హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

BRS MP Candidate: కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏపీ తొలి ఎంపీ అభ్యర్థి..? ఎవరో తెలుసా..?

BRS MP Candidate: కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏపీ తొలి ఎంపీ అభ్యర్థి..? ఎవరో తెలుసా..?

BRS MP 1st Candidate

BRS MP 1st Candidate

KCR NEW PartY MP Candidate: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రభావం ఏపీపై ఉంటుందా..? వైసీపీ, టీడీపీలల్లో ఏ పార్టీకి డ్యామేజ్ అవుతుంది..? ఇలాంటి చర్చ రచ్చ అవుతున్న సమయంలో.. ఏపీలో బీఆర్ఎస్ తొలి ఎంపీ అభ్యర్ధి అంటూ మరో వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా తొలి అభ్యర్థి..? అది నిజమేనా?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

    CM KCR New Party AP MP Candidate:  జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR).. తరువాత టార్గెట్ ఏపీనేనా..? వచ్చే సంక్రాంతి సమయంలో భారీ బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారా..? మరి ఆయన ఏపీలో సీరియస్ గా రాజకీయాలు మొదలు పెడితే.. ఏ పార్టీకి ఎంత మేర నష్టం.. ఏ  పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది.  కేసీఆర్ తో పాటు జాతీయ రాజకీయాల్లో నడిచేందుకు ఏపీ నుంచి ఎవరు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏఏ నేతలపై ఫోకస్ చేస్తున్నారు..? ఏపీలో ఎలాంటి ప్రభావం ఉండదని వైసీపీ మంత్రులు (YCP Ministers) పదే పదే చెబుతున్నారు. వరుసగా కామెంట్లు చేస్తున్నారు.

    మరి టీడీపీ (TDP) పరిస్థితి ఏంటి..? అసలు ఏ పార్టీ నుంచి ఎవరు వెళ్లే అవకాశం ఉందంటూ రెండు రోజుల నుంచి అంతర్గ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పార్టీ అధినేతలు సైతం దీనిపై ఫోకస్ చేస్తున్నారు. తమ పార్టీ నుంచి ఎవరు  వెళ్తారు అంటూ ఆరాలు కూడా తీస్తున్నారు. అలా ఆరా తీయడానికి కారణం లేకపోలేదు.

    ఇటీవల తెలంగాణ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఏపీలోనూ తమ కార్యకలాపాలు ఉంటాయి అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ తో కలిసి పని చేసిన నేతలను కలుస్తామన్నారు. ముఖ్యంగా టీడీపీలో ఉన్న నేతలు కొందరు.. తమతో వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటూ కామెంట్లు చేశారు. దీంతో టీడీపీ అలర్ట్ అయ్యింది.

    మరోవైపు ఏపీ నుంచి బీఆర్ఎస్ లో చేరేది ఎవరు..? ఏ  పార్టీ నుంచి ఎంతమంద్రి వెళ్లారు? సీట్లు దక్కించుకునేది ఎవరు..? ఏపీ నుంంచి ఎంపీ కేండిడేట్లు ఎవరూ అంటూ చర్చ మొదలైంది. అందులోనే ఎంపీగా తొలిసారి ఎవరి పేరును కేసీఆర్ ప్రకటిస్తారంటూ ఆసక్తిగా ఆ అంశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఓ ఫ్లెక్సీ వెలిసింది.. ఆ ఫ్లెక్సీ సంచలనంగా మారింది.. తాను బీఆర్ఎస్ నుంచి అమలాపురం ఎంపీ అభ్యర్థిని అంటూ రేవు అమ్మాజి రావు అనే వ్యక్తి ఏకం బ్యానర్ పెట్టేశారు.

    ఇదీ చదవండి : విశాఖలో అత్యధిక సీట్లు నెగ్గడమే టార్గెట్.. సీఎం జగన్ భారీ స్కెచ్.. ఏంటో తెలుసా?

    వాస్తవాలను చూసుకుంటే.. ఇప్పటి వరకు కేసీఆర్ చూపు ఇతర రాష్టాలవైపే ఉంది. ఏపీ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పటికే ఇలాంటి బ్యానర్లు ఫ్లెక్సీలు ఏపీలో వెలుస్తుండడం.. రాజకీయాల్లో సంచలనం అవుతోంది. అసలు ఏపీలో పార్టీ పరిస్థితి ఏంటో  కూడా తెలియదు.. కేసీఆర్ అసలు ఏపీ వైపు చూస్తారో లేదో కూడా తెలియదు.. కానీ ఇలా ఎవరికి వారు.. తామే ఎంపీ అభ్యర్థిని అని బ్యానర్లు కట్టుకుంటే ఎలా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

    ఇదీ చదవండి: కేసీఆర్ కొత్త పార్టీతో చంద్రబాబు అలర్ట్.. నేతలతో ప్రత్యేక సమావేశం.. వెళ్లేది ఎవరు..?

    అయితే అమ్మాజీ రావు మాత్రం తగ్గెదే లే అంటున్నారు.. బీఆర్ఎస్ నుంచి అమలాపురం ఎంపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నాను అంటూ ప్రకటించేసుకున్నారు.. ఫ్లెక్సీలు కూడా కట్టేశారు. మరి దీనిపై బీఆఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి..

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, CM KCR, KCR New Party

    ఉత్తమ కథలు