హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Delivery in Train: బిడ్డకు ప్రాణం పోసిన మెడిసన్ విద్యార్థి.. ట్రైన్ లో నిండు గర్భిణికి డెలివరీ..

Delivery in Train: బిడ్డకు ప్రాణం పోసిన మెడిసన్ విద్యార్థి.. ట్రైన్ లో నిండు గర్భిణికి డెలివరీ..

ట్రైన్ లోనే డెలివరీ

ట్రైన్ లోనే డెలివరీ

Delivery in Train: నిండి గర్భిణి నొప్పులు అని చెబితే చాలు.. సర్జరీ చేయాలని వైద్యులు భయపెట్టే రోజులు ఇవి.. ప్రస్తుతం సాధారణ డెలివీరల సంఖ్య బాగా తగ్గిపోయింది. కార్పొరేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తితో సర్జరీల యుగం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఓ మెడికల్ విద్యార్థి చేసిన సాహసం.. నెలలు నిండిన గర్భిణిని.. బిడ్డను సురక్షితంగా కాపాడింది. అది కూడా ఓ ట్రైన్ లో

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Delivery in Train: నెలలు నిండిన గర్భిణి (Pregnant Women) నొప్పులు అందంటే.. వెంటనే సర్జరీ (Surgery) అనే రోజులు ఇవి.. ముఖ్యంగా కార్పొరేట్ ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా వెలసిన తరువాత.. సాధారణ కాన్పులు చాలా వరకు తగ్గిపోయాయి.. నిండు గర్బిణి.. నొప్పులు అంటే చాలు.. సర్జరీ చేయాల్సిందే అని చెప్పే వైద్యులు (Doctors) పెరిగారు. అందుకే నెలలు నిండుతున్నాయి అనగానే.. హాస్పిటల్ (Hospital) లో జాయిన్ చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. తాజాగా ఓ నెలలు నిండిన గర్భిణిని.. బిడ్డను క్షేమంగా కాపాడింది ఓ వైద్య విద్యార్థి.. అది కూడా కదిలే ట్రైన్ లో.. అసలు ఏం జరిగింది అంటే..?

  దురంతో రైలు పట్టాల నుంచి పరుగులు మొదలుపెట్టింది. కాలానికి ఎదురీదుతున్నట్లు వేగంగా పరుగు తీస్తోంది. ఇంతలో తెల్లవారుతోంది. అప్పుడప్పుడే చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో రైలులో సత్యవతి అనే ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతోంది.

  ఈ ఘటన సికింద్రాబాద్‌–విశాఖ దురంతో రైల్లో జరిగింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నాంకు చెందిన పి.సత్యవతి.. భర్త సత్యనారాయణతో కలిసి బీ–6 ఏసీ బోగీలో ప్రయాణిస్తున్నారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న సత్యనారాయణ భార్యను డెలివరీ నిమిత్తం స్వగ్రామానికి తీసుకెళుతున్నారు. సోమవారం సాయంత్రం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైలెక్కారు. అయితే మంగళవారం వేకువజామున రైలు రాజమండ్రి స్టేషన్‌ దాటుతుండగా సత్యవతికి పురిటి నొప్పులు మొదలయ్యాయి.

  ఇదీ చదవండి : కృష్ణ జింక దీక్షతో దిగివచ్చిన అధికారులు..! షాక్ అవుతున్నా ఇది నిజం.. మీరే చూడండి..

  దీంతో ఏం చేయాలో పాలుపోక ఆమె భర్తతో సహా అక్కడున్న వారంతా కనిపించిన వాళ్లని సాయమడిగారు. సత్యనారాయణ టికెట్‌ కలెక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అనకాపల్లిలో రైలు ఆపేందుకు చర్యలు చేపట్టారు. ఇంతలో నొప్పులు మరింత పెరిగాయి. దీంతో అదే బోగీలో ప్రయాణిస్తున్న హౌస్‌సర్జన్‌ స్వాతిరెడ్డి అదే బోగీలో ప్రయాణిస్తున్న ఆమె తెలిసింది. దీంతో ఆమె సాహసం చేసింది.

  ఇదీ చదవండి : బీచ్‌రోడ్‌కు వెళ్తున్నారా.. ఈ స్నాక్‌ ఐటమ్‌ అస్సలు మిస్‌ కావద్దు..! స్పెషల్‌ ఏంటో తెలుసా..?

  సరిగ్గా దేవుడే పంపించాడనిపించేలా.. అదే బోగీలో ప్రయాణిస్తున్న విశాఖపట్నం గీతం వైద్య కళాశాల విద్యార్థిని స్వాతిరెడ్డి స్పందించి సత్యవతిని పరీక్షించారు. తోటి మహిళల సాయంతో పురుడు పోశారు. సత్యవతి పండంటి ఆడబిడ్డ జన్మించింది. తల్లి బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈలోగా రైలు అనకాపల్లి రైల్వేస్టేషన్‌ చేరుకుంది. 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

  ఇదీ చదవండి : మూడు రాజధానులంటే ఒప్పుకోం.. ఏపీ సర్కార్ కు కేంద్రం షాక్..? ఎందుకో తెలుసా..?

  సత్యవతి, సత్యనారాయణలది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నం గ్రామం. స్వగ్రామానికి వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం దాటగానే కాన్పు అయింది. దురంతో ఎక్స్‌ప్రెస్‌కు విశాఖ వెళ్లేదాకా ఎక్కడా హాల్ట్‌ లేదు. దీంతోనే భయపడ్డార.. కానీ ఆ తల్లి బిడ్డ ల టైం బాగుండడంతో.. స్వాతి రెడ్డి అదే ట్రైన్ లో ప్రయాణించారు. అయితే ధైర్యం చేయకపోతే.. ఆ తల్లి ఎన్ని ఇబ్బందులు పడేదో...? అందుకే స్వాతిరెడ్డిక ప్రత్యేకంగా సత్యవతి, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Pregnant women, Train, Vizag

  ఉత్తమ కథలు