AP POLITICS MINISTER AMRNATH AND MLA KANNABABU RAJU WENT TO PUBLIC IN DIFFERENT GET UPS IN VISAKHAPATNAM ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSP
YCP MLAs: మారువేషంలో ప్రజల్లోకి మంత్రి, ఎమ్మెల్యే.. పబ్లిక్ రియాక్షన్ ఇదే.. పరువు తీసిన ప్రయోగం..?
మారు వేషాల్లో ఎమ్మెల్యే కన్నబాబు రాజు, మంత్రి అమర్ నాథ్
AP Politics: పూర్వం రాజులు రాత్రి వేళల్లో మారువేషాల్లో వెళ్లి పాలనపై ప్రజల స్పందన తెలుసుకునేవాళ్లట. వాళ్ల నుంచి వచ్చిన స్పందన బట్టి రాజులు తమ పాలనా విధాల్లో మార్పులు చేయడం, పన్నులు తగ్గించడం, సౌకర్యాలు పెంచడం వంటి చర్యలు చేపట్టేవారట. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు. ప్రజలేమనుకున్నా సరే ప్రభుత్వాలు మాత్రం తాము అనుకున్నదే చేస్తున్నాయి. ఐతే రాజుల కాలం నాటి పద్ధతి గుర్తొచ్చిందో ఏమో.. ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే మారువేషాలతో జనాల్లోకి వెళ్లారు. వారిపై రియాక్షన్ మాములుగా లేదు.
పూర్వం రాజులు రాత్రి వేళల్లో మారువేషాల్లో వెళ్లి పాలనపై ప్రజల స్పందన తెలుసుకునేవాళ్లట. వాళ్ల నుంచి వచ్చిన స్పందన బట్టి రాజులు తమ పాలనా విధాల్లో మార్పులు చేయడం, పన్నులు తగ్గించడం, సౌకర్యాలు పెంచడం వంటి చర్యలు చేపట్టేవారట. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు. ప్రజలేమనుకున్నా సరే ప్రభుత్వాలు మాత్రం తాము అనుకున్నదే చేస్తున్నాయి. ఐతే రాజుల కాలం నాటి పద్ధతి గుర్తొచ్చిందో ఏమో.. ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే మారువేషాలతో జనాల్లోకి వెళ్లారు. వారిపై రియాక్షన్ మాములుగా లేదు. వివరాల్లోకి వెళ్తే.. ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉమ్మడి విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా నాయకుల్లో ఈ మధ్య కాలంలోనే మంత్రిగా మారిన ఓ ఎమ్మెల్యే, అనకాపల్లి పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యేకి మారువేషంలో ప్రజల్లోకి వెళ్లారు.. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. సోషల్ మీడియా సాక్షిగా ఆ వీడియోలు వైరలై కూర్చుంటున్నాయి.
ఎమ్మెల్యేలు మారువేషాల్లో వెళ్లడం.. వారిని జనాలు గుర్తుపట్టకుండా చేసి వారి గురించే అడగటం.. ఇప్పుడు ఫ్యాషనైపోయింది. వారేదైనా కాస్త అతి చేస్తే అది కాస్తా.. సోషల్ మీడియాలో తిరిగి నాయకులు చులకనవుతున్నారు. విశాఖలో ఇటీవల ఓ వీడియో హల్ చల్ చేసింది. మంత్రి అమర్ నాథ్ ప్రమోషన్ కోసమే ఆ వీడియో తీసినట్టు అనిపించింది. ముఖ్యంగా అయనక పబ్లిసిటీ చేయడమో.. లేక మరో కారణమో తెలియదుగానీ.. ఆ వీడియో మొత్తం అంతా కూడా సెటైరికల్ గానే నడిచింది.
ఇవాళ్ల రేపు యూట్యూబర్ల అభిరుచులు వేరు. ఎవరిష్టం వాళ్లది. అయితే పాయింట్ కి వస్తే.. అమర్నాధ్ మంత్రిగా ఉన్నారు. ఆ విడియోలో ఆయన మారు వేషం వేయడం.. అదీ ఇంట్లో కూడా ఆయన్ని గుర్తుపట్టనంతగా మార్చడం ఆ వీడియో స్పెషాలిటీగా తయారైంది. సొంతవాళ్లు కూడా గుర్తుపట్టేలేదు కదా.. నియోజకవర్గంలో వెళ్లి మీ గురించి అడుగుదాం అంటూ వీడియో నడిచింది.
ఇందులో నియోజవర్గం ప్రజల్ని మంత్రి మారువేషంలో కలిశారు. అక్కడి ప్రజల్ని రోడ్లెలా ఉన్నాయి.. పనులు ఎలా ఉన్నాయని అడిగితే.. వాళ్లవరకూ నిజాలు చెప్పేశారు. ఎదురుగా ఉన్నది జీన్స్ ఫ్యాంటు షర్టు వేసుకున్న వ్యక్తి అనుకున్నారో ఏమో..? మంత్రిగా గుర్తించలేకపోయారేమో.. రోడ్లు బాలేవు.. సమస్యలు ఉన్నాయంటూ ఏకరవు పెట్టేశారు. ఎదురుగా ఉన్న మంత్రి అమర్నాధ్ అన్నీ విన్నారు. ఒకట్రెండు చోట్ల బాగున్నాయని అనిపించారు. అయితే మొత్తం వీడియోలో ఎమ్మెల్యే ఉరఫ్ మంత్రిని హీరోను చేయబోయి.. చులకన చేశారు. దీని వల్ల యూట్యూబ్ ఛానల్ వరకూ సక్సెస్. కానీ.. మంత్రికి ఊరంత అప్రతిష్ట రూపంలో మైనస్ ఎదురైందట. ప్రస్తుతం మంత్రి దావోస్ పర్యటనలో ఉన్నారు. ఇలాంటి ఎన్నో పర్యటనలు.. ఇతరత్రా ప్రజా సంబంధిత విషయాల్లో ఆయన ఉండితీరాలి. ప్రజా జీవితంలో ఉంటే వ్యక్తులు హుందాగా ఉండాలి. కానీ.. ఇలాంటి వీడియోల వల్ల ఆయన ఇజ్జత్ కు సవాల్ విసిరినట్టేకదా.
ఇక మరో ఎమ్మెల్యేది పాత కధ. అయినా.. ఈ సందర్భంలో చెప్పుకోవాల్సిన కధ. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు చాలా హుందా అయిన నాయకుడు. నిండైన ఆహార్యం ఆయన సొంతం. ముక్కుసూటిగానే ఉండే ఆయన నాయకుడ్ని సైతం కొందరు యూట్యూబర్లు బొల్తా కొట్టించారు. ఆయన్ని ఫక్తు రాజకీయన నేతగా చూడాల్సిన జనాలకు ఇంకోలా చూపించారు.
మారు వేషంలోనే వెళ్లాలని.. అప్పుడు నియోజకవర్గంలో బాగోగులు తెలుస్తాయని చెప్పారో ఏమో.. కన్నబాబు రాజు ఒక స్వామీజీ వేషాన వెళ్లారు. తీరా ఆయన పర్యటించిన నాలుగైదు ప్రాంతాల్లో ఆయన్ని గుర్తు పట్టేసిన వాళ్లు చాలా మందే. అయితే గుర్తుపట్టని వారికి అధికారులకి మాత్రం ఇది షాక్ ఇచ్చే పరిణామం. అందులోనూ వెనకాతల కెమెరాలు ఉన్నాయని పసిగట్టిన వారికి మాత్రం ఇది డ్రామా అని తేలిపోయి నవ్వేసుకున్నారు. ఇది జరిగి చాలాకాలం అయినా.. ఏ వేషంలో ఎవరోస్తారో.. అని కేవలం అధికారులే మాట్లాకుని నవ్వుకునే సందర్భాలు అనేకం.
ప్రజాలకి ఏం కావాలో వద్దో తెలుసుకోవడానికి సవాలక్ష మార్గాలు ఉన్నాయి. అలాంటప్పుడు.. ఇలా ఒకట్రెండు యూట్యూబర్ల కోసం ఇలా మరీ వేషాలు వేయాలా రాజకీయులు. ఆలోచించుకోండి. దీని వల్ల ఎవరికేం ప్రయోజనమో కానీ.. జనాల్లో మాత్రం పలుచన.. చులకన అవడం మాత్రం ఖాయమంటున్నారు నిపుణులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.