Home /News /andhra-pradesh /

AP POLITICS LIQUOR ISSUE TURNED OUT INTO A SERIOUS ISSUE AS TDP YCP LEADERS MADE ALLEGATIONS ON EACH OTHER FULL DETAILS HERE PRN GNT

Lokesh: “వాళ్లేం చదవలేదు.. ఆయన ఏం చదివాడో ఆయనకే తెలియదు..” వైసీపీ నేతలపై లోకేష్ సెటైర్లు..

మీడియాతో మాట్లాడుతున్న లోకేష్

మీడియాతో మాట్లాడుతున్న లోకేష్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో లిక్కర్ (Liquor Policy) పై పొలిటికల్ వార్ డైలీ సీరియల్ ను తలపిస్తోంది. మద్యం బ్రాండ్లపై ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీ రెండూ తగ్గడం లేదు. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కింది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో లిక్కర్ (Liquor Policy) పై పొలిటికల్ వార్ డైలీ సీరియల్ ను తలపిస్తోంది. మద్యం బ్రాండ్లపై ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీ రెండూ తగ్గడం లేదు. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కింది. రెండు రోజులగా అసెంబ్లీ, శాసనమండలిలో జరుగుతున్న పరిణామాలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. అసెంబ్లీలో జగన్ ప్రకటన తర్వాత టీడీపీ (TDP) నేతలు వాయిస్ పెంచారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ (Nara Lokesh).. సీఎం జగన్ (CM YS Jagan) పైమండిపడ్డారు. ఏపీలో లిక్కర్ బ్రాండ్లన్నీ చంద్రబాబు తెచ్చినవేనని చెప్తున్న జగన్ కు దమ్ముంటే వాటిని రద్దు చేయాలని సవాల్ చేశారు. చంద్రన్న పెళ్లికానుక, అన్నా క్యాంటీన్, చంద్రన్న బీమా, విదేశీ విద్య వంటి పథకాలు చంద్రబాబు బ్రాండ్లేనన్నారు.

    అమరావతితో సహా చంద్రబాబు తెచ్చిన పథకాలన్నీ రద్దు చేసిన జగన్.. మద్యం బ్రాండ్లు మావేఅయితే రద్దు చేయకుండా ఉండేవారా..? అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బ్రాండ్లన్నీ తెచ్చింది సీఎం జగనేనన్నారు. వైసీపీ హాయాంలో 141 కోత్త బ్రాండ్ లు వచ్చాయని ప్రభుత్వమే ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చిందని లోకేష్ గుర్తుచేశారు. సభలో చర్చకు అనుమతి ఇస్తే జే బ్రాండ్స్ బాగోతం బయటపడుతుందన్నారు.

    ఇది చదవండి: ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలస్ కే.. సీఎం జగన్ పై టీడీపీ సంచలన ఆరోపణలు..


    ఇక రాజధాని అంశంపైనా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో జగన్ వైఖరిని తప్పుబట్టిన ఆయన.. రాష్ట్ర విభజన పార్లమెంట్లో జరిగిందన్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం పార్లమెంట్లో ఆమోదించారని.. అందులో ఒక రాజధాని అని మాత్రమే పేర్కొన్నారని.. రాజధానులు అని ఎక్కడా లేదని దాని ఆధారంగానే కోర్టు తీర్పునిచ్చిందని లోకేష్ గుర్తుచేశారు. రాజధాని అంశానికి సంబంధించి ఇచ్చిన తీర్పుని పట్టుకొని శాసనసభకి ఏ అధికారాలు లేవా అంటూ ప్రజల్ని జగన్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తీర్పులను గౌరవించకుండా న్యాయ వ్యవస్థను కించపరిచేలా శాసనసభ వేదికగా మాట్లాడటం బాధాకరమన్నారు.

    ఇది చదవండి: ఏపీలో ఆర్ఆర్ఆర్ ఫీవర్.. థియేటర్లకు అధికారుల నోటీసులు.. సెక్యూరిటీ పెంపు..


    తమది సింగిల్ పాయింట్ ఎజెండా అని.., రాష్ట్రానికి ఒకే రాజధాని...అభివృద్ధి వికేంద్రీకరణ అనేదే తమ నినాదమని లోకేష్ స్పష్టం చేశారు. పదో తరగతి ఫెయిల్ అయిన వైసిపి నాయకులుకు, అసలు ఏమి చదివాడో తెలియని జగన్ కి చట్టాల గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణను తాము చేసి చూపించామన్న లోకేష్., రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని పరిశ్రమలు వచ్చాయో.. మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చర్చకు సిద్దమా..? అంటూ వైసీపీ నేతలకు లోకేష్ సవాల్ విసిరారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Nara Lokesh

    తదుపరి వార్తలు