Kodali Nani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త కేబినెట్ కసరత్తు దాదాపు పూర్తి కావొస్తోంది. చివరిలో ఒకటి రెండు అనూహ్య మార్పులు మినహా జాబితా మొత్తం సిద్ధమైందనే ప్రచారం ఉంది. 11వ తేదీ ఉదయం 11.31 నిమిషాలకు కొత్త కేబినెట్ (New Cabinet) కొలువు తీరనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. తన కొత్త కేబినెట్ లోకి ఎవరిని తీసుకుంటారు..? ఎవర్ని పక్క పెడతారు అన్నదానిపై సీఎం జగన్ (CM Jagan) ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. రేపు మధ్యాహ్నానానికి తుది కసరత్తు పూర్తి చేసి.. ఆ తరువాతే కాబోయే మంత్రులకు సమాచారం ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పదవులకు రాజీనామ చేసిన వారిలో ఎవరెవరిని కొనసాగిస్తారు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మొదట ఇద్దరు లేద ముగ్గుర్ని కొనసాగిస్తారనే ప్రచారం ఉండడంతో.. దాదాపు మంత్రులంతా ఔట్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పాలన, పార్టీ రెండీనీ చూసుకోవడం ఇబ్బందికర పరిణామమే.. ఒకవేళ తాను పార్టీపై ఫోకస్ చేస్తే.. పాలనలో ఇబ్బందులు ఎదురవుతాయని జగన్ ఆవేదన చెందారు. దీంతో రాజీనామా చేసిన వారిలో పదికి పైగా మంత్రులను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సోమవారం ఉదయం ఈ కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. ఈ సారైనా కేబినెట్ లో తమకు చోటు దక్కుతుందా? అని చాలామంది ఎమ్మెల్యేలు ఎదురుచూస్తుండగా.. ఇప్పటికే రాజీనామా చేసిన మంత్రులు మరోసారి అవకాశం దక్కకపోదా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి కొడాలి నాని (Kodali Nani)కి మరోసారి కొత్త అవకాశం దక్కుతుందని ప్రచారం ఉంది. ఈ విషయం మీడియా అడ్డగా ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు.
ఇదీ చదవండి : చివరి నిమిషంలో కేబినెట్ కూర్పులో ట్విస్ట్.. బుజ్జగింపులపై సజ్జల క్లారిటీ..
జగన్ 2019లోనే మంత్రివర్గ మార్పు మధ్యలో ఉంటుందని చెప్పారని.. అందులో భాగంగానే సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో మంత్రివర్గ కూర్పు చేస్తున్నారని కొడాలి నాని వివరణ ఇచ్చారు. అయితే ఎన్నికల కోసమో, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదన్నారు. ఇక మంత్రి కావాలని అందరికీ ఆశ ఉంటుంది. తన విషయానికి వస్తే.. మంత్రిగా కొనసాగింపుపై ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదన్నారు.
ఇదీ చదవండి : కొత్త మంత్రుల జాబితా రెడీ? మళ్లీ కొనసాగేది ఎవరు.. ఏ లెక్కన ఎవరికి ఛాన్స్..?
మంత్రి పదవి దక్కినా.. దక్కకపోయినా.. సీఎం జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా తప్పకుండా చేస్తానని అన్నారు మంత్రి కొడాలి. వ్యక్తిగత పనుల కోసమే హైదరాబాద్ వచ్చానని.. అలాగే సీఎం జగన్ అన్నట్లు ప్రతిపక్షాలు అన్ని కలిసినా ఆయన వెంట్రుక కూడా పీకలేర కొడాలి నాని అభిప్రాయపడ్డారు. ఎవరు ఎవరితో వచ్చినా సీఎం జగన్ సింగిల్ గానే వస్తారని దమ్ముంటే కాసుకోండి అంటూ సవాల్ విసిరిరారు. అంతేకాదు కనీసం ఎమ్మెల్యేలుగా గెలవలేని పవన్, లోకేష్ లు సీఎంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఇంకా నోరు తెరిస్తే ఊరుకునేది లేదన్నారు.
ఇదీ చదవండి : : తెలివిమీరుతున్న దొంగలు.. సిగ్నల్ వైర్ కట్ చేసి మరి ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడీ
అసలు భయం అన్నపదమే జగన్ డిక్షనరీలో లేదన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మాకు 160 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తాను మంత్రిగా నేను రాసిన పరీక్షపై సంతృప్తిగా ఉన్నాను అని.. సీఎం జగన్ సైతం మంచి మార్కులే వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక తనకు మళ్లీ అవకాశం వస్తుందో రాదో చెప్పలేను అన్నారు. ఒకవేళ మంత్రి పదవి ఉన్నా లేకున్నా ఇదే ఫైర్ తో పని చేస్తాను అన్ని నాని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, Kodali Nani