జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై కొడాలి నాని (Kodali Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తీవ్రవాది అయితే కాల్చి పడేస్తారు. మొరిగే కుక్క కరుస్తుందా కరిసే కుక్క మొరుగుతుందా. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్రవాది అయితే కుక్కను కాల్చినట్టు కాల్చి పడేస్తారు. వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగితే ప్రజలను చంపెస్తాడా అని కొడాలి నాని (Kodali Nani) ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు వత్తాసు పలికిన నేతల చంక ఎందుకు ఎక్కుతున్నాడన్నారు. టీడీపీ నేతలు పాదయాత్రలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు పట్టించుకోరని కొడాలి (Kodali Nani) సెటైర్లు వేశారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని..
పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ అజ్ఞాని. అసలు ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండేందుకు తాము 3 ప్రాంతాలకు రాజధానులకై వికేంద్రీకరణ విధానం తీసుకొస్తున్నామని అన్నారు. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లక్షల కోట్లు తెచ్చి అమరావతిలో పెడతాం అంటున్నారు. రేపు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్లు పొమ్మని అంటే పరిస్థితి ఏంటని కొడాలి నాని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి ఎందుకు రావాల్సి వచ్చిందని, పవన్ రాజకీయ అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు తమ అభిప్రాయాలూ చెప్పుకోడానికి వస్తే తీవ్రవాది అయిన పవన్ ఏం చేస్తారని మండిపడ్డారు.
చంద్రబాబు 420, లోకేష్ 120..
చంద్రబాబు, లోకేష్ లను కొడాలి నాని వదిలిపెట్టలేదు. చంద్రబాబు 420 అయితే, లోకేష్ 120. అందరూ కట్ట కట్టుకొని వచ్చినా ఎవరు ఏం పీకలేరన్నారు. అభివృద్ధి అంటే స్విమ్మింగ్ ఫూల్ లో ఫారెన్ అమ్మాయిలతో మందు తాగడం కాదని లోకేష్ ను ఉద్దేశించి కొడాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీకి 55 శాతం ఓటు బ్యాంక్ ఉంది. టీడీపీ పాదయాత్ర చేసిన పొర్లు దండాలు పెట్టిన ప్రజలకు పట్టించుకోరని అన్నారు.
బ్రతికున్నంతకాలం జగనే సీఎం..
బ్రతికున్నంత కాలం జగనే సీఎం అని చెప్పిన కొడాలి జీవితంలో పవన్, చంద్రబాబు, లోకేష్ సీఎం కాలేరని అన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్ సీఎం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పవన్ చేసిన వ్యాఖ్యలపై కొడాలి ఇవాళ రియాక్ట్ అయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, Kodali Nani, Pawan kalyan