హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodi kathi Case: మళ్లీ తెరపైకి కోడికత్తి కేసు.. సీజేఐకి లేఖ.. ఏం రాశారంటే?

Kodi kathi Case: మళ్లీ తెరపైకి కోడికత్తి కేసు.. సీజేఐకి లేఖ.. ఏం రాశారంటే?

మళ్లీ తెరపైకి కోడికత్తి కేసు

మళ్లీ తెరపైకి కోడికత్తి కేసు

Kodi kathi Case: తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత.. జగన్ పై కోడికత్తి కేసు పెను సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి.. ఈ కేసు కూడా ఒక కారణమన్నది.. రాజకీయ విశ్లేషకుల మాట. తాజాగా మరోసారి కోడికత్తి కేసు తెరపైకి వచ్చింది.

ఇంకా చదవండి ...

Kodi kathi Case: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో సంచలనం సృష్టించిన కోడికత్తి (Kodikatthi) కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌ తల్లి (Srinivas mother) సావిత్రి (Savitri) సుప్రీంకోర్టు (Supreme Court) చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana)కు లేఖ రాశారు. ఈ కేసులో అరెస్టయిన తన కుమారుడిని నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని.. అతడిని తక్షణమే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని లేఖలో కోరింది. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం గానీ, ఎన్‌ఐఏ గానీ ఎలాంటి విచారణ జరపడం లేదని సావిత్రి తన లేఖలో సావిత్రి పేర్కొంది. కేవలం మూడు నెలలు బెయిల్ ఇచ్చి తిరిగి మళ్లీ కస్టడీలోకి తీసుకుని జైలుకు పంపారని వివరించారు. జైల్లో తన కుమారుడు నరకం అనుభవిస్తున్నాడని.. అందుకే అతడిని వెంటనే విడుల చేసేలా ఆదేశాలివ్వాలని సీజేఐని వేడుకుంది.

సుమారు నాలుగేళ్లుగా తన కుమారుడు రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం, ఎన్‌ఐఏ ఎలాంటి విచారణ జరపడం లేదని లేఖలో సావిత్రి పేర్కొన్నారు. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 అక్టోబర్ నెలలో విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. అక్టోబర్ 25 వ తేదీన ఆయన హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అ సమయంలో జరిగిన కత్తి దాడి పెను సంచలనంగా మారింది.

అక్కడ ఓ యవకుడు ఒక్కసారిగా కోడి పందేల్లో వాడే కత్తితో జగన్‌పై దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కేసును ఎన్ఐఏ విచారణ చేపట్టింది. అప్పటి అధికార పార్టీ టీడీపీయే జగన్ పై దాడి చేయించిందని వైసీపీ, ఎన్నికల్లో సింపతీ కోసమే వైసీపీ ఈడ్రామా ఆడిందని టీడీపీ ఒకరి నొకరు విమర్శించుకున్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొంది అధికారాన్ని చేజిక్కుంచుకుంది.

ఇదీ చదవండి : ప్లీనరీలో సంచలన నిర్ణయం.. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్

ఇటీవల సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సైతం.. కోడికత్తికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐబీ చీఫ్‌గా పనిచేసినప్పుడు రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తే అడ్డుకున్నాను. కోడి కత్తి కేసు ఘటనను అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూశారు. కొన్ని గంటల్లోనే దాన్ని సమర్థంగా ఎదుర్కొని నిలువరించాం. కొంత మందికి అందుకే నాపై కోపం అనుకుంటాను. చెడ్డ పనులను జరగకుండా ఆపడమే నా తప్పా అని ఆయన ప్రశ్నించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, NV Ramana

ఉత్తమ కథలు