హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nagarjuna: కింగ్ నాగార్జున విజయవాడ ఎంపీగా పోటీచేస్తున్నారా..? ఇదిగో క్లారిటీ..

Nagarjuna: కింగ్ నాగార్జున విజయవాడ ఎంపీగా పోటీచేస్తున్నారా..? ఇదిగో క్లారిటీ..

నాగార్జున వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్నారా..? క్లారిటీ ఇదే

నాగార్జున వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్నారా..? క్లారిటీ ఇదే

King Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు.. కింగ్ అక్కినేని నాగార్జున రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారా..? వైసీపీ తరపున విజయవాడ నుంచి పోటీ ఎంపీగా పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారా..? అసలు వాస్తవం ఏంటి..? క్లారిటీ ఇదిగో..

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati.

  King Nagarjuna:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా ఓ వార్త ఏపీ రాజకీయాల్లో (AP Politics) హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) లో చాలామంది వైసీపీ (YCP) కి దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. నటుడు ఆలీ (Ali), పోసాని (Posani) మాత్రమే యాక్టివ్ గా వైసీపీలో ఉన్నారు.. ఇలాంటి సమయంలో స్టార్ హీరో.. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) జగన్  కు అండగా నిలుస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో  ఉమ్మడి క్రిష్ణా జిల్లా కేంద్రం విజయవాడ (Vijaywada) పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. సోషల్ మీడియా, ముయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇదే చర్చ జరుగుతోంది. తెర వెనుక పెద్ద కథే నడిచింది అనే ప్రచారం ఉంది.

  వాస్తవం ఏంటి.. అసలు విజయవాడ నుంచి నాగార్జున పోటీ చేస్తున్న మాట వాస్తవమేనా..?  పోటీ చేస్తే.. విజయవాడనే ఆయన ఎందుకు ఎంచుకున్నారంటూ చర్చ ఓ స్థాయిలో జరుగుతోంది.  గతంలో దివంగత వై.ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వరుసగా లగడపాటి రాజగోపాల్ అక్కడ ఎంపీగా గా గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించారు. తరువాత పరిణామాల కారణంగా  వైసీపీ నుంచి బడా పారీశ్రామిక వేత్తలు కోనేరు రాజేంద్ర ప్రసాద్, పొట్లూరి వర ప్రసాద్ లు  ఆ  పార్టీ తరపున పోటీ చేశారు. కానీ అక్కడ బలమైన అభ్యర్థిగా ముద్ర వేసుకున్న కేశినేని నాని చేతిలో వారికి ఓటమి తప్పలేదు.

  వైసీపీ ప్రభంజనంలో.. అసలు పేర్లు కూడా చాలామందికి తెలియని నేతలు సైతం ఫ్యాన్ గాలిలో ఘన విజయాలు సాధించారు. అలాంటి వేవ్ లో సైతం కేశినేని విజయం సాధించి సత్తా చాటారు. దీంతో ఆయన్ను ఓడించాలనే జగన్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

  ఇదీ చదవండి : నేటి నుంచి తిరుచానూరులో పవిత్రోత్సవాలు.. సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడంటే..?

  దీంతో వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచి తీరాలని జగన్ పట్టుదలగా ఉన్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.అందుకే ఈ సారి అంగ బలం అర్ధ బలంతో పాటు సినీగ్లామర్ కూడా తోడైతే గెలుపు తప్పకుండా తమని వరిస్తుందని.. వైసీపీలో ఓ వర్గం ప్రచారం చేస్తోంది.  దీంతో నాగార్జున పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే వివాద రహితుడు.. ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ హోస్ట్ గా క్రేజ్ ను రెట్టింపు చేసుకుంటున్నారు.. ప్రస్తుతం టీడీపీకి కంచుకోట లాంటి విజయవాడలో వైసీపీ నెగ్గాలి అంటే.. నాగార్జున లాంటి వ్యక్తి పోటీ చేస్తే ఇక తిరుగే ఉండదు అన్నది కొందరు వైసీపీ నేతల అభిప్రాయం..

  ఇదీ చదవండి : సీతాఫలాలతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. భయపెడుతున్న ధరలు

  అందుకు కారణం కూడా  లేకపోలేదు.. ఎందుకంటే నాగార్జునతో సీఎం జగన్ వ్యాపార పరమైన సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. అంతేకాదు ఇద్దరూ స్నేహితులు కూడా.. గతంలో చాలా సందర్భాల్లో వీరిద్దరి మధ్య స్నేహం బయటపడింది. ఇప్పుడు చాలామంది యాక్టర్లు రాజకీయాల్లోనూ తమ లక్ ను పరీక్షించుకుంటున్నారు. దీంతో నాగార్జునను విజయవాడ నుంచి పోటీ చేయించాలన్నది ఆ పార్టీలో కొందరి అభిప్రాయం..

  ఆ అభిప్రాయమే ఇప్పుడు వైరల్ గా మారింది.  అయితే ఈ వార్తలను నాగార్జున సన్నిహితులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అప్పుడెప్పుడో టాలీవుడ్ సమస్యలపై సీఎం జగన్ ను కలిశారు. ఆ తరువాత ఎలాంటి విషయాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరగలేదని.. స్పష్టం చేశారు. కేవలం కొందరు ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని.. ఎవరూ నమ్మొదని స్పష్టం చేశారు. ఇటు సోషల్ మీడియాలో సైతం నాగార్జున అభిమానులు.. దయచేసి ఈ వార్తలు ఎవరూ నమ్మకండి అంటూ పోస్టులు పెడుతున్నారు.  

  ఇటు రాజకీయంగా గానీ.. లేదా వ్యాపార పరంగా.. ఇంకా కాదనుకుంటూ సినిమా రంగానికి సంబంధించి.. ఇద్దరి మధ్య ఇటీవల ఎలాంటి చర్చలు జరగలేదని నాగార్జున సన్నిహితులు చెబుతున్నారు. మరి ఈ ప్రచారం ఎలా వచ్చింది.. ఈ ప్రచారం వెనుక ఎవరు ఉన్నారన్నదానిపైనా ఆయన సన్నిహితులు ఆరా తీస్తున్నట్టు సమాచారం..

  Published by:Purna Chandra
  First published:

  Tags: Akkineni nagarjuna, Andhra Pradesh, AP News, AP Politics

  ఉత్తమ కథలు