హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: పల్స్ లేదు..శరీరం బ్లూగా మారింది..తారకరత్న ఆరోగ్యంపై వైద్యులు ఏమన్నారంటే?

Breaking News: పల్స్ లేదు..శరీరం బ్లూగా మారింది..తారకరత్న ఆరోగ్యంపై వైద్యులు ఏమన్నారంటే?

లోకేష్ పాదయాత్రలో అపశృతి

లోకేష్ పాదయాత్రలో అపశృతి

టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్  (Nara Lokesh)'యువగళం' పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన నందమూరి తారకరత్న (Nandhamuri Tarakaratna) కొద్ది దూరం నడిచాక స్పృహ తప్పి కిందపడిపోయారు. దీనితో తారకరత్నను హుటాహుటీన కుప్పం కేసి ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి పీఈఎస్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్  (Nara Lokesh)'యువగళం' పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన నందమూరి తారకరత్న (Nandhamuri Tarakaratna) కొద్ది దూరం నడిచాక స్పృహ తప్పి కిందపడిపోయారు. దీనితో తారకరత్నను హుటాహుటీన కుప్పం కేసి ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి పీఈఎస్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.

Yuvagalam: యువగళంతో లోకేష్ సీఎం అవుతారా..? పాదయాత్ర సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..?

ఉదయం 11 గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాగా..ఈ పాదయాత్రలో బాలకృష్ణ,  తారకరత్న పాల్గొన్నారు. ఈ క్రమంలో లక్ష్మీపురం సరి వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొద్ది దూరం నడిచాక మసీదులో ప్రార్ధనలు చేశారు. అయితే మసీదు నుండి బయటకు వచ్చే క్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చుట్టు ముట్టడంతో ఒత్తిడి తట్టుకోలేక తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి కుప్పకూలిపోయారు. ఆయనను ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్సలో భాగంగా సీపీఆర్ చేసిన వైద్యులు హార్ట్ బీట్ ను పునరుద్దరించినట్టు తెలుస్తుంది. ఇక తాజాగా కార్డియాలజీ వైద్యులు తారకరత్నకు వైద్యం అందిస్తున్నట్లు సమాచారం.

Yuva Galam: వస్తున్నా మీ కోసం అంటున్న లోకేష్.. పాదయాత్ర ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే

క్రిటికల్ గా తారకరత్న ఆరోగ్యం..

కాగా తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం క్రిటికల్ గా ఉన్నట్లు తెలుస్తుంది. వైద్యులు సీపీఆర్ చేసి కొంత కంట్రోల్ లోకి తెచ్చినా కూడా ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పల్స్ లేదు. ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశాం. 45 నిమిషాల తరువాత పల్స్ మొదలయింది. మా ప్రయత్నం మేము చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నాం అని వైద్యులు తెలిపారు. ఇక ఇప్పటికీ కూడా తారకరత్న స్పృహలోకి రాలేదని సమాచారం. ప్రస్తుతం వైద్యులు అతనికి యాంజియోగ్రామ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు తరలించే అవకాశాలు ఉన్నాయి.

కాగా తారకరత్న రాజకీయాల్లో యాక్టివ్ కావాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనీ భావించారట. ఇక పాదయాత్రలో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో టీడీపీ కార్యకర్తలు, తారకరత్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ సహా పలువురు కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

First published:

Tags: Andhrapradesh, Ap, AP News, Nara Lokesh, TDP

ఉత్తమ కథలు