Home /News /andhra-pradesh /

AP POLITICS KONASEEMA RIOTS UPDATE POLICE ARREST ANOTHER 25 MEMBERS INCLUDING YCP FOLLOWERS NGS

Konaseema Riots: వాట్సప్ మెసేజ్ లతోనే విధ్వంసం.. అల్లర్లకు ముందేప్లాన్.. మరో వారం పాటు 144 సెక్షన్

కోనసీమ ఘటనలో వైరల్ అవుతున్న ఫోటోలు

కోనసీమ ఘటనలో వైరల్ అవుతున్న ఫోటోలు

Konaseema Riots: కొనసీమ అల్లర్లు అంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారా..? వాట్సప్ గ్రూపుల్లో ఏముంది..? అసలు ఆ గ్రూపులు క్రియేట్ చేసింది ఎవరు..? పోలీసులు దర్యాప్త్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో అమాయికులను పోలీసులు బలి చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇందులో ఏది నిజం..?

ఇంకా చదవండి ...
  Konaseema Riots: కొనసీమ (Konaseema) అంటే మొన్నటి వరకు పచ్చని ప్రశాంతమైన ప్రాంతం.. సంప్రదాయాలకు.. ఆప్యాయతలకు పెట్టింది పేరు. అలాంటి కోనసీమ ఊహించని రీతిలో భగ్గుమంది. ఏకం మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పులు పెట్టే పరిస్తితికి దారితీసింది. అయితే ఆ అల్లర్లకు కారణం ఎవరు అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో కొందరు అమయాకులను బలి చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కోనసీమ జిల్లా (Konaseema District) పేరు విషయంలో చిన్నగా మొదలైన ఆందోళనులు.. అమలాపురం (Amalapuram) లో హింసకు దారి తీయడంపై ఇప్పటికే ప్రజల్లో చాలానే అనుమానాలు ఉన్నాయి. స్థానికులు మాత్రం ఇదంతా ప్రభుత్వమే కావాలని చేసిందంటు మండిపడుతున్నారు. ఇక రాజకీయ దుమారం కూడా రేగింది. అధికార ప్రతిపక్షాల మధ్య నిత్యం మాటల తూటాలు ఆగడం లేదు. తప్పు మీది అంటే మీద అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అల్లర్ల వెనుక టీడీపీ (TDP), జనసేన (Janasena) ఉన్నాయని వైసీపీ (YSRCP) ఆరోపిస్తుంటే.. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైసీపీనే.. ఈ దారుణనానికి పాల్పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా.. ఈ విధ్వంసం అలా పక్కా ప్లాన్ ద్వారానే జరిగినట్టు సమాచారం..

  అల్లర్లకు ముందే ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం వాట్సాప్ ను వేదికగా మార్చుకున్నాట్టు ఆధారాలు సేకరించారు. వాట్సాప్ (Whatsapp) మెసేజ్ లు ఈ నెల 24న వివిధ గ్రూపుల్లో ప్రత్యక్షమవడం పోలీసులకు షాక్ కలిగించింది. ఈ ఘటనలో మొదట 46 మందిని అరెస్ట్ చేయగా.. తాజాగా మరో 25 మందిని అరెస్టు చేశారు. అయితే శనివారం అరెస్టు చేసిన 25 మందిలో 18 మంది వైసీపీ కార్యకర్తలే ఉండటం గమనార్హం. విధ్వంసానికి పాల్పడినవారిని గుర్తించి, అదుపులోకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో విపక్షాలకు మరో ఆయుధం దొరికినట్టు అయ్యింది.. గత కొన్ని రోజులుగా విపక్షాలు సైతం ఇదే వాదిస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఈ దాడుల వెనుక ఉన్నారంటున్నారు.

  ఇదీ చదవండి : చంద్రబాబుకు ఇదే ఫైనల్ ఎలక్షన్.. మహనాడుకు వచ్చింది అంతా వారే..

  అయితే ఎక్కువంది వైసీపీ కార్యకర్తలు ఉండడంతో.. ఈ కేసును పక్కదారి పట్టిస్తారంటూ విమర్శలు ఉన్నాయి. మరోవైపు నాలుగు రోజులుగా నిలిచిన ఇంటర్నెట్‌ సేవలు ఇంకా పునరుద్ధరించలేదు. అలాగే పోలీసులు విధించిన 144 సెక్షన్‌ను మరో వారం రోజులు పొడిగించారు. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ చెలరేగిన అమలాపురం అల్లర్లలో ధ్వంసమైన ఆస్తుల నష్టాన్ని నిందితుల నుండే రాబడతామని ఆయన స్పష్టం చేశారు. అమలాపురం అల్లర్లకు కీల‌క సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అన్యం సాయి పాత్రపై విచారణ జరుపుతున్నారు. ఈ నెల 20న కోనసీమ సాధన సమితి ఆందోళనలో అన్యం సాయి కూడా పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. అల్లర్లు జరిగిన సమయంలో రికార్డైన వీడియోలు, సీసీటీవీ పుటేజ్, టి సాంకేతికత ఉపయోగించి నిందితులను గుర్తిస్తున్నామని, అందులో భాగంగా మరో 25 మందిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics

  తదుపరి వార్తలు