Botsa Satyanarayana: ఏపీ కేబినెట్ ప్రక్షాళనపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పరిపాలనా సౌలభ్యం కోసం కేబినెట్ ఏర్పాటు ఉంటుంది. ఆ కేబినెట్ (Ap cabinet) లోకి ఎవరిని తీసుకోవాలనేది..సీఎం విచక్షణాధికారం, ఆయన ఇష్టమని అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం మార్పులు, చేర్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చని అన్నారు. కేబినెట్ లో మార్పులు జరుగుతాయన్న ఊహాగానాలకు తనలాంటి మంత్రి స్పందించడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు, కేబినెట్ ప్రక్షాళనకు ఏం సంబంధం అని ..ఒకవేళ మంత్రివర్గ విస్తరణ ఉంటే అందులో తప్పేముందని బొత్స (Botsa Satyanarayana) వ్యాఖ్యానించారు.
ఉత్తరాంద్ర ఎమ్మెల్సీ ఓటమిపై బొత్స రియాక్షన్..
ఇక ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఓటమిపై బొత్స (Botsa Satyanarayana) స్పందించారు. ఓటమికి మా వైఫల్యమే కారణం. ఓటమికి బాధ్యత వహిస్తాను. ఈ ఎన్నికల్లో లోపం ఎక్కడుందో సమీక్షించుకుంటాం అని అన్నారు. ఓటమిని వేరే రాజకీయ నాయకులపై నెట్టేయడం నా జీవితంలో చేయలేదు. అలా అని తప్పించుకు పారిపోయే వ్యక్తిని కాదన్నారు. 3 రాజధానులు అనేది మా ప్రభుత్వ విధానం. విశాఖ కేంద్రంగా పరిపాలన జరగాలన్నదే మా అభిప్రాయం అని బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తేల్చి చెప్పారు.
ఇక ఏపీలో డిసెంబర్ లోనే ఎన్నికలు జరుగుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం తమకు లేదని..ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు ఇంకా దిగజారిపోతారని అన్నారు. మరి బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నాయకులూ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇదిలా ఉంటే..ఏపీ కేబినెట్ లో మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న కేబినెట్ గత కేబినెట్ కంటే వీక్ గా ఉందని..ప్రతిపక్షాల విమర్శలకు స్పందించే సరైన వారు లేరని తెలుస్తుంది. దీనితో కేబినెట్ లో నలుగురికి కొత్తగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP News, Botsa satyanarayana