Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
Alert to YCP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ప్రతి మీటింగ్ లో చెబుతున్న మాట ఒకటే.. వై నాట్ 175.. కేడర్ కు ఇదే మాట చెబుతూ వచ్చారు.. ప్రజలకు ఇంత మంచి పనులు చేస్తున్నాం.. పారదర్శకంగా పథకాలు అందిస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరికీ నేరుగా బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నారు. ఇంత చేస్తున్న మనం 175కి 175 స్థానాలు ఎందుకు నెగ్గం.. కుప్పం (Kuppam) లో కూడా జయకేతనం ఎగురవేస్తామంటూ పార్టీ నేతలకు ధైర్యం నింపుతూ వస్తున్నారు. నిన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్టు తయారైంది వైసీపీ పరిస్థితి అంటున్నారు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC Elections) ముందు వరకు వైనాట్ 175 అని చెప్పిన జగన్.. తాజాగా తిరువూరు సభలో స్వరం మార్చారు. తోడేళ్ళన్నీ గుంపుగా వస్తున్నాయనీ.. దమ్ముంటే వీరంతా విడివిడిగా 175 స్థానాలలో పోటీచేయాలని సీఎం సవాల్ విసిరారు. నిజంగా 175 స్థానాలు నెగ్గుతామని ధైర్యం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఒక్కటై వస్తే ఏంటి..? సింగిల్ గా వస్తే ఏంటి..? అన్న ప్రశ్న వినిపిస్తోంది.
రాష్ట్రంలో దాదాపు గా తొంభై శాతం పైగా ప్రజలు ప్రభుత్వం నుండి నేరుగా ఏదో ఒక పథకం ద్వారా లబ్ది పొందుతున్నారనేది వైసీపీ వర్గాల వాదన. అంతగా మేలు చేస్తున్నాం కాబట్టి వారంతా తమకే ఓటు వేస్తారని వైసీపీ అధిష్టానం అంచనా వేస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధులు నేరుగా లబ్దిదారుల ఇంటి దగ్గరకే వెళ్ళి వివరిస్తున్నారు. ప్రజల నుంచి అద్భుతంగా ఆదరణ వస్తోందని లెక్కలు వేసుకుంటున్నారు.
కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరేలా ఉందా..? తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల దేనికి సంకేతం. ఎందుకంటే మూడు చోటు పట్టభద్రుల ఎన్నికలు జరిగితే.. మూడు చోట్ల టీడీపీ దే విజయం అయ్యింది. దీంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. .స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు గంపగుత్తగా వైసీపీ గెలుచుకున్న ఆనందం కాస్తా పట్టబధ్రుల స్థానాలు కోల్పోవడంతో ఆవిరైపోయినట్లు కనిపిస్తోంది.
ఇదీ చదవండి : ఏపీ అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. వైసీపీ కౌంటర్ ఇదే
స్థానిక సంస్థల ప్రతినిధులు 80 శాతం మందికి పైగా అధికారపార్టీకి చెందిన వారే కాబట్టి వారు ఎలాగు వైసీపీకే ఓటేస్తారు కాబట్టి వారి గెలుపు అందరూ ఉహించినదే. కానీ పట్టబధ్రుల ఎన్నికలలో మాత్రం రాష్ట్రంలోని యువత,మేధావి వర్గాల ఆలోచనలను ప్రతిబింభిస్తుందనడంలో సందేహం లేదు అంటున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు ఇలాంటి తీర్పు ఖచ్ఛితంగా ప్రభుత్వం పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు..
ఇదీ చదవండి : నేనేమీ గౌతమ బుద్దుడిని కాదు.. టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ రూలింగ్
మరోవైపు వైసీపీ సునాయాసంగా గెలుస్తామనుకున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా పోటీలోకి వచ్చారు. దీంతో వైసీపీలో కొత్త టెన్షన్ మొదలైంది. విద్యావంతులైన పట్టబధ్రుల తీర్పు రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తుందని ప్రతిక్షాలు అంటుంటే, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులలో పట్టబధ్రులు లేకపోవడం వల్లే ఇలాంటి ప్రతికూల ఫలితాలు వచ్చాయంటున్నారు ప్రభుత్వ పెద్దలు.
ఇదీ చదవండి : వారందరికీ గుడ్ న్యూస్.. 3 నెలల్లో నెరవేరనున్న ఉద్దానవాసుల కల..! సాయం చేస్తున్నదెవరంటే?
అయితే రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందని.. ఆ పార్టీ కార్యకర్తలకే ఎక్కువగా లబ్ధి చేకూరుతోందనేది విపక్షాల విమర్శ. అంతేకాదు కేవలం ఓట్ల కోసం సంక్షేమం పైనే పూర్తిగా దృష్టి సారించినట్టు డ్రామాలు చేస్తూ.. భివృద్ధిని పూర్తిగా పక్కకు పెట్టిసిందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, రోడ్ల నిర్మాణం, ఉద్యోగులకు ఇచ్చిన హామీల పై విఫలం చెందడం ఇలా అనేక అంశాలు ప్రభుత్వానికి ప్రతికూలంగా పరిణమించాయనేది రాజకీయవిశ్లేషకుల వాదన.
ఇదీ చదవండి: పొత్తులపై త్వరలో అధికారిక ప్రకటన..! పవన్ ఆలోచన మారిందా..?
అధికారం చేపట్టిన నాటి నుండి నిన్న మొన్నటి వరకూ పోటీ చేసిన ప్రతి ఎన్నికలో గెలుపు తప్ప ఓటమి అంటే ఎరుగని వైసీపీకి ఇది నిజంగా షాకే అని చెప్పాలి. అది కూడా ఎన్నికల ఏడాదిలోనే ఇలాంటి ఫలితం రావడంతో.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందని వైసీపీ నేతలు అంతర్మథన పడుతున్నారు. ఇప్పటికైనా లోపాలు సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే వచ్చే ఎన్నికలలో వైనాట్ 175 సంగతి ఏమోగాని వైదిస్ కొలవెరీ అంటూ భాధ పడవలసి వస్తుందంటూ ఆవేద వ్యక్తం చేస్తున్నారు కొందరు నేతలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.