AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి.. అన్ని పార్టీల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. వ్యూహ, ప్రతి వ్యూహాలతో ఢీ అంటే ఢీ అంటున్నారు నేతలు.. ఇక విమర్శలు, ప్రతి విమర్శలు అయితే పీక్ చేరాయి. కేవలం తమ పార్టీ గెలవడమే కాదు.. ప్రత్యర్థి ఓటమికి ఏం చేయాలనే వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు.. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే..? ఏపీలో పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. వైసీపీ (YCP) ని తిరిగి అధికారంలోకి రాకుండా చేసేందుకు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. పది మంది ఆస్తుల కోసం.. కోట్లాది ప్రజల ఆస్తులు అమరావతి (Amaravati) లో కుమ్మరించాలా అని బొత్స నిలదీశారు. ఉత్తరాంధ్రలో ఉన్న టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా విశాఖ రాజధాని అశోక్ గజపతిరాజు (Asokh Gajapati Raju) కు ఇష్టంలేదని అభిప్రాయపడ్డారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండి ఎయిర్‌పోర్టు నిర్మించలేదని బొత్స విమర్శించారు.
ప్రత్యర్థి పార్టీలు అన్నీ కలిసి.. ఎప్పటి నుంచో కుట్రలకు ప్రయత్నాలు చేస్తున్నాయని.. ముఖ్యంగా సీఎం జగన్ మరోసారి అధికారంలోకి రాకూడదు అనేదే వారి టార్గెట్ అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే అసత్యాలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ బొత్స మండిపడ్డారు. అయినా చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.
తమ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ ఉందని.. ఆది ఓర్వలేక.. కుట్రలకు తెరలేపుతున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే ఈనెల 16 లేదా 17వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తారని బొత్స పేర్కొన్నారు. రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసుకోవడానికి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్ పలు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. అయితే ప్రత్యర్థి పార్టీ మాత్రం వైసీపీలో విబేధాలు తెరపైకి తెచ్చి.. లాభపాడాలని చూస్తోందన్నారు. అందుకే వైసీపీ నేతలంతా అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి సమిష్టిగా పని చేయాలంటూ సూచనలు చేశారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి జిల్లాల్లోని అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే గ్రామ, పట్టణ వార్డులలో సమన్వయ కర్తల నియామకాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు ఫోన్లు లిఫ్ట్ చేయాలని, అన్నింటిపై స్పందించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, AP Politics, Botsa satyanarayana