Mudragada Future: ఏపీ రాజకీయాల (AP Politics) పై అవగాహన ఉన్న వారికి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanbham) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా పనిచేసిన అనుభవం అయనది.. అప్పడు ఎంత గుర్తింపు వచ్చిందో.. అంతకన్నా కాపు ఉద్యమ నేతగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ముద్రగడ పద్మనాభానికి ఉంది. సమయానుకూలంగా పార్టీలు మారుతూ కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు.. మరికొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. కానీ కాపు ఉద్యమం చేసినప్పుడే మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. 1994లో తొలిసారి ప్రత్తిపాడు (Prathipadu) లో ఓడిన తర్వాత.. ఇక జీవితంలో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాబోనని భీష్మించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీట్ ఆఫర్ చేయడంతో పిఠాపురంలో పోటీ చేసినా.. ఆ సీటును ప్రజారాజ్యం పార్టీ గెల్చుకుంది. ఆపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగి.. కాపు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆ ఉద్యమానికి సైతం గుడ్‌బై చెప్పారు. 2014, 2019 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినా.. సైలెంట్ గానే ఉన్నారు.
కానీ ఇప్పుడు యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. త్వరలో వైసీపీ కండువా కప్పుకొంటారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే అధికార వైసీపీ నుంచి ఓపెన్ ఆఫర్ వచ్చినట్టు టాక్. అంతా ఓకే కాని సీట్ల దగ్గరే పంచాయితీ తేలడం లేదని ఆయన అనుచరలు చెబుతున్న మాట.
ముద్రగడను ప్రత్తిపాడు ఎమ్మెల్యే లేదా కాకినాడ ఎంపీగా పోటీ చేయాలనే ప్రతిపాదన వచ్చిందట. అయితే ఆ రెండింటినీ ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. తాను బతికుండగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేయబోనని.. ఒకవేళ బరిలో ఉండాల్సి వస్తే.. పార్లమెంట్ సీటుపైనా ఆసక్తి లేదని.. అసెంబ్లీకి అయితే ఒకే అని ముద్రగడ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
వైసీపీ కూడా మరో ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. దానికి తగ్గట్టుగానే వైసీపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట. పవన్ పిఠాపురాన్ని ఎంచుకుంటే..ఆయనపై ముద్రగడను పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని.. అదే ప్రత్యర్థిగా ముద్రగడ ఉంటే ఫలితం వైసీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుందని లెక్కలేసుకుంటున్నాట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి : రైతులకు అదిరిపోయే శుభవార్త.. డబుల్ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్ .. నేరుగా అకౌంట్లలోకి డబ్బు జమ
కాకినాడ పార్లమెంట్ పరిధిని కాపు సామాజికవర్గం ఓటర్లు ప్రభావితం చేస్తారు. ఆ సమీకరణాలకు తగ్గట్టుగానే అధికారపార్టీ అడుగులు వేస్తోందట. పిఠాపురం కాకపోతే మరో ఆప్షన్‌గా పెద్దాపురంను కూడా వైసీపీ పరిశీలిస్తోందట. వైసీపీ ఇంత వరకు పెద్దాపురంలో బోణీ కొట్టలేదు. పిఠాపురం, పెద్దాపురం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో.. అడుగులు ముందుకు పడొచ్చని అనుకుంటున్నారు. అయితే ప్రత్తిపాడు సీటును తన ఫ్యామిలీకి వదిలేయాలని ప్రతిపాదన ముద్రగడ నుంచి వెళ్లినట్టు టాక్. దానిపై వైసీపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, East godavari, Mudragada Padmanabham, Ycp