Ram Charan Fans: టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో.. మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న చిత్రం ఆచార్య (Acharya). తనయుడు రామ్ చరణ్ (Ramcharan) కూడా కీ రోల్ పోషిస్తున్నాడు. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించిన సినిమా ఆచార్య. మెగా ఫ్యాన్స్ ఎంతగానే వేచి చూస్తున్న ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈనెల 29న ఆచార్య సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. అందుకే ఇప్పుడు మెగా అభిమానులు ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఈ సినిమాపై ఆచార్య టీంతో పాటు.. అభిమానులు కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవితో పాటు, రామ్ చరణ్ బిజీగా ఉన్నారు. సినిమా విడుదలవుతున్న క్రమంలో.. కొరటాల శివ, రామ్ చరణ్ లు విజయవాడ (Vijayawada)ఇంద్రకీలాద్రిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా విజయవాడ దుర్గమ్మ సన్నిధికి చేరుకున్న రామ్ చరణ్.. అక్కడి అభిమానుల తీరు చూసి తీవ్ర నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. అది ప్రముఖ పుణ్యక్షేత్రమని.. అలాంటి ప్రాంతంలో చాలా క్రమశిక్షణతో ఉండాలని.. తోటి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండాలనే విషయాన్ని మరిచిపోయారు. రామ్ చరణ్ అభిమానులు అత్యుత్సాహానికి పాల్పడ్డారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిలోకి చరణ్ ఫ్యాన్స్ చొచ్చుకుని వచ్చారు. ఎన్నడూ లేని విధంగా దుర్గమ్మ గుడి అంతరాలయంలో జై చరణ్ అంటూ నినాదాలు చేయడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. అభిమానులు చేసిన పనికి రామ్ చరణ్ నిరుత్సాహానికి గురయినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి భారతిని మాట అంటే ఊరుకోం.. చీరలు కట్టుకోవాల్సింది వారే.. రోజా సంచలన వ్యాఖ్యలు
ముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం రామ్ చరణ్ తో పాటు కొరటాల శివ కూడా రావాల్సి ఉంది.. కానీ రెండు గంటల పాటు లేట్ గా వచ్చారు. ముందుగానే ఈ విషయం అభిమానులకు తెలిసిపోవడంతో వారు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. రామ్ చరణ్ రాగానే.. ఆయన్ను చూడడానికి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముందుకు తోసుకరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. రామ్ చరణ్, కొరటాల శివ వెంటే ఆలయంలోకి చొచ్చుకొని రావడంతో.. ఆలయ గ్రిల్స్ విరిగిపోయాయి. వీరిని కంట్రలోల్ చేయడంలో అధికారులు, పోలీసులు చేతులెత్తేశారు.
ఇదీ చదవండి: చేతులే కలిశాయి.. చూపులు కలిసేది ఎప్పుడో..? అనిల్ ఇంటికి వెళ్లిన మంత్రి
దుర్గగుడి అంతరాలయంలో జై దుర్గమ్మ, జైజై దుర్గమ్మ నినాదాలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం జై చరణ్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. అంతేగాకుండా హుండీపై నిల్చొని నినాదాలు చేస్తూ.. వీడియోలు తీసుకోంటూ అత్యుత్సాహానికి పాల్పడ్డారు. అక్కడున్న భక్తులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
ఇదీ చదవండి: రోజా అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. వారంతా ఉన్మాధులంటూ మంత్రి కామెంట్
రామ్ చరణ్ అభిమానులు అలా చొచ్చుకుని వచ్చి అత్యూత్సాహం ప్రదర్శిస్తే.. పూర్తిగా దుర్గగుడి అధికారులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించాంటూ భక్తులు మండిపడుతున్నారు. దుర్గగుడిని అపవిత్రం చేశారంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya movie, Andhra Pradesh, AP News, Mega power star ram charam, Ramcharan