హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కోడెల తనయుడికి కీలక పదవి... చంద్రబాబు నిర్ణయం ?

కోడెల తనయుడికి కీలక పదవి... చంద్రబాబు నిర్ణయం ?

కోడెల శివరాంను సత్తెనపల్లి టీడీపీ ఇన్‌చార్జ్‌గా ప్రకటించడం వల్ల కోడెల కుటుంబాన్ని టీడీపీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలను తిప్పికొట్టొచ్చనే భావనలో చంద్రబాబు ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది.

  ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు అధికార వైసీపీ వ్యవహరించిన తీరే కారణమని ఆరోపిస్తున్న టీడీపీ... ఈ అంశంలో ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో టీడీపీ తీరును తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ... చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే కోడెల మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని విమర్శలు గుప్పిస్తోంది. దీంతో టీడీపీలో కోడెల తనయుడు డాక్టర్ కోడెల శివరాంకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

  సత్తెనపల్లి పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కోడెల తనయుడు కోడెల శివరాంను ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. కోడెల శివరాంను సత్తెనపల్లి టీడీపీ ఇన్‌చార్జ్‌గా ప్రకటించడం వల్ల కోడెల కుటుంబాన్ని టీడీపీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలను తిప్పికొట్టొచ్చనే భావనలో చంద్రబాబు ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా కోడెల కుటుంబానికి పార్టీ నాయకత్వం అండగా ఉంటుందనే సంకేతాలు కూడా పార్టీ శ్రేణుల్లోకి వెళతాయని టీడీపీ అధినేత భావిస్తున్నారు.

  Kodela suicide, kodela sivaram, sattenapalli, narasaraopeta, chandrababu naidu, tdp, ycp, ap cm ys jagan, ap news, ap politics, Guntur, కోడెల ఆత్మహత్య, కోడెల శివరాం, సత్తెనపల్లి, నరసరావుపేట, చంద్రబాబు, టీడీపీ, వైసీపీ
  కోడెల శివప్రసాదరావు, కోడెల శివరామ్

  సత్తెనపల్లి టీడీపీ ఇన్‌చార్జ్‌తో పాటు టీడీపీలో కీలకమైన ఏదో ఒక పదవి కూడా కోడెల శివరాంకు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోందని తెలుస్తోంది. మొత్తానికి ఆత్మహత్య చేసుకున్న కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  అన్నా రఘు, న్యూస్18 ప్రతినిధి

  First published:

  Tags: Chandrababu Naidu, Kodela death, Kodela sivaram, TDP, Ysrcp

  ఉత్తమ కథలు