కొండగట్టు అంజన్న సాక్షిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. కన్నా లక్ష్మీ నారాయణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్న గౌరవిస్తా. కన్నా ప్రస్తుతం బీజేపీలో ఉన్నందున ఏమి మాట్లాడలేనని పవన్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు.
కారణం అదే?
కాగా కన్నా జనసేనలో చేరబోతున్నారనే ప్రచారానికి కారణం లేకపోలేదు. గత నెల జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ కన్నాను ఆయన ఇంటికి వెళ్లి కలవడంతో.. జనసేనలోకి వెళ్లడం ఖాయమనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తరువాత కూడా తాను బీజేపీలో ఉంటానని ప్రకటించిన కన్నా..సోము వీర్రాజును టార్గెట్ చేయడం మాత్రం ఆపలేదు. ఆయన వల్లే ఏపీలో పార్టీ ఎదగడం లేదన్నట్టుగా విమర్శలు గుప్పించారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారేందుకు దాదాపుగా సిద్ధమయ్యారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP News, Bjp, Kanna Lakshmi Narayana, Pawan kalyan