Jr NTR: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ.. అన్ని రాజకీయ పార్టీలు ఆయనపైనే ఫోకస్ చేస్తున్నాయి. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా వచ్చి.. జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం.. డిన్నర్ చేయడం రాజకీయంగా ఆసక్తి పెంచింది. 20 నిమిషాల పాటు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అయితే వారిద్దరూ ఏం మాట్లాడరు..? వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నారా..? రాజకీయ అంశాలపై చర్చించారా అన్నది వారిద్దరికి తప్ప ఎవరికి తెలియదు.. కానీ ఎవరికి వారు.. వీరిద్ధరి బేటీపై ప్రచారం చేస్తున్నారు. దానిపై రాజకీయంగా దుమారం ఇంకా ఆగలేదు. కానీ తాజాగా మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. తెలుగు దేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ టేక్ ఓవర్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిమాండ్ ను లక్ష్మీ పార్వతి ఇప్పుడు తెరపైకి తెచ్చారు. ఆమె ఏమన్నారంటే..? కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆని ఆమె కోరారు. అంతేకాదు రాజకీయాల్లోకి వచ్చి తెలుగు దేశం పార్టీని టేక్ ఓవర్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. అలా అయితేనే స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి పునర్ వైభవం వస్తుందని ఆమె అభిప్రాయ పడ్డారు..
ఇంకా ఆమె ఏమన్నారంటే..? విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విమర్శలు చేస్తున్న వారు, తెలుగు భాష అభవృద్ధికి కృషి చేస్తున్నాము అంటున్న వారు వాళ్ళ పిల్లలు నీ ఆంగ్ల భాషలో చదివించడం లేదా అని ప్రశ్నించారు. పేద పిల్లలు ఆంగ్ల బాషా అందుటులోకి తీసుకు వచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుంది అన్నారు.
కానీ తెలుగుకు సీఎం జగన్ ద్రోహం చేశారు అని విమర్శలు చేయడం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో తెలుగు స్కూల్స్ ను పెద్ద సంఖ్యలో మూసి వేశారని గుర్తు చేశారు. కానీ జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు తెలుగు, సంస్కృత అకాడమికి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తిరుపతి గోశాల దగ్గర స్థలం కేటాయించారని చెప్పారు.
ఇతర వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. జూనియర్ ఎన్టీఆర్ పై లక్ష్మీ పార్వతి కామెంట్లు హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల అమిత్ షా నేరుగా జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి దగ్గర నుంచి ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరో ఒకరు ప్రచారం చేయడమే తప్పా.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం .. ప్రస్తుతం తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాతా పెట్టిన పార్టీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని పదే పదే చెబుతూ వస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Jr ntr, Lakshmi Parvathi, TDP