హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Roads: ఏపీలో రోడ్లపై పేలుతున్న జోక్స్.. సోషల్ మీడియాలో మీమ్స్ వరద

AP Roads: ఏపీలో రోడ్లపై పేలుతున్న జోక్స్.. సోషల్ మీడియాలో మీమ్స్ వరద

ఏపీలో రోడ్లపై సోషల్ మీడియాలో జోకులు

ఏపీలో రోడ్లపై సోషల్ మీడియాలో జోకులు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోడ్ల పరిస్థితిని (AP Roads) ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో నిరసన వెల్లువెత్తుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ (Janasna Party) తో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం (Telugu Desham) డిజిటల్ ఉద్యమం చేపట్టడంతో ఏపీలో రోడ్లు ఇంత దారుణంగా ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది

ఇంకా చదవండి ...

  Anna Raghu, Sr. Correspondent, News18, Amaravati

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోడ్ల పరిస్థితిని (AP Roads) ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో నిరసన వెల్లువెత్తుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ (Janasna Party) తో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం (Telugu Desham) డిజిటల్ ఉద్యమం చేపట్టడంతో ఏపీలో రోడ్లు ఇంత దారుణంగా ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు మండిపడుతున్నా రోడ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ రోడ్లపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపై గుంతలతో జనాలు పడుతున్న బాధకు కాస్త కామెడీ టచ్ ఇస్తున్నారు నెటిజన్లు. జనసేన పార్టీ అయితే కార్టూన్లతో ప్రభుత్వాన్ని ఎండగడతోంది. కొందరైతే ఏపీలో రోడ్ల గురించి ప్రముఖులు మాట్లాడిన మాటలను వైరల్ చేస్తూ జోకులు పేల్చుతున్నారు. ప్రస్తుతం ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

  రోడ్లకు సంబంధించి హిట్ సినిమా డైలాగులతో కొందరు మీమ్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం తెలంగాణ మంత్రి కేటీఆర్, చిన్నజీయర్ స్వామి కామెంట్స్ ను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. గతంలో చిన్నజీయర్ స్వామి రాజమండ్రి వచ్చినప్పుడు జంగారెడ్డిగూడెం నుండి రాజమహేంద్రవరం ప్రయాణించిన ప్రయాణం ఈపాటికి జ్ఞాపకం ఉండేటు ఉందని ఎక్కడో గుంతలు రావటం సహజమని కానీ కానీ ఈ రహదారిలో ఎక్కడో రోడ్ ఉండటం మరచిపోలేని జ్ఞాపకం అని అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

  ఇది చదవండి: మోదీ పర్యటనపై పవన్ కల్యాణ్ క్లారిటీ.. అందుకే దూరంగా ఉన్నానన్న జనసేనాని


  అంతేకాదు తెలంగాణ మంత్రి కేటిఆర్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తన మిత్రులు సంక్రాంతికి ఆంధ్రా వెళ్లారని అక్కడి రహదారుల పరిస్థితి చూసి తెలంగాణా లో అభివృద్ధి గురించి మాట్లాడేవారికి నాలుగు బస్సు లు పెట్టి ఆంధ్ర పంపాలని అప్పుడు ఆంధ్రలో నీళ్లు, కరెంట్ లేవని రోడ్లన్నీ ధ్వంసమైన రోడ్ల గురించి తెలుస్తుందంటూ జోకులు పేల్చారు.

  అంతేకాదు గుంటలు+ఊరు= గుంటూరు అని, రోడ్లపై గుంతలను నదులతో పోల్చడం, అవే గుంతలను రాజధానులతో పోలుస్తూ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. గుడ్ మార్నింగ్ సీఎంసర్ పేరుతో జనసేన, చెత్తరోడ్లు – చెత్త ముఖ్యమంత్రి అంటూ టీడీపీ చేపట్టిన డిజిటల్ ఉద్యమం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం వంటివి మీమ్స్ కు కారణమవుతున్నాయి.

  ఇది చదవండి: గోదావరిలో మొదలెట్టి పులివెందులలో ముగిస్తాం.. కోనసీమలో పవన్ హాట్ కామెంట్స్..


  ఇక రాష్ట్రంలోని రోడ్లన్నీ కలిపి 53,403 కి.మీ పొడవుగా 2018 లో లెక్కించారు అందులో నేషనల్ హైవేలు 6,401 కి.మీ. పొడవు, స్టేట్ హైవేలు 14,722 కి.మీ. పొడవు, జిల్లా రోడ్లు 32,280 కి.మీ. పొడవు ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవస్థలో రహదారుల నిర్వహణకు సమన్వయం చేసుకోవలసిన శాఖల పనితీరు లోపం కారణంగా పనులు సకారంలో జరగడం లేదని.., రోడ్ల లైఫ్ టైమ్ ను బట్టి నిర్వహణ, మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంతో గోతులమయంగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో దాదాపు 30 వేల కి. మీ విస్తరించిన రహదారులన్నీ మూడేళ్ళుగా పట్టించుకొనే వ్యవస్థ లేక ప్రయాణించటానికి వీలు లేనంత గోతులతో దుర్భరంగా మారిపోయాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Janasena party, Social Media, TDP

  ఉత్తమ కథలు