Home /News /andhra-pradesh /

AP POLITICS MINISTER AMBATI RAMBABU FACED CRITICISM FROM PUBLIC OVER DEVELOPMENT WORKS IN SATTENAPALLI CONSTITUENCY ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Ambati Rambabu: మూడేళ్లుగా అభివృద్ధి ఎక్కడ..? మంత్రిని నిలదీసిన జనం.. గడపగడపకులో వ్యతిరేకత..

అంబటి రాంబాబును నిలదీస్తున్న జనం

అంబటి రాంబాబును నిలదీస్తున్న జనం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికారంలో ఉన్న వైసీపీ (YSRCP) ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమలపై ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికారంలో ఉన్న వైసీపీ (YSRCP) ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమలపై ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి అదేశాలిస్తున్నారు. ఐతే గడప గడపకు కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నా.. అక్కడక్కడా మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసనలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలను జనం నిలదీసిన సందర్భాలున్నాయి. పథకాలపై ప్రజాప్రతినిథులు వివరిస్తుంటే.. ధరలు, పన్నులు, అభివృద్ధి పనులు, రోడ్లపై జనం ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో అక్కడక్కడ అసంతృప్తి తప్పడం లేదు.

    తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల కేంద్రంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గడపడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐతే ఓ వార్డులో పర్యటించి ఇంటింటికీ వెళ్లి సమస్యల గురించి అడిగే ప్రయత్నం చేశారు మంత్రి. కానీ అక్కడున్న ప్రజలు మాత్రం మంత్రిగారిని గట్టిగానే నిలదీశారు. దీంతో ఆయన కూడా కాస్త ఆగ్రహానికి గురయ్యారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    ఇది చదవండి: అది ఆయన పిచ్చితనమే.. భజన బ్యాచ్ ఎక్కువయ్యారు.. రోజా హాట్ కామెంట్స్..


    ఇదిలా ఉంటే ఆదివారం ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. గడప గడపకు ప్రభుత్వంలో భాగంగా ఆయన తన సొంత నియోజకవర్గంలోని ప్రజల చెంతకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ మహిళ నుంచి ఊహించని నిరసన ఎదురైంది. ఒక్కో కుటుంబం కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన ఆమె కు వివరించే ప్రయత్నం చేశారు.. కానీ ఆమె వెంటనే సామాన్య ప్రజల దగ్గర తీసుకున్న సొమ్మునే కదా తిరిగి ఇస్తున్నారు అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేసింది.

    ఇది చదవండి: మొన్నటివరకు వానలు.. ఇప్పుడేమో ఎండలు.. ఏపీలో వింత వాతావరణం.. కారణం ఇదే..!


    ఆమె ఎదురు ప్రశ్నతో షాక్ కు గురైన మంత్రి వెంటనే తేరుకొని సమాధానం చెప్పే ప్రయత్నం చేయగా.. ఆమె వెనక్కు తగ్గలేదు. వంట నూనే నుంచి పెట్రోల్ వరకు అన్ని ధరలు పెరిగాయి కదా అంటూ ప్రశ్నించింది. దానికి మంత్రి సమాధానం ఇస్తూ.. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పెరిగిందని.. హైదరాబాద్ లోనూ అదే రేట్లు ఉన్నాయని వివరించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె ప్రశ్నిస్తుండడంతో అసలు మీకు వినే ఉద్దేశం లేదమ్మా అంటూ మంత్రి కాస్త విసుక్కున్నారు.



    అటు అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ గడపగడపకు కార్యక్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. పలు గ్రామాల్లో ఆయన్ను ప్రజలు నిలదీశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Ambati rambabu, Andhra Pradesh, Ysrcp

    తదుపరి వార్తలు