హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chiranjeevi: అందుకే అంత ఫాలోయింగ్.. పవన్ మూడు పెళ్లిళ్లపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

Chiranjeevi: అందుకే అంత ఫాలోయింగ్.. పవన్ మూడు పెళ్లిళ్లపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

 పవన్ మూడు పెళ్లిళ్ల పై చిరు సంచలన వ్యాఖ్యలు

పవన్ మూడు పెళ్లిళ్ల పై చిరు సంచలన వ్యాఖ్యలు

Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల వ్యవహారమే హైలైట్ అవుతోంది. సీఎం జగన్ తో సహా.. వైసీపీ మంత్రులు, నేతలు అంతా పవన్ పెళ్లిళ్లను రాజకీయ అస్త్రంగా వాడుతున్నారు. ఈ విమర్శలపై మెగాస్టర్ చిరంజీవి స్పందించారు. ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు ప్రస్తుతం వైసీపీ వర్సెస్ పవన్ గా మారాయి.. అధికార పార్టీ ప్రధానంగా పవన్ నే టార్గెట్ చేస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) దగ్గర నుంచి మంత్రులు.. నేతలు అంతా పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక పవన్ వారహి పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతుండడంతో ఆయన టార్గెట్ గా విమర్శలు దాడి పెంచేందుకు ప్రత్యర్థి పార్టీ అస్త్రాలు సిద్ధం చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడు పెళ్లిళ్ల పై తరచూ విమర్శలు చేస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పినా.. వైసీపీ నేతలు మాత్రం దానిపై విమర్శలు వదలడం లేదు. తాజాగా వైసీపీ విమర్శలపై అన్నయ్య.. మెగాస్టర్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్పందించారు. వాల్తేరు వీరయ్య (Valteru Veerayya) సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆయన.. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయం గురించి అడిగితే నో కామెంట్స్ అంటూ మాట దాటేశాడు. అక్కడితోనే ఆయన ఆగలేదు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేస్తుంటారు దాని పై మీ స్పందన ఏంటి అని ప్రశించగా, చిరంజీవి బదులిచ్చారు. ఆ విషయంలో నిజానిజాలు ప్రజలకి తెలుసు అని అభిప్రాయపడ్డారు. ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు అది నమ్మాలా, నమ్మకూడదా అనే విచక్షణ ప్రజలకు ఉంటుందన్నారు. వారంతా అలా ఆలోచిస్తారు కాబట్టే ఈరోజు కళ్యాణ్ బాబుకి ఇంతటి ఫాలోయింగ్ ఉందన్నారు చిరంజీవి.

ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులు పలు రకాల కామెంట్స్ చేస్తారు.. అలా చేసుకోనివ్వండి అన్నారు. కానీ తాను వాటి గురించి మాట్లాడాను అన్నారు. ప్రస్తుతం తాను రాజకీయానికి దూరంగా ఉందాం అనుకుంటున్నా అన్నారు. పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నా అని తన తమ్ముడిని దూరం చేసుకోలేను కదా అన్నారు.. పవన్ తన తమ్ముడడని, ఎక్కడవున్నా తన తమ్ముడు తనకు బిడ్డ లాంటి వాడు అంటు బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా చిరు మాట్లాడుతూ.. పవన్ ని విమర్శించే వాళ్ళు, తన దగ్గరకి వచ్చి తనను పలకరిస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది అంటూ మనసులో మాట బయట పెట్టారు.

ఇదీ చదవండి : లోకేష్ పాదయాత్రకు అనుమతి.. షరుతులు వర్తిస్తాయి.. ఆంక్షలు ఇవే

మరోవైపు ప్రస్తుతం చిరంజీవి ఈ ఏడాదిని బ్లాక్ బస్టర్ హిట్టుతో ప్రారంభించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. కె బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా నటించాడు. ఈ చిత్రంలో చిరు.. వింటేజ్ లుక్స్, డాన్స్, యాక్షన్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడంతో ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టి మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ చూపించింది. ఓవర్ సీస్‌లో కూడా ఈ చిత్రం 2.25 మిలియన్స్ కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Chiranjeevi, Janasena, Pawan kalyan, Valteru Veerayya Movie

ఉత్తమ కథలు