హోమ్ /వార్తలు /andhra-pradesh /

పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్... చిరంజీవి ఇలా చేశారేంటి ... ఆందోళనలో ఫ్యాన్స్?

పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్... చిరంజీవి ఇలా చేశారేంటి ... ఆందోళనలో ఫ్యాన్స్?

పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చిన చిరంజీవి

పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చిన చిరంజీవి

ఆచార్య ప్రిరిలీజ్ ఈవెంట్‌కు ముందుగా పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా వస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అలా కాకుండా ఏపీ సీఎం జగన్‌ను చిరు ఆహ్వానించడం అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

  మెగా బ్రదర్స్ చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి తెలిసిందే. సినిమాల్లో ఇద్దరు బ్రదర్స్ పోటా పోటీగా రాణించారు. ఎవరికి తగ్గట్టుగా వారు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నటనలో తమకు ఎదురు లేదని అనిపించుకున్నారు. అయితే రాజకీయాల విషయానికి వస్తే.. మెగా బ్రదర్స్‌ది తలోదారి. అందరికంటే ముందే చిరు(Chiranjeevi politics) పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఎక్కువ కాలం నిలబడలేకపోయారు. కొన్నాళ్లు పాటు ఉంది వెంటనే మళ్లీ సినిమాలవైపే వెళ్లిపోయారు. తనకు రాజకీయాలు సెట్ కాలేదని చిరు కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రూటు కాస్త సెపరేటు అనే చెప్పాలి. చిరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కూడా అన్నకు మద్దతుగా అనేక చోట్ల ర్యాలీలు, మీటింగులు నిర్వహించారు. పొలిటికల్‌గా హాట్ హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఆ తర్వాత అన్న బాటలోనే పయనించి పార్టీ కూడా పెట్టారు. జనసేన పార్టీని స్థాపించి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

  2014లో జనసేన(Janasena party) పార్టీ స్థాపించారు పవన్ కళ్యాణ్. అప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొన్ని పార్టీలకు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మాత్రమే పవన్ జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే ఆ ఎన్నికల్లో కేవలం ఒక సీటు మాత్రమే గెలచుకుంది.అయినా కూడా పవన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. యాక్టివ్ పాలిటిక్స్‌లో పాల్గొనే వస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. పవన్ అటు పాలిటిక్స్‌తో పాటు.. ఇటు సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే ఏపీలో జగన్(AP CM Jagan) సర్కార్‌కు, పవన్ కళ్యాణ్ పార్టీకి మధ్య ఎప్పటికప్పుడు మాటల యుద్దంకొనసాగుతూ ఉంటుంది. అటు సోషల్ మీడియా వేదికపై కూడా జగన్, పవన్ అభిమానులు మధ్య వార్ ఆఫ్ వార్డ్స్ నడుస్తూనే ఉంటాయ. ఈ క్రమంలో చిరంజీవి తీసుకున్న ఓ నిర్ణయం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదు. చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న ఆచార్య(Acharya) సినిమా త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే.

  అయితే ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm ys jagan mohan reddy) వస్తారన్న వార్త ఇప్పుడు పవన్ ఫ్యాన్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. స్వయంగా చిరంజీవినే జగన్‌ను ఈ ఈవెంట్‌కు ఆహ్వానిస్తారనే విషయం మెగా అభిమానులకు మింగుడు పడటం లేదు. చిరంజీవి ఇలా చేస్తున్నారేంటి అన్న ప్రశ్నలు అందర్నీ వెంటాడుతున్నాయి. తమ్ముడు వ్యతిరేకిస్తున్న జగన్‌‌ను ... అన్న ఎందుకు కలుపుకొని వెళ్తున్నారని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. పొలిటికల్‌గా మెగా బ్రదర్స్ వేరు అయ్యారా ? రాజకీయంగా వీరి దారులు వేరేనా ? ఎప్పటికీ కలవరా ? అన్న అంశాలపై ఫ్యాన్స్ అంతా తర్జనబర్జన పడుతున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే బలమైన కారణంతోనే మెగాస్టార్.. సీఎం జగన్‌ను ఆచార్య ప్రిరిలీజ్ ఈవెంట్‌కు పిలుస్తున్నట్లు తెలుస్తోంది.

  ఆచార్య(Acharya) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో నిర్వహించనున్నట్టు, దానికి ముఖ్య అతిధిగా ఏపీ సీఎం జగన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల సినిమా టికెట్లు, థియేటర్ల విషయంలో సినీ పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలని ఏపీ ప్రభుత్వం బాగా ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సమస్యలని తొలగించడానికి చిరంజీవి ముందుండి పలు మార్లు జగన్ ని కలిసి సమస్య పరిష్కరించడానికి తన వంతుగా ప్రయత్నం చేశారు. పలువురు సినీ ప్రముఖుల్ని వెంటబెట్టుకొని చిరు.. జగన్‌(Chiranjeevi cm jagan meeting)తో భేటీ అయి చర్చలు జరిపారు.దీంతో ఏపీలో సినీ సమస్యలు పరిష్కారం అయ్యాయి.దీనికి కారణం చిరంజీవియే అని టాలీవుడ్‌వర్గాల్లో జోరుగా చర్చ కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఏపీ ప్రభుత్వానికి... టాలీవుడ్‌(Tollywood)కు మధ్య ఉన్న గ్యాప్‌ను పోగొట్టేందుకు చిరు.. జగన్‌ను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. మరి చిరు ఆహ్వానం మన్నించి జగన్ వస్తారా లేదో వేచి చూడాలి.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Acharya, Ap cm jagan, Megastar Chiranjeevi, Pawan kalyan

  ఉత్తమ కథలు