YCP Plenary 2022: వైసీపీ ప్లీనరీ (YCP Plenary)లో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకుంది.. వైసీపీ జీవితాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పార్టీ నేతలు. ఈ విషయాన్నికీలక నేత, రాజ్యసభ పక్షనేత విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ప్రకటించారు. జగన్ ను జీవితికాల అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ.. ప్లీనరీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనికి సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తనపై పూర్తి నమ్మకం ఉంచి.. అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై జగన్ ధన్యవాదాలు చెప్పారు. గత 13 ఏళ్లుగా తనను అపూర్వంగా ఆదిస్తున్న.. వైసీపీ సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాను అన్నారు జగన్.
ప్రస్తుతం వైసీపీ ప్లీనరీని ఆత్మీయ సునామీగా ఆయన అభవర్ణించారు. ప్రస్తుతం తనకు విజయవాడ-గుంటూరు మధ్య ఓ సముద్రం కనిపిస్తోంది అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదికూడా వర్షం పడుతున్నా చెక్కుచెదరని అభిమానం కనిపిస్తోంది అంటూ ఆనందం వ్యక్తం చేసిన.. సీఎం వైఎస్ జగన్.. ప్లీనరీ సమావేశాలకు హాజరైన జన సంద్రానికి అభివాదం చేశారు.
పావురాలగుట్టలో 13 ఏళ్ల క్రితం.. అంటే 2009 సెప్టెంబరు 25న ఈ సంఘర్షణ మొదలైంది అన్నారు సీఎం జగన్. ఓదార్పు యాత్రలో ప్రజల కష్టాలు.. నష్టాలు చూసిన తరువాత.. ఓ రూపం సంతరించుకుంది అన్నారు. ఆ సంకల్పంతో 2011 మార్చిలో వైఎస్సార్‌సీపీగా ఆవిర్భవించిందని గుర్తు చేశారు. 11 ఏళ్ల క్రితం నాన్న గారి ఆశయాల సాధన కోసం.. మనందరి ఆత్మాభిమానం కోసం ఈ పార్టీ పుట్టిందని గతాన్ని గుర్తు చేశారు.
ఇదీ చూడండి : ఏపీ స్పీకర్ తీరుపై విమర్శలు.. కోడెలకు ఒక రూల్.. తనకో రూలా అంటూ ప్రశ్నించిన తమ్మినేని
మీరంతా అవమానాలను సహించి, కష్టాలను భరించి, తనని అమితంగా ప్రేమించారని. ఈ ప్రయాణంలో తనతో నిలబడి, వెన్నుదన్నుగా ఉన్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, అక్కకు, చెల్లెమ్మకు, అవ్వా తాతలకు, ప్రతీ కార్యకర్తకు, ప్రతి అభిమానికి.. మన జెండా తమ గుండెగా మార్చుకున్న వైఎస్సార్‌సీపీ యోధులకు, కోట్లమంది మనసున్న మనుషులకు సెల్యూట్ చేస్తున్నాను అన్నారు.
ప్రజల ఆదారాభిమానులు ఉండడంతోనే.. 175 స్థానాలకు 151 ఎమ్మెల్యే స్థానాలతో మనకు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. మరోవైపు ఆ దేవుడి దయ కారణంగా.. 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొన్న వారిని 23 ఎమ్మెల్యే స్థానాలకు, మూడు ఎంపీ స్థానాలకు పరిమితం అయ్యేటట్టు చేరాని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి : మొన్న చెల్లి.. ఇప్పుడు అమ్మ.. నెక్ట్స్ ఎవరు? నవరత్నాలు కాదు.. నవ ఘోరాలంటూ చంద్రబాబు ఫైర్
తాజాగా ప్లీనరీ లో పార్టీ నిర్ణయంతో నేటి నుంచి జగన్ జీవితకాల అధ్యక్షుడిగా జగన్ కొనసాగనున్నారు. తల్లి విజయమ్మ.. గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత.. జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విపక్షాలు అయితే.. నియంత పార్టీ అధ్యక్షుడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంటున్నారు.. చెల్లి, తల్లి కూడా పార్టీని వదలడంతో.. అభద్రతాభావానికి గురై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ విపక్షాలు విమర్శిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp