Kodi Kathi Case: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కోడి కత్తి కేసు అనగానే.. ఠక్కున గుర్తుకొచ్చేది విశాఖ ఎయిర్ పోర్టు (Visakha Airport) లో జగన్ పై దాడి. అయితే ఈ దాడి పై వివిధ రకాల ప్రచారాలు ఉన్నాయి. ఇదంతా టీడీపీ కుట్ర అని వైసీపీ నేతలు అప్పట్లో ఆరోపణలు చేశారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారంగా జగనే దాడి చేయించుకుని.. అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై నెట్టివేశారనే టీడీపీ (TDP) నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల విశాఖలో పర్యటించిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. ఎయిర్ పోర్టులో మంత్రుల కాన్వాయ్ పై దాడి చేశారనే ఆరోపణలతో జనసైనికులపై హత్యా యత్నం కేసులు నమోదు అయ్యాయి. తరువాత బెయిల్ కూడా వచ్చింది. అయితే ఇది కోడికత్తి కేసులో.. వారిపై వారే దాడి చేసుకుని.. జనసైనికులను హింసిస్తున్నారంటూ పవన్ ఆరోపించారు. ఆయన ఆరోపణలు చేసిన కొన్ని రోజులకే మళ్లీ కోడి కత్తి వ్యవహారం తెరపైకి వచ్చింది.
ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ (Janupalli Srinivas) గత నాలుగేళ్లుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈక్రమంలో ఈ కోడి కత్తి కేసులో బెయిల్ కోసం ఎన్ ఓ సీ ఇవ్వాలని సీఎం జగన్ కు లేఖ ద్వారా కోరారు నిందితుడు జనుపల్లి శ్రీనివాస్. దీని కోసం జగన్ అపాయింట్ మెంట్ కోరారు.
ఈ నేపథ్యంలో జగన్ ను కలిసేందుకు శ్రీను కుటుంబ సభ్యులు లాయర్ సలీమ్ తో పాటు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కానీ జగన్ అపాయింట్ మెంట్ మాత్రం ఇవ్వలేదు. నాలుగేళ్ళుగా తమ బిడ్డ రిమాండ్ ఖైదీగా ఇబ్బందులు పడుతున్నాడని.. అందుకే తమ గోడు సిఎం చెప్పుకుంటామని కోరారు. అయినా జగన్ మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో నిందితుడి కుటుంబ సభ్యులు సీఎం గ్రీవెన్స్ సెల్ లో వినతిపత్రం ఇచ్చి వెనుతిరిగారు.
ఇదీ చదవండి : టార్గెట్ 2024 దిశగా వైసీపీ అడుగులు.. ఆ సామాజిక వర్గంపై ఫోకస్..
జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటంతో వారు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ తల్లి, సోదరుడు సుబ్బరాజు మాట్లాడుతూ.. సిఎం జగన్ ను కలవటానికి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చామని కానీ జగన్ మాత్రం కలవటానికి అవకాశం కల్పించలేదని వాపోయారు. నాలుగేళ్లుగా మా బిడ్డ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడని..మా గోడు సీఎం జగన్ కు చెప్పుకుందామని వచ్చినా ఫలితం లేదని వాపోయారు. తమ కుమారుడికి బెయిల్ పై నిరంభ్యంతర సర్టిఫకెట్ ఇవ్వాలని వేడుకోరుకునే అవకాశాన్ని కూడా కల్పించలేదన్నారు.
ఇదీ చదవండి : ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం.. శోభన్ బాబు ఇంట్లో భారీగా అక్రమాస్తులు గుర్తింపు
నాలుగేళ్లుగా జైల్లో మగ్గిపోతున్న తన బిడ్డను విడిపించాలని లేదంటే తమ కుటుంబం ఏదైనా అఘాయిత్యం చేసుకోవటానికి కూడా వెనుకాడేది లేదని దయచేసి తమ బిడ్డను తమ వద్దకు చేర్చండీ సీఎం సారూ అంటూ కన్నీటితో వేడుకుంటోంది నిందితుడు తల్లి. మా కుమారుడు వైఎస్ జగన్ పై దాడి చేశాడో లేదో తెలియదు.. జగన్ ను ఎవరు పొడిచారో తెలియదు.. కానీ దాడి వ్యవహారంలో మా కుమారుడు బలి అయ్యాడని కన్నీరు పెట్టుకుంటున్నారు. తమ కుమారుడు నాలుగేళ్లుగా జైల్లో ఉంచడం వల్ల తాము కష్టాలు పడుతున్నామనీ.. చాలా పేదవాళ్లం ఉపాధి హామీ పనులు చేసుకుంటూ బతుకున్నామన్నారు.
నిందితుడు సోదరుడు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పై తానైతే హత్యాయత్నం చేయలేదని తన సోదరుడు చెప్పాడంటున్నారు. ఈ సందర్భంగా నిందితుడు తరపు న్యాయవాది సలీమ్ మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా అండర్ ట్రయల్ లో ఉన్న ఖైదినీ నాలుగేళ్లుగా జైలులో పెట్టడం సరైంది కాదున్నారు. కోడికత్తి కేసులో ఎన్ ఐ ఎ చార్జి షీట్ వేసినా ఇప్పటి వరకు ట్రయల్ కూడా చేయలేదని అన్నారు. మానవీయ కోణంలో తీసుకుని ఎన్ ఓ సీ ఇచ్చి నిందితుడికి బెయిల్ ఇవ్వాలని కోరామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp