Kapu Meeting: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలపై దూకుడుగా వెళ్తున్నాయి. ముఖ్యంగా అన్ని పార్టీలు సామాజిక సమీకరణాలపై లెక్కలు వేసుకుంటున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఓట్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలి అంటే.. బీసీ ఓట్లు.. కాపుల ఓట్లు చాలా కీలకం అన్నది అన్ని పార్టీల లెక్క.. అందుకే ఆయా సామాజిక వర్గాల ఓట్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అధికార వైసీపీ.. బీసీల ఓట్ల (BC Votes)ను టార్గెట్ చేసింది.. ఇందులో భాగంగా జయహో బీసీ (Jayaho BC) పేరుతో భారీ సమావేశం ఏర్పాటు చేసింది. ఊహించినట్టే సభను సక్సెస్ చేశారు. అలాగే కాపుల ఓట్లను సాధించేందుకు.. ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు సీటు కూడా ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు గంటా శ్రీనివాస రావు (Ganta Sriniavasa Rao) ని సైతం పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదే సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. కాపులంతా ఏకతాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల బీసీ సమావేశానికి వ్యతిరేకంగానే..? ఇప్పుడు కాపుల సమావేశం జరుగుతోందనే ప్రచారం కూడా ఉంది. కారణం ఏదైనా..? ఈనెల 26న విశాఖలో కాపునాడు బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాధా రంగ రీ యూనియన్ ఆధ్వర్యంలో ఏ.ఎస్.రాజా గ్రౌండ్స్ లో సభ….రంగా జన్మదిన వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణలో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
కాపుల మధ్య ఐక్యత ఎంతో అవసరం అన్నారు గంటా శ్రీనివాసరావు. రాష్ట్రంలో ఉన్నది రెండు పార్టీలే కాదన్నారు.. కాపునాడు సభను తాను లీడ్ చేస్తున్నాననేది అపోహ మాత్రమే అన్నారు. ప్రతీ కార్యక్రమం అనివార్యంగా రాజకీయాలతో ముడిపడి ఉంటుందన్నారు. దీనికి ఏ నాయకుడు మినహాయింపు కాదన్నారు.
కాపు సమావేశం నిర్వహిస్తున్న.. ఆర్గనైజర్లకు ఒక స్పష్టమైన విధానం ఉందన్నారు. అది త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు గంటా శ్రీనివాసరావు. పార్టీ మార్పుపై తానెప్పుడు మాట్లాడలేదన్నారు. నిర్ణయం తీసుకుంటే తానే ప్రకటిస్తాను అన్నారు. వంగవీటి పేరు సమాజంలో ఓ వైబ్రేషన్ అన్నారు.
ఇదీ చదవండి : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి గంటా.. ఏం చెప్పారంటే..?
రంగా ఒక కులానికో… మతానికో ప్రతినిది కాదని.. బడుగు, బలహీన వర్గాలు నాయకుడు అన్నారు. దేశ నాయకులతో సమానంగా విగ్రహాలు కలిగిన నేత రంగా అన్నారు. కాపునాడు బహిరంగ సభ విజయవంతం కావాలని గంటా అభిలషించారు. పోస్టర్ రిలీజ్ చిరంజీవి చేతుల మీద జరగాల్సి ఉందన్నారు. అయితే గంటా వ్యాఖ్యలను చూస్తే.. చాలా అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నవి రెండు పార్టీలు మాత్రమే కాదు అన్నారు ఆయన.. అంటే వైసీపీ , టీడీపీకి ప్రత్యామ్నాయంగానే ఈ సమావేశం జరుగుతోందా.. దీనికి తోడు.. ఈ సమావేశానికి ముందే.. గంటా శ్రీనివాసరావు.. అటు మెగాస్టార్ చిరంజీవిని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. అంటే కాపులంతా పవన్ తో వెళ్లాలని ఫిక్స్ అయ్యారా అంటూ మరో ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Ganta srinivasa rao, Megastar Chiranjeevi, Pawan kalyan