Home /News /andhra-pradesh /

AP POLITICS MEGASTAR CHIRANJEEVI REJECTED PRIME MINSTER MODI OFFER WHY HE IS NOT INTRESTED NGS

PM Modi-Chiranjeevi: ప్రధాని ఆఫర్ ను చిరంజీవి తిరస్కరించారా? ఆయన నో అంటే రాజమౌళి ఫ్యామిలీకి ఛాన్స్ దక్కిందా?

మోదీ సభలో అందరూ మహా నటులే

మోదీ సభలో అందరూ మహా నటులే

PM Modi- Chiranjeevi: ప్రధాని మోదీ ఇచ్చిన ఆఫర్ ను చిరంజీవి తిరస్కరించారా..? ఆయన వద్దు అనుకుంటేనే రాజమౌళి కుటుంబానికి ఆఫర్ షిప్ట్ అయ్యిందా..? ఇంతకీ చిరంజీవికి ఆఫర్ ఇచ్చింది ఎవరు..? ఆయన ఎందుకు తిరస్కరించారు.

  PM Modi- Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వర్గాలతో పాటు.. టాలీవుడ్ (Tollywood) లో ఓ వార్త ఆలస్యంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల అల్లూరి సీతారామా రాజు విగ్రహ (Alluri Sitaramaraju Statue) ఆవిష్కరణ కోసం భీవరం సభకు వచ్చిన ప్రధాని మోదీ (Prime Minster).. అదే సభకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కు మంచి ఆఫర్ ప్రకటించారా? స్వయంగా ప్రధాని ఇచ్చిన ఆఫర్ ను చిరంజీవి సున్నితంగా తిరస్కరించారా? ఫిల్మ్ నగర్ లో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీనే స్వయంగా చిరంజీవిని కోరినా.. ఆయన మాత్రం రాజకీయాలకంటే సినిమాయే బెటర్ అనుకున్నారానే ప్రచారం జరుగుతోంది.

  అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అందర్నీ కాదని చిరంజీవిని పిలవడం వెనుక ఉన్న భారీ స్కెచ్ కూడా అదే అంటున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి హోదాలో పిలిచినామని చెప్పుకున్నప్పటికీ తెర వెనుక చాలా జరిగిందన్న ప్రచారమైతే నడుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రపతి కోటాలో చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ చేసినట్టు ప్రచారం ఉంది. అదే విషయం స్వయంగా ప్రధాని మోదీ చిరంజీవికి చెప్పినట్టు టాక్. ఎందుకంటే ఇటీవల దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రకటించిన నలుగురి పేర్లలో తొలి పేరు చిరంజీవిదే ఉండాలి అనుకున్నారట. ఈ ఆఫర్ ను చిరంజీవి తిరస్కరించారట.  అలా చిరంజీవి వదులుకున్న చాన్సే విజయేంద్రప్రసాద్ కు వెళ్లినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. వాస్తవానికి అల్లూరి విగ్రహావిష్కరణకు చిరంజీవికి ఎనలేని ప్రాధాన్యం దక్కింది. తన మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ ను పక్కనపెట్టి మరీ ఆయన సోదరుడు చిరంజీవిని పిలవడం వెనుక పెద్ద కథే నడిచినట్టు జనసేన వర్గాల భావన. అంతకంటే ముందుగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ జీవిఎల్ నరసింహరావు చిరంజీవితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసేందుకు ప్రధాని మోదీ సుముఖంగా ఉన్నట్టు వారు చిరంజీవి చెవిలో చెప్పారని సమాచారం..

  ఇదీ చదవండి : ప్రధాని ఆఫర్ ను చిరంజీవి తిరస్కరించారా? ఆయన నో అంటే రాజమౌళి ఫ్యామిలీకి ఛాన్స్ దక్కిందా?

  ఆ విషయం చెప్పిన తరువాత మెగాస్టార్ నుంచి సానుకూల స్పందన వస్తుందని వారు భావించారని.. కానీ అందుకు తాను సుముఖంగా లేనని.. సినిమాలతో బీజీగా ఉన్నానని.. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని బదులివ్వడంతో ఆ నాయకులు ఇద్దరూ షాక్ కు గురయ్యారని ప్రచారం ఉంది. అయతే ఇది బీజేపీ నుంచి ఇచ్చిన ఆఫర్ కాదని.. రాష్ట్ర పతి కోటాలో ఇస్తున్నట్టు సముదాయించినా చిరంజీవి తిరస్కరించారని తెలుస్తోంది. అల్లూరి సభా వేదికపై ప్రధాని మోదీ కూడా చిరంజీవికి ఎనలేని ప్రాధాన్యిమివ్వడం కూడా అందులో భాగమే అంటున్నారు. అయితే తనకు రాజకీయాలపై ఇంట్రస్ట్ లేదంటూ చిరంజీవి చెప్పడంతో బీజేపీ పెద్దలు సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది.

  ప్రస్తుతానికి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాగని ఇప్పటివరకూ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు కూడా. అలా అని యాక్టివ్ గా రాజకీయాల్లో లేరు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు తీసుకోవాలన్న అధిష్టాన సూచనను సైతం తిరస్కరించారు. అప్పటి నుంచి ఆయన్ను కాంగ్రెస్ పార్టీ సైతం పట్టించుకోవడం లేదు.

  ఇదీ చదవండి : మొన్న చెల్లి.. ఇప్పుడు అమ్మ.. నెక్ట్స్ ఎవరు? నవరత్నాలు కాదు.. నవ ఘోరాలంటూ చంద్రబాబు ఫైర్

  బీజేపీ స్కెచ్..
  చిరంజీవికి రాజ్యసభ ఎంపిక విషయంలో బీజేపీ చాలా దూరంగా ఆలోచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన మిత్ర పక్షంగా ఉన్న కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో పవన్ బీజేపీకి దూరంగా జరుగుతున్నారు. అవసరమైతే చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటానని సంకేతాలు పంపుతున్నారు. మరోవైపు ఏపీలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బీజేపీ ఆశించిన స్థాయిలో బలోపేతం కావడం లేదు. చరిష్మ ఉన్న నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీకి మైనస్ గా మారుతుంది. అదే చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చని ఆలోచించింది. అదే సమయంలో కాపు సామాజికవర్గం అభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నించింది.

  ఇదీ చదవండి : ముద్దు ముద్దు మాటలతోనే రికార్డులు.. రెండున్నరేళ్లకే ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు

  ఇప్పటికే క్షత్రియ సామాజికవర్గం అభిమానాన్ని పొందిన బీజేపీ కాపుల విషయంలో చేయని ప్రయత్నమంటూ లేదు. కన్నా లక్ష్మీనారాయణ, తరువాత సోము వీర్రాజులకు రాష్ట్ర అధ్యక్షులుగా నియమించింది. తాజాగా చిరంజీవిని తెరపైకి తెస్తే కాపులకు మరింత దగ్గర కావచ్చన్నది అంచనాగా వేసింది. కానీ చిరంజీవి తిరస్కరించడంతో కథ అడ్డం తిరిగి స్కెచ్ రివర్స్ అయ్యింది అంటున్నారు జనసైనికులు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Bjp, Chiranjeevi, Pm modi, Prime minister

  తదుపరి వార్తలు