సోమవరాం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులెవరూ వెళ్లలేదు. కనీసం అభినందనలు కూడా చెప్పలేదు. దీంతో ఈ విషయంపై ఏపీ రాజకీయ పార్టీలతోపాటు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు జగన్‌తో భేటీ అవ్వడం ఏపీ అంతటా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వీరిద్దరూ ఏయే విషయాల పట్ల చర్చించారన్న విషయంపై అంతా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ భేటీపై మాట్లాడిన చిరంజీవి... జగన్ ప్రమాణ స్వీకారానికి ఎందుకు వెళ్లలేదన్న దానిపై వ్యాఖ్యలు చేశారు. తాను సైరా షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగానే... జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేకపోయానన్నారు. జగన్ సీఎం కాగానే, ఆయన్ను కలిసి అభినందించాలని అనుకున్నానన్నారు చిరంజీవి. రెండు రాష్ట్రాల్లోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని జగన్ ఆకాంక్షించారని తెలిపారు. సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారన్నారు చిరు. పరిశ్రమకు ఏది కావాలన్న సంకోచించకుండా తనని అడగాలని కూడా జగన్ కోరినట్టు చిరంజీవి తెలిపారు. జగన్‌తో భేటీ సొంత కుటుంబీకులతో గడిపిన అనుభూతిని కలిగించిందన్నారు మెగాస్టార్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Chiranjeevi, Mega Family, Sye Raa Narasimha Reddy Movie Review, Tollywood, Tollywood news