Home /News /andhra-pradesh /

AP POLITICS MINISTER BUGGANA RAJENDRANATH REDDY GIVES CLARITY ON YS JAGAN LONDON VISIT FULL DETAILS HERE PRN GNT

CM Jagan Davos Tour: సీఎం లండన్ వెళ్లింది అందుకే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి బుగ్గన

సీఎం జగన్ లండన్ టూర్ పై వివాదం

సీఎం జగన్ లండన్ టూర్ పై వివాదం

దావోస్ (Davos-2022) పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (AP CM YS Jagan) మధ్యలో లండన్ (London) వెళ్లడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ (TDP) నేత యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశిన సంగతి తెలిసిందే. ఐతే దీనిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) స్పందించారు.

ఇంకా చదవండి ...
    దావోస్ (Davos-2022) పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (AP CM YS Jagan) మధ్యలో లండన్ (London) వెళ్లడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ (TDP) నేత యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశిన సంగతి తెలిసిందే. ఐతే దీనిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) స్పందించారు. జగన్ లండన్ వెళ్లడంపై క్లారిటీ ఇచ్చారు. టీడీపీ నేతలు నాగరికత మర్చిపోయి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని బుగ్గన అన్నారు. ఈమేరకు యనమల చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనపై యనమల చేసిన ఆరోపణలు నిస్సిగ్గుగా ఉన్నాయని, వయసు మీద పడుతున్న కొద్దీ.. యనమల కనీస సంస్కారం కూడా లేకుండా రోజురోజుకూడా దిగజారిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా అనవసర విమర్శలు చేస్తున్నారని బుగ్గన మండిపడ్డారు.

    గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిసిన వారికి విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నిబంధనలు తెలియకపోవడం, దానిపై సీఎం జగన్ పై దుష్ప్రచారం చేయడం తగదని బుగ్గన అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన రహస్యమేమీ కాదని., కుటుంబ సభ్యులతో కలిసి దావోస్‌ చేరుకుంటారన్న దాంట్లో దాపరికమే లేదన్నారు.

    ఇది చదవండి: పవన్ స్టైల్.. బాలయ్య డైలాగ్స్.. లోకేష్ లో ఈ మార్పు గమనించారా..?


    శుక్రవారం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన తర్వాత విమానం ఇంధనం నింపుకోవడం కోసం టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో ఆగిందన్నారు. అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఆలస్యమైందని.. దీంతో లండన్ చేరుకోవడం మరింత ఆలస్యమైందన్నారు. అక్కడ ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో రాత్రయిందన్నారు. జ్యూరెక్ లో రాత్రి 10గంటలు దాటితే ఫ్లైట్స్ ల్యాండ్ అవడానికి పర్మిషన్ లేదని ఈ విషయాన్ని స్విస్ లోని భారత ఎంబసీ దృష్టికి తీసుకెళ్లగా.. లండన్ అధికారులకు సమాచారం అందించారన్నారు. వారు నేరుగా ముఖ్యమంత్రితో అధికారులతో చర్చించి లండన్ లోనే జగన్ కు బస ఏర్పాటు చేశారన్నారు. తెల్లవారుజామున జ్యూరెక్ బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నా పైలెట్లు ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ రూల్స్ ప్రకారం వారు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

    ఇది చదవండి: అమ్మఒడిపై కీలక అప్ డేట్.. ఈసారి వచ్చేది రూ.13వేలే.! కారణం ఇదే..!


    ఇదిలా ఉంటే సీఎం జగన్ దావోసే టూర్ పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. జ్యూరిక్ లో రాత్రి పది గంటల తర్వాత విమానాలు ల్యాండ్ అయ్యే అవకాశాలు లేనందున, విపరీతమైన విమానాల రద్దీ నేపథ్యంలో విమానం లండన్ లో ల్యాండింగ్ అయ్యిందని.., జ్యూరిక్ లో ల్యాండింగ్ కోసం ఆఖరికి భారత ఎంబసీ ప్రయత్నించినా, ల్యాండింగ్ కు అనుమతి రానందువల్లే లండన్ లో ల్యాండింగ్ కావాల్సి వచ్చిందన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Buggana Rajendranath reddy, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు