హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chiranjeevi: పొలిటికల్ టర్న్ తీసుకున్న చిరు-గరికిపాటి వివాదం.. జనసేన వర్సెస్ బ్రాహ్మణ సంఘాల ఫైట్

Chiranjeevi: పొలిటికల్ టర్న్ తీసుకున్న చిరు-గరికిపాటి వివాదం.. జనసేన వర్సెస్ బ్రాహ్మణ సంఘాల ఫైట్

పొలిటికల్ టర్న్ తీసుకున్న చిరు-గరికిపాటి వివాదం

పొలిటికల్ టర్న్ తీసుకున్న చిరు-గరికిపాటి వివాదం

Chiranjeevi: తెలంగాణలో జరిగిన ఓ చిన్న పాటి ఇష్యూ.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రచ్చ రచ్చ అవుతోంది. చిరంజీవి-గరికపాటి మధ్య వివాం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. జనసేన వర్సస్ బ్రహ్మణ సంఘాల మధ్య ఫైట్ గా మారుతోంది. మరి ఈ వివాదానికి ఇప్పట్లో పుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపించడం లేదు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Chiranjeevi-Garikapati Controversy: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి (Garikapati) మధ్య చిన్న వివాదం ఇప్పుడు పొలిటికల్ టర్న్ (Political Turn) తీసుకుంది. సాధారణంగా కోట్లాది మంది అభిమానం మెగాస్టార్ చిరంజీవికి సొంతం.. కేవలం నటుడిగానే కాదు.. రాజకీయంగా.. సామాజిక సేవలోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం సినీరంగం పెద్దగా చిరును  అంతా గౌరవిస్తారు. దేశవ్యాప్తంగా అభిమాన గణం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య కోట్లలో ఉంటుంది. వెండితెరపై నటిస్తున్న చాలామంది హీరోలు, హీరొయిన్లు సైతం చిరంజీవిని అభిమానిస్తుంటారు.

  రాజకీయాలకు ప్రస్తుతం ఆయన దూరంగా ఉన్నా.. ఆయన చుట్టూ రాజకీయాలు (Politics) తిరుగుతూనే ఉంటాయి. వర్ధమాన నటీ నటులు.. ఇతర ఆర్టిస్టులు.. రాజకీయ నేతలు అంతా చిరంజీవితో సెల్ఫీలు దిగేందుకు ఇష్టపడతారు. జెండర్ తోనూ.. వయసుతోనూ సంబంధం లేకుండా చిరంజీవితో చేయి కలపాలని ప్రయత్నిస్తారు.

  అదంతా సినిమా అభిమానమే కాదు. చిరంజీవి అనే వ్యక్తికి లభించే అరుదైన గౌరవం అని చెప్పాలి. అలాంటి పరిస్థితే తాజాగా హైదరాబాద్ లోని అలయ్ బలయ్ లో చోటు చేసుకుంది. అభిమానులు చిరంజీవిని చుట్టముట్టడంతో ప్రవచనకర్త గరికిపాటి ప్రవచనాలకు ఇబ్బంది కలిగింది. దీంతో నేరుగా చిరంజీవి మొహం మీదా ఆయన సున్నితంగా చెప్పారు. మీరు ఫోటో సెషన్ ఆపకపోతే తాను.. కార్యక్రమం నుంచి వెళ్లిపోతాను అంటూ హెచ్చరించారు. దీంతో ఇష్యూ వివాదాస్పదమైంది. అయితే వివాదం అప్పుడే సద్దుమణిగేది.. కానీ గరికిపాటి పై నాగబాబు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఆ వెంటనే చిరంజీవి అభిమానులు రియాక్టు కావడం, అటు బ్రాహ్మణ సంఘాలు స్పందించడం వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది.

  ఇదీ చదవండి : విశాఖలో అత్యధిక సీట్లు నెగ్గడమే టార్గెట్.. సీఎం జగన్ భారీ స్కెచ్.. ఏంటో తెలుసా?

  నిజం చెప్పాలి అంటే ఇది చాలా సున్నితమైన అంశం.. గరికిపాటి తన అవధానం ప్రారంభించేసరికి మరోవైపు చిరంజీవితో అభిమానులు ఫొటోలు దిగుతున్నారు. ఇది ఆయనకు కొంచెం ఇబ్బంది కలిగించింది. దీంతో గరికిపాటి అసహనానికి గురయ్యారు. మీరు ఫొటో సెషన్ ఆపకపోతే తాను కార్యక్రమం నుంచి వెళ్లిపోతాను అంటూ అలక హెచ్చరికలు చేశారు. దీంతో అక్కడున్న వారు సముదాయిస్తే కానీ శాంతించలేదు. ఇబ్బందిని గమనించిన చిరంజీవి ఫొటో సెషన్ నిలిపివేసి.. గరికిపాటి పక్కకు వచ్చి కూర్చుని.. వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు.

  ఇదీ చదవండి : కేసీఆర్ కొత్త పార్టీతో చంద్రబాబు అలర్ట్.. నేతలతో ప్రత్యేక సమావేశం.. వెళ్లేది ఎవరు..?

  ఆ తరువాత గరికిపాటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ ఎపిసోడ్ ముగిసింది అనుకున్నారు అంతా.. కానీ మెగా బ్రదర్ నాగబాబు రియాక్టు అయ్యారు. చిరంజీవిని చూస్తే ఏపాటి వాడికైనా ఈపాటి అసూయ ఉంటుందని కామెంట్స్ చేశారు.

  ఇక నాగబాబు కామెంట్ చేయడంతో.. మెగా అభిమానులు, జనసైనికులు ఓ రేంజ్ లో గరికిపాటిపై పడ్డారు. చిరంజీవికి గరికిపాటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో సైతం కామెంట్లు పెడుతున్నారు.

  ఇదీ చదవండి: తిరుమలలో కన్నుల పండుగగా బాగ్ స‌వారి.. ఎందుకు చేస్తారు..? ప్రత్యేకత ఏంటి..?

  దీనిపై బ్రహ్మణ సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. సినిమాల పేరుతో వ్యాపారం చేసుకునేవాడికి.. ప్రవచనాలు చెప్పే పండితుడికి పోలిక ఏంటని? ప్రశ్నిస్తున్నాయి. వివాదాన్ని మరింత జఠిలం చేశాయి. వాస్తవానికి ఇదో సున్నితమైన అంశం. అలయ్ బలయ్ అంటేనే అందరితో కలిసిపోవడం. చిరంజీవిలాంటి వ్యక్తి వస్తే అభిమానులు ఆ మాత్రం ఎగబడతారు. ఆ సమయంలో గరికిపాటి చమత్కారంగా వ్యవహరించాల్సి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. అయితే చిరంజీవి హుందాగా వ్యవహరించి వివాదాన్ని అక్కడితో ముగిసేలా చేస్తే.. నాగబాబు దానికి ఆజ్యం పోశారు. దీంతో అది పొలిటికల్ వార్న్ గా మారింది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Garikipati Narasimha Rao, Megastar Chiranjeevi

  ఉత్తమ కథలు