ఎన్టీఆర్ రక్తంతో పుట్టిన పార్టీ టీడీపీ అని.. ఎన్టీఆర్ వారసుల నుంచి పార్టీని లాక్కొనేందుకే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. అసలు ఏ అర్హతతో లోకేశ్ పాదయాత్ర చేస్తున్నాడని ప్రశ్నించారు. శాసనసభ్యుడిగా ఓడిపోయిన వ్యక్తి పాదయాత్ర చేయడమేంటని వ్యాఖ్యానించారు. లోకేశ్(Nara Lokesh) పాదయాత్రతో టీడీపీకే ఉపయోగం లేదని.. కేవలం టీడీపీ వారసత్వం కోసమే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని కొడాలి అన్నారు. లోకేశ్ 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా.. అతడిని జనం నమ్మరని కొడాలి నాని(Kodali Nani) విమర్శించారు. మూడు శాఖలకు మంత్రిగా వ్యవహరించి కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాదయాత్ర(Padayatra) చేసే విషయంలో అందరికీ దివంగత వైఎస్ఆర్ స్పూర్తి అని కొడాలి నాని వివరించారు.ఆ తరువాత వైైఎస్ఆర్ తరహాలోనే ప్రతిపక్ష నేతగా ఉంటూ చంద్రబాబు, వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టారని.. ఆ తరువాత ముఖ్యమంత్రులు అయ్యారని గుర్తు చేశారు. మరి ప్రజాసమస్యలపై ఏం అవగాహన ఉందని.. ఏం అర్హత ఉందని నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. లోకేశ్ ఎన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా.. మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని.. దీన్ని ఎవరూ ఆపలేరని కొడాలి నాని జోస్యం చెప్పారు.
అంతకుముందు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమయింది. అంతకు ముందు కుప్పం సమీపంలో ఉన్న లక్ష్మీపురంలో శ్రీవరదరాజ స్వామి ఆలయంలో తన మామయ్య బాలకృష్ణతో కలిసి లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 11.03 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. ఆయనతో పాటు బాలకృష్ణ, పలువురు టీడీపీ కీలక నేతలు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు నడుస్తున్నారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగనున్న ఈ సుదీర్ఘ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.
ఇక లోకేశ్ పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన నందమూరి తారకరత్నకు గుండెపోటు వచ్చింది. కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించారు. తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు తదితరులు అక్కడే ఉన్నారు. మరోవైపు తారకరత్న ప్రస్తుత పరిస్థితి గురించి బాలకృష్ణ మాట్లాడుతూ... తారకరత్న కోలుకుంటున్నారని చెప్పారు.
Big News: తారకరత్నకు గుండెపోటు..క్రిటికల్ గా ఆరోగ్య పరిస్థితి..బెంగళూరు తరలింపు..
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. గోవింద్ యాప్ పేరు మారింది..
బీపీ కంట్రోల్ లో ఉందని తెలిపారు. అన్ని పారామీటర్స్ బాగున్నాయని చెప్పారు. అన్ని రిపోర్టులు సక్రమంగా ఉన్నాయని అన్నారు. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయినట్టు డాక్టర్లు చెప్పారని అన్నారు. కుప్పంలోని డాక్టర్లు మంచి చికిత్స చేశారని... ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకుగాని, మరెక్కడికైనా తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారని... తాము బెంగళూరుకు తరలిస్తున్నామని బాలకృష్ణ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kodali Nani, Nara Lokesh