హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nagababu: అన్నయ్య మాటలతో తమ్ముళ్లకు బూస్ట్.. పగ్గాలు చేపట్టి తీరుతామంటున్న మెగా బ్రదర్

Nagababu: అన్నయ్య మాటలతో తమ్ముళ్లకు బూస్ట్.. పగ్గాలు చేపట్టి తీరుతామంటున్న మెగా బ్రదర్

 Chiranjeevi God Father Photo Twitter

Chiranjeevi God Father Photo Twitter

Nagababu: మెగాస్టర్ చిరంజీవి మాటలు ఇప్పుడు జనసైనికులకు బూస్ట్ లా మారాయి. దీంతో ఇకపై ఎన్నికల రంగంలోకి మరింత దూకుడుగా వెళ్లాలని భావిస్తున్నారు. అన్నయ్య కలిస్తే.. అద్భుతమే అంటున్నారు.. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అంటూ కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Nagababu: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chirnjeevi) వ్యాఖ్యలు ఇంకా పొలిటికల్ ఇంట్రెస్ట్ పెంచుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జనసైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇంతకాలం చిరంజీవి మనసులో ఏం ఉందో తెలియక.. కన్ఫ్యూజ్ అవుతున్నారు. భవిష్యత్తులో చిరంజీవికి అన్నయ్య మెగాస్టర్ మద్దతు లేకుండా.. రాష్ట్రంలో అధికార పార్టీకి మద్ధతు ఇస్తే కష్టాలు తప్పవని భయపడుతున్నారు. దీంతో ఆయన ఏ టర్న్ తీసుకుంటారు అన్నది ఇంతకాల ఉత్కంఠ పెంచింది.. ఇంతకీ చిరంజీవి ఏమన్నారంటే? చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ (God Father) దసరా (Dussehra) కానుక గా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే అంతకుముందు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిరంజీవి.. ఏపీ రాజకీయాలనపైనా..తన తమ్ముడిపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)  కు భవిష్యత్‌లో మద్దతిస్తానేమోనంటూ చిరంజీవి పేర్కొన్నారు. పవన్‌ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని.. పవన్ లాంటి నిబద్ధత కలిగిన నాయకులు రావాలంటూ ఆకాంక్షించారు.

  పవన్ మంచి స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని తెలిపారు. తామిద్దరం చెరోవైపు ఉండటం కంటే తాను తప్పుకోవడమే తన తమ్ముడు రాజకీయాల్లో రాణించడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే రాజకీయాల నుంచి తప్పుకున్నాను అంటూ.. ఆయన రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉండాల్సింది అన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు.

  తాను పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయి సైలెంట్‌గా ఉన్నానన్నారు. అలాగే గాడ్ ఫాదర్ సినిమాలోని డైలాగ్స్ పై కూడా చిరంజీవి స్పందించారు. ప్రస్తుత నాయకులపై ఎలాంటి సెటైర్లు వేయలేదంటూ స్పష్టంచేశారు. మాతృకలో ఉన్న కథ ఆధారంగానే డైలాగులు రాశామని తెలిపారు. ఈ డైలాగులు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేం చేయలేను అంటూనే సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఆ వ్యాఖ్యలు మెగా బ్రదర్‌, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు స్పందించారు.

  ఇదీ చదవండి : బావతో బాలయ్య.. ఆ చర్చను తెరపైకి తెస్తారా? జూనియర్ ఎన్టీఆర్ పై క్లారిటీ

  అన్నయ్య మాటలు కోట్లాది మంది తమ్ముళ్ల మనసులు గెలుచుకున్నాయన్నారు. ఆయన ఆశీస్సులతో తమ్ముడు తప్పకుండా పాలన పగ్గాలు చేపడతాడని మెగాబ్రదర్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కు.. మెగాస్టర్ చిరంజీవికి గ్యాప్ పెరిగిందని.. ఆయన ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీకి దగ్గరగా ఉన్నారనే చర్చ జరిగింది. అదే జరిగితే మెగా అభిమానులు రెండుగా చీలి.. జనసేనకు ఇబ్బందులు తప్పవని జనసైనికులు భయపడ్డారు.

  ఇదీ చదవండి: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం.. సెల్ స్విచ్ ఆఫ్ చేశారంటూ ప్రచారం

  ఇప్పుడు ఆ అనుమానాలకు తెరపడినట్టు అయ్యింది. ఇటీవల చిరంజీవి వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చేసినట్టే.. ఎన్నికల సమయానికి అవసరం అనుకుంటే ఆయన నేరుగా రంగంలోకి దిగుతారనే ప్రచారం కూడా ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే.. జనసేనకు గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అని అభిప్రాయపడుతున్నారు. నిజంగా పవన్ తరపున.. చిరంజీవి ప్రచారం చేస్తే.. ఈ సారి కచ్చితంగా పగ్గాలు చేపడతామని.. జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Chirnajeevi, Janasena, Mega brother nagababu, Pawan kalyan

  ఉత్తమ కథలు