హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Phone Tapping In YCP: ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి కోటంరెడ్డి ఫిర్యాదు..అమిత్ షాను కలుస్తానని వ్యాఖ్యలు

Phone Tapping In YCP: ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి కోటంరెడ్డి ఫిర్యాదు..అమిత్ షాను కలుస్తానని వ్యాఖ్యలు

kotamreddy sridher (Photo:Face Book)

kotamreddy sridher (Photo:Face Book)

రాజకీయాల్లో నెల్లూరు రాజకీయాలు వేరయా. అవును ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. వైసిపి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అధిష్టానం తీరుపై అసహనం వెళ్లగక్కుతున్నారు. మొదట ఆనం రామనారాయణరెడ్డి, ఆ తరువాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేశారని మొదటి నుంచి సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు. తన ఫోన్ ను సొంత పార్టీనే ట్యాప్ చేయడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని గతంలో అనేక సార్లు కోటంరెడ్డి చెప్పగా తాజాగా ఫోన్ ట్యాప్ పై కేంద్ర హోం శాఖకు కోటంరెడ్డి లేఖ రాశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

రాజకీయాల్లో నెల్లూరు రాజకీయాలు వేరయా. అవును ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. వైసిపి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అధిష్టానం తీరుపై అసహనం వెళ్లగక్కుతున్నారు. మొదట ఆనం రామనారాయణరెడ్డి, ఆ తరువాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేశారని మొదటి నుంచి సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు. తన ఫోన్ ను సొంత పార్టీనే ట్యాప్ చేయడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని గతంలో అనేక సార్లు కోటంరెడ్డి చెప్పగా తాజాగా ఫోన్ ట్యాప్ పై కేంద్ర హోం శాఖకు కోటంరెడ్డి లేఖ రాశారు.

నిత్యపెళ్లికొడుకు .. నాలుగో పెళ్లికి ప్లాన్ .. అంతలోనే అదిరే ట్విస్ట్

'ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను. నా వ్యక్తిగత సేచ్ఛను హరించేలా ఫోన్ ట్యాప్ చేశారని, దీనిపై విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నాను. నేరుగా ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి లేఖ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. ట్యాపింగ్ జరుగుతుందని నేను ఆరోపిస్తే నాపై విమర్శలు చేస్తున్నారు. నేను ఆరోపణలు చేసినప్పుడు మీరు కూడా సరైన పద్దతిలో మాట్లాడాలి. నాపై శాపనార్ధాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. నేను కేసులకు భయపడను నాకు కేసులు కొత్త కాదు. సొంత పార్టీ వాళ్లే నా ఫోన్ ట్యాప్ చేసి అవమానించారు. నిజాలు బయటపెట్టిన నాపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. చంపేస్తామంటూ బెదిరింపులు కూడా చేస్తున్నారు. నన్ను అరెస్ట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పు. మీరు ఎన్ని కేసులు పెట్టినా..జైలుకు పంపినా నా గొంతు ప్రశ్నించడం ఆగదని' అన్నారు.

రెడ్డి రాజుల పౌరుషానికి నిలువుటద్దం కొండవీడు కోట .. ఈ నిర్లక్ష్యపు నీడలెందుకు?

కాగా కోటంరెడ్డి తీరు మొదటి నుంచి వైసీపీకి తలనొప్పిగా మారింది. దీనితో ఆయన స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇక ఇటీవల కోటంరెడ్డి భద్రతను సర్కార్ తగ్గించి షాకిచ్చింది. ఇప్పటి వరకు ఆయనకు 2 ప్లస్ 2 సెక్యురిటీ (Security)ఉండగా దాన్ని 1ప్లస్ 1కి తగ్గించింది. ఇందుకు ఆయన కూడా సమ్మతిస్తూ సంబంధిత పత్రాలపై సంతకం చేసినట్లుగా తెలుస్తోంది.

కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని కోటంరెడ్డి చెప్పుకురాగా ఆయన త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది.

First published:

Tags: Amit Shah, Andhrapradesh, Ap, AP News, Kotamreddy sridhar reddy

ఉత్తమ కథలు