Home /News /andhra-pradesh /

AP POLITICS MANCHU MOHAN BABU IS TARGETING YCP GOVERNMENT AND SUPPORT TO BJP WHAT IS POLITICAL STRATEGY NGS

Mohan Babu: బీజేపీకి జై కొట్టడానికి కారణం అదేనా..? వైసీపీని టార్గెట్ చేస్తున్నారా..? మోహన్ బాబు ప్రచారాని అన్ని ఓట్లు వచ్చాయా..?

బీజేపీకి జూ కొడుతున్న మోహన్ బాబు

బీజేపీకి జూ కొడుతున్న మోహన్ బాబు

Mohan Babu on Bjp and YCP: తన రూటే సపరేట్ అన్నట్టు వ్యవహరించే మోహన్ బాబు మళ్లీ తన రూటు మార్చుకున్నారు.. పదే పదే బీజేపీకి ఎందుకు జై కొడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ వెంట నడిచిన ఆయన.. ఇప్పుడు ఆ పార్టీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.. ఆయన ప్రచారం చేస్తే అన్ని ఓట్లు వచ్చాయని ఇప్పుడు ప్రకటించడం వెనుక వ్యూహం ఉందా..?

ఇంకా చదవండి ...
    Mohan Babu on Bjp and YCP:  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని (YCP Governenment) టార్గెట్ చేస్తున్నారా.?  అలాగే బీజేపీకి జై కొడుతున్నారా..?  మొన్నటి వరకు మనం మనం అనుకునేలా ఉన్న వైఎస్-మంచు ఫ్యామిలీ మధ్య గ్యాప్  కు కారణం ఏంటి..?  మొన్నటికి మొన్న మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల వరకు రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉండేది. అంతెందుకు మంచు విష్ణు (Manchu Vishnu) మా అధ్యక్షుడిగా గెలిచాడు.. అంటే అందులో వైసీపీ (YCP) హ్యాండ్ కూడా కొంత ఉంది అన్నది టాలీవుడ్ (Tollywood) సమాచారం.. ఆ ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తో సంబంధాలు కొంత వరకు మంచు విష్ణుకు ఉపయోగపడింది అన్నది బహిరంగ రహస్యమే..   కానీ ఇప్పుడు మోహన్ బాబు పదే పదే బీజేపీకి జై కొడుతున్నారు. పరోక్షంగా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు.

    తాజాగా  మరోసారి బీజేపీకి జై కొడుతూ.. వైసీపీని టార్గెట్ చేసేలా ఆయన కామెంట్లు సాగాయి.  ప్రధాని నరేంద్రమోదీ పని (Prime Minster Narendra Modi) తీరుపై పై ప్రశంసలు కురిపించారు కలెక్షన్ కింగ్. బీజేపీ (BJP) జాతీయ సంస్కృతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సభలో ప్రధాని నరేంద్ర మోదీకి జై కొట్టారు. బీజేపీ జాతీయ సంస్కృతిక మహోత్సవం సభలో మాట్లాడిన మోహన్ బాబు.. ఎందరో కళాకారులు తిండి, ఇళ్లు లేక కష్టాలు పడుతున్నారని అన్నారు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులను ఆదుకుంటున్నారో లేదో మంత్రి అవంతి శ్రీనివాస్ (Minster Avanti Srinivas) కు తెలుసు అంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ జానపద కళాకారులు కష్టాలు పడుతున్నారని అన్నారని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

    ఇదీ చదవండి : కొత్తగా 13 జిల్లాలు.. 16 రెవిన్యూ డివిజన్లు.. ఏప్రిల్ 2న కొత్త జిల్లాలు ప్రారంభం..!

    తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు కాబట్టి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కళాకారుల్ని ఆదుకునే బాధ్యత తీసుకోవాలని మోహన్ బాబు కోరారు. నృత్య, జానపద కళాకారుల్ని ఆదుకోవడం ఎ.పి, తెలంగాణ నుంచే ప్రారంభించాలని అన్నారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఉండడం వల్లే తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. 1998లో తాను ఆంధ్రప్రదేశ్ లో బి.జె.పి.కి ప్రచారం చేస్తే 18 శాతం ఓట్లు వచ్చాయని గతాన్ని గుర్తు చేశారు. అంటే మరోసారి ప్రచారం చేస్తానని హింటు ఇవ్వడానికే ఆయనే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వానికి చురకలు అటిస్తూనే.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై తనకు గౌరవం ఉందని తెలిపారు మోహన్ బాబు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Cm jagan, Manchu mohan babu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు