హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం పట్ల నిజమైన ఎన్టీఆర్ అభిమానుల కంటే ఆయనను రాజకీయంగా వాడుకునే చంద్రబాబు లాంటి వాళ్లే ఎక్కువగా బాధపడుతున్నారని ఎన్టీఆర్ భార్య, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి (Lakshmi Parvati) అన్నారు. యూనివర్సిటీ కంటే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం పెద్ద విషయమని ఆమె తెలిపారు. త్వరలోనే సీఎం జగన్‌ను కలుస్తానని.. త్వరలోనే ఓ పెద్ద ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్(NTR) పేరు పెట్టాలని తాను కోరుతానని అన్నారు. గతంలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకూడదని చంద్రబాబు అప్పటి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. కొన్ని మీడియాల్లో తన గురించి వచ్చిన అంశాల్లో వాస్తవం లేదని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ జీవించి ఉన్న సమయంలో తాను ఏ రోజూ కూడా పార్టీ వ్యవహారాల్లో తలదూర్చలేదని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.
ఈ విషయంలో కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అసత్యమని అన్నారు. టీడీపీలో(TDP) కొందరు నాయకులు ఇప్పటికీ ఉన్నారని.. వారిని అడిగితే అప్పట్లో తాను ఏ విధంగా వ్యవహరించాననే విషయాన్ని చెబుతారని అన్నారు. ఎన్టీఆర్‌కు తాము చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకే వాళ్లు మళ్లీ తనపై విషప్రచారం చేస్తున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. తాను ఏ స్వార్థంతోనూ ఎన్టీఆర్ జీవితంలో రాలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి గతంలో ఎన్టీఆర్ తన గురించి ఏం చెప్పారనే విషయాలను వీడియోలు ద్వారా ప్రదర్శించారు.
ఎన్టీఆర్ తన చివరి ఇంటర్వ్యూలోనే ఈ విషయాలన్నీ చెప్పారని అన్నారు. ఇటీవల ఎర్రబెల్లి దయాకర్ రావు తనమీద చేసిన వ్యాఖ్యలను తాను ఖండించానని లక్ష్మీపార్వతి అన్నారు. తాను ఎవరి నుంచి అలాంటి వస్తువులు ఆశించలేదని అన్నారు. తమ ప్రభుత్వంలో ఎర్రబెల్లికి ఈ కారణంగానే మంత్రి పదవి రాకపోతే.. ఆ తరువాత చంద్రబాబు హయాంలో అతడికి మంత్రి పదవి ఎందుకు రాలేదని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపారు. ఈ విషయంలో తాను స్పందించలేదని అనడం సరికాదని వ్యాఖ్యానించారు.
Good News: ఏపీలో 62 లక్షల మందికి గుడ్ న్యూస్.. ఇకపై ఎక్కడ కవాలంటే అక్కడే లబ్ధి.. పూర్తి వివరాలు ఇవే
Dussehra 2022: ప్రయాణికులకు పండుగ ఆఫర్.. ఏపీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం.. ఏంటో తెలుసా?
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో హుందాగా స్పందించారని లక్ష్మీపార్వతి అన్నారు. అయితే అతడిపై టీడీపీ ఇష్టానుసారంగా రాజకీయ దాడి చేసిందని విమర్శించారు. ఒకప్పుడు ఇదే జూనియర్ ఎన్టీఆర్‌ను తన రాజకీయ అవసరం కోసం చంద్రబాబు వాడుకున్నారని.. ఆయన ఇంటికి వెళ్లి మరీ రాజకీయ ప్రచారానికి వచ్చేలా ఒప్పించారని లక్ష్మీపార్వతి విమర్శించారు. అయితే ఆయన అవసరం తీరిన తరువాత ఈ విషయంలో మళ్లీ అతడిని దూరం పెట్టారని మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Lakshmi Parvathi