన..?


    శెట్టి బలిజలకు జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యం, పదవులు చూసి...ఓర్చుకోలేని టీడీపీ, జనసేన పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. జాతిని అమ్ముకోవాల్సిన ఖర్మ తనకు పట్టలేదని....జాతిని నమ్ముకుంటానని స్పష్టంచేశారు. అవసరమైతే వారి కోసం ఎంతవరకైనా పోరాడతానన్నారు. ఆ సామాజిక వర్గం ఉన్నతికి కృషి చేస్తున్న నాయకుడు జగనేనన్న మంత్రి....శెట్టి బలిజ సామాజిక వర్గం పడుతున్న కష్టాలను శాసనసభలలో వివరించానని....బీసీల్లోని 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. బీసీ సంక్షేమ శాఖ ద్వారా, రాష్ట్ర బడ్జెట్ లో అధిక శాతం రూ. 32 వేల కోట్ల నిధులు కేటాయించి ఈ వర్గాలను ఆదుకుంటున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డని గుర్తేచేశారు. ఇకనైనా ప్రతిపక్ష పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజాసమస్యలపై పోరాడుతూ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని హితవు పలికారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు