Home /News /andhra-pradesh /

AP POLITICS MEGA BRAOTHER NAGABABU HOT COMMENTS ON PRIME MINSTER MEETING IN ANDHRA PRAESH NGS

Nagababu: ప్రధాని సభలో అంతా అద్భుతంగా నటించారు.. మరి అన్నయ్య చిరంజీవి..? నాగబాబు కామెంట్స్ వైరల్

మోదీ సభలో అందరూ మహా నటులే

మోదీ సభలో అందరూ మహా నటులే

Nagababu: ఇటీవల ప్రధాని మోదీ భీమవరంలో పర్యటించారు.. అల్లూరు సీతారామరాజు 30 అడుగుల భారీ కాంస్య విగ్రహావిష్కరణ చేశారు. ఆ సభకు సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి సహా చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఆ రోజు హాజరైన వారంతా మహా నటులు అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...
  Nagababu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రధాని మోదీ (Prime Minster) పర్యటన ముగిసినా.. ఆ సభ చుట్టూ రాజకీయ రచ్చ ఆగడం లేదు. రోజుకో నేత చేసిన కామెంట్లతో వేడి ఇంకా కొనసాగుతోంది. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) 30 అడుగులు భారీ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ భీమ‌వ‌రంలో వైభవంగా జరిగింది. కాళ్ల మండ‌లం పెద అమిరం గ్రామంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతోపాటు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ (Governor biswabhushan Harichandan), ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి (CM Jagan Mohan Reddy), కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి (Central Minter Kishan Reddy), రాష్ట్ర ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి రోజా (Minster Roja) తో పాటు సినీన‌టుడు మెగాస్టార్  చిరంజీవి (Megastar Chiranjeevi) పాల్గొన్నారు. ఈ సభ ద్వారానే వర్చువల్ గా విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ప్రధాని రాకకు ముందు నుంచే సభపై రాజకీయ చర్చ జరిగింది. ఎందుకంటే కేంద్రం నుంచి విపక్ష నేతలకు సైతం ఆహ్వానాలు అందాయి. అందులో తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చ‌న్నాయుడి పేరు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం నుంచి అందిన జాబితాలో ఉన్న‌ప్ప‌టికీ క‌లెక్ట‌ర్‌కు అందిన జాబితాలో లేదంటూ హెలిప్యాడ్ వ‌ద్ద స్వాగ‌తం ప‌ల‌క‌డానికి ప్ర‌భుత్వం ఆయ‌న్ను నిరాక‌రించింది. ఇతర విపక్ష నేతలను సైతం రాకుండానే అధికారులు అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పిలిచి అవ‌మానం చేయ‌డం ఎందుకంటూ అచ్చెన్నాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేయ‌గా కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి క్ష‌మాప‌ణ‌లు కోరారు. ఇలా మొదటి నుంచి ఈ సభ వివాదాలకు కేంద్రంగానే ఉంది.

  అయితే ప్రధాని సభకు విపక్షాలకు చెందిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు, జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నేరుగా హాజరు కాకపోయినా.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌ధాన‌మంత్రికి స్వాగ‌తం ప‌లికారు. ముఖ్యంగా ఇది ప్రభుత్వ కార్యక్రమమే అయినా.. రాజకీయ సభలా నిర్వహించారన్నది విపక్ష నేతల వాదన.. అందులోనూ ప్రధాని ఏపీకి చేరుకున్న దగ్గర నుంచి.. తిరిగి బయలుదేరే వరకు ఆయన ప్రధాని వెంటే ఉన్నారు. అంతే కాదు విభజన హామీలు అమలు చేయాలంటూ ప్రధానికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు.  తాజాగా ఆ సభపై జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌భ్యుడు నాగ‌బాబు ట్వీట్ చేశారు. ''మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ భీమ‌వ‌రంలో అద్భుతంగా జ‌రిగిందని. ఆ స‌భ‌లో అన్న‌య్య చిరంజీవి మిన‌హా అంద‌రూ అద్భుతంగా న‌టించారు. ఆ మ‌హాన‌టులంద‌రికీ నా అభినంద‌న‌లు '' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

  నాగబాబు చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.. అన్నయ్య చిరంజీవి కూడా అదే సభలో వినయంగా కనిపించారు.. మరి ఆయనది అద్భుత నటన కాదా అని ప్రశ్నిస్తున్నారు. అన్నయ్య హాజరైన సభపైనా విమర్శలు చేయడం ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మురోవైపు చాలారోజులుగా ఏపీ ప్ర‌భుత్వ తీరుపై నాగ‌బాబు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Chiranjeevi, Mega brother nagababu, Pm modi

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు