Balakrishna: నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అటు అన్ స్టాప్ బుల్ సీజన్ 2 సూపర్ సక్సెస్ కావడం.. ఇటు వీర సింహారెడ్డి కమర్షియల్ హిట కొట్టడంతో బాలయ్య ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. మరోవైపు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అక్కినేటి తొక్కనేని అనడంపై ఎఎన్ఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బాలయ్య ఆ విషయంలో తనది తప్పు లేదన్నారు. నాగేశ్వర్రావు పై ఎంతో ప్రేమ ఉందో కూడా వివరించారు. అయితే దుమారం ఆగడం లేదు. ఆ వివాదం కొనసాగుతుండగానే ప్రస్తుతం సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
బాలయ్య తన ప్రచార వాహనంపై నుంచి పడబోయారు బాలకృష్ణ.. కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వాహనం కదలడంతో తుళ్లి వెనక్కి పడిపోయారు బాలకృష్ణ.. దీంతో కాసేపు ఏం జరుగుతుందో తెలీక అయోమయానికి గురయ్యారు అభిమానులు.
View this post on Instagram
ఈ సందర్భంగా మరోసారి వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ లో కాళ్ళు మొక్కుతా బాంచన్ అన్న విధంగా రాష్ట్రం లో పాలన ఉంది. ఓట్లేసి గెలిపించుకుంటే బాదుడే బాదుడే తెచ్చారని. మూడు రాజధానిలని మూడేళ్లు గడిపాడరని. నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని... పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అధ్వాన్నంగా పరిస్థితులు ఉన్నాయిని బాలయ్య విమర్శించారు. ఉచిత పథకాలు మోజులో పడి మోసపోకండి… ధరల బాదుడు పెరుగుతోంది అన్నారు.
అలాగే టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటే జనం తిరగబడతారని జోస్యం చెప్పారు. యువగళంతో యువతకు భవిష్యత్ ఉండబోతుందన్నారు. ఏపీ ప్రజలంతా నారా లోకేశ్ ను ఆశీర్వదించాలని కోరారు. తాను కూడా లోకేశ్ పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. యువగళానికి అనుసంధానంగా హిందూపురంలో పలు కార్యక్రమాలను చేపడతానని పేర్కొన్నారు. మరోసారి జగన్ పాలన కొనసాగితే ఇండియా మ్యాప్ నుంచి ఏపీ కనుమరుగయ్యే పరిస్థితి ఉందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Nandamuri balakrishna, Nara Lokesh