హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Mohan Babu: పబ్లిసిటీ కోసం పాదయాత్రలు అవసరం లేదు.. తాను బీజేపీ మనిషిని అంటూ మోహన్ బాబు యూటర్న్..

Mohan Babu: పబ్లిసిటీ కోసం పాదయాత్రలు అవసరం లేదు.. తాను బీజేపీ మనిషిని అంటూ మోహన్ బాబు యూటర్న్..

మోహన్ బాబు యూటర్న్

మోహన్ బాబు యూటర్న్

Mohan Babu: తన రూటే సపరేటు అంటున్నారు హీరో మంచు మోహన్ బాబు.. ఓ కేసు విషయమై తిరుపతి కోర్టుకు హాజరైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాను వైసీపీ లో లేను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు తాను బీజేపీ మనిషిని అంటూ బహిరంగంగానే ఒప్పుకున్నారు.. అలాగే పాదయాత్రలతో వచ్చి పబ్లిసిటీ తనకు అవసరం లేదన్నారు.

ఇంకా చదవండి ...

Mohan Babu: మంచు ఫ్యామిలీకి సినిమాల ద్వారానే కాదు.. పొలిటికల్ గా కూడా గుర్తింపు ఉంది. సీనియర్ హీరో మోహన్ బాబు (Mohan Babu) ఎంపీగా కూడా చేశారు.. ఒకప్పుడు టీడీపీ (TDP)లో యాక్టివ్ గా ఉన్న ఆయన.. గత ఎన్నికల్లో వైసీపీ (YCP) కి జై కొట్టారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)  పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా వైసీపీకి సపోర్ట్ చేశారు. కానీ 2019 ఎన్నికల తరువాత.. వైసీపీకి దూరం అవుతూ వస్తున్నారు. ఇటీవల సినిమా ఇండస్ట్రీ సమస్యల విషయంలోనూ ప్రభుత్వంతో ఆయన చర్చలు జరిపింది లేదు. అలా అని ఆ ఫ్యామిలీ వైసీపీకి దూరం అయ్యింది అనుకునే అవకాశం లేకుండా.. మొన్నటి మా ఎన్నికల్లో వైసీపీ మద్దతుతోనే మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడన్నది అతడి ప్రత్యర్ధి వర్గం ఆరోపణ.. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ వైసీపీలోనే ఉంటోంది అనుకున్న వారికి మోహన్ బాబు వ్యాఖ్యలు షాక్ ఇచ్చాయి. ఎందుకంట ఇటీవల కాలం రాజకీయంగా చాలా సందర్భాల్లో వైసీపీకి మద్దతిచ స్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా మోహన్‌బాబు వైసీపీకి మద్దతిచ్చారు. పలు మార్లు సీఎం జగన్‌ (CM Jagan) ను కూడా కలిశారు. తాజాగా మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయా వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఓ కేసు సందర్భంగా తిరుపతికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీ మనిషిని అంటూ ప్రకటించారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడిని అంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించారు. అయితే కోర్టుకు పాదయాత్ర ద్వారా హాజరయ్యారు.. ఏదైనా కారణం ఉందా అని మీడియా ప్రశ్నిస్త.. పాదయాత్ర గా వచ్చానని ఎవరు చెప్పారంటూ ఎదురు ప్రశ్నించారు. తాను రియల్‌ హీరోను అని.. తనకు చాలామంది అభిమానులు ఉన్నారని.. వారందరినీ ఆత్మీయంగా మాట్లాడేందుకే నడుచుకుని వచ్చాను అన్నారు. అయినా పాదయాత్రలతో వచ్చే పబ్లిసిటీ తనకు అవసరం లేదన్నారు. కేవలం విద్యార్థుల కోసం పోరాడితే అక్రమంగా కేసులు పెట్టారని ఆవేదన ఉంది అన్నారు.


అసలు కేసు ఏంటంటే..? 2019లో విద్యార్థులతో కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మోహన్‌బాబు ధర్నా చేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి–మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి విద్యార్థులతో కలిసి మంచు కుటుంబం ధర్నా చేసింది. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులు కేసు నమోదు చేశారు. రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు ఇబ్బంది కలిగించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ధర్నాకు ముందస్తు పోలీస్ అనుమతి లేదని, 341, 171(ఎఫ్), పోలీస్ యాక్ట్ 290 కింద మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్‌పై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇదీ చదవండి : కొట్టుకోడానికి.. చంపుకోడానికి ప్రభుత్వం మారడమెందుకు? తేల్చుకుందాం రండీ అంటూ వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్

తాజాగా ఆ కేసుకు సంబంధించి సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు, మంచు మనోజ్ ఈరోజు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు పాదయాత్ర ద్వారా తిరుపతి కోర్టుకు చేరుకున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కోర్టు ప్రాంగణం వరకు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ పాదయాత్రగా అభిమానులతో కోర్టుకు హాజరయ్యారు. దీంతో కోర్టు ప్రాంగణం విద్యార్థులతో కిక్కిరిసింది.మోహన్ బాబుకు సంఘీభావంగా బీజేపీ నేత కోలా ఆనంద్, వైసీపీ నేతలు అన్నా రామచంద్ర, ఎంవీఎస్ మణి కోర్టు వద్దకు వచ్చారు. మరోవైపు ఈ కేసును సెప్టెంబర్ 20వ తేదికి వాయిదా వేశారు 4వ అదనపు న్యాయమూర్తి.. తదుపరి విచారణ అనంతరం తీర్పు వెలువడే అవకాశం

First published:

Tags: Andhra Pradesh, AP News, Bjp, Manchu mohan babu, Tirupati

ఉత్తమ కథలు