హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Viral Photo: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కాలుపై కాలేసి కూర్చున్న Jr.ఎన్టీఆర్ .. పాత ఫోటోపై కొత్తచర్చ

Viral Photo: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కాలుపై కాలేసి కూర్చున్న Jr.ఎన్టీఆర్ .. పాత ఫోటోపై కొత్తచర్చ

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Viral photo: గుడివాడ ఎమ్మెల్యే నాని కాలుపై కాలు వేసి కూర్చున్న టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఫోటో పాతదే అయినప్పటికి అమిత్‌షా, ఎన్టీఆర్‌ భేటీపై వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసిన తర్వాత బయటకు రావడంపై పెద్ద చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్‌లో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) పేరు సోషల్ మీడియా(Social media)లో మార్మోగిపోతోంది. రెండ్రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి(Union Home Minister) అమిత్‌షా(Amit Shah)తో భేటీ కావడం జూనియర్ ఎన్టీఆర్ పేరు అటు పొలిటికల్‌గా, ఇటు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ ఇమేజ్‌ సంపాధించుకున్న తారక్‌కి బీజేపీ(BJP) అగ్రనేతలతో ఏంటీ సంబంధం అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani)స్పందించారు.


Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని టేకోవర్ చేసుకుంటారా.. తెరపైకి సరికొత్త డిమాండ్కామెంట్స్ వెనుక కహానీ..
బీజేపీ పెద్దలు ప్రధాని మోదీ(Prime Minister Modi), కేంద్ర మంత్రి అమిత్‌షా లాంటి నాయకులు బీజేపీకి అవసరమైతేనే ఎవరినైనా కలుస్తారు..వాళ్లకు టైమ్‌ కేటాయిస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ని కూడా రాజకీయ అవసరాల కోసమే కలిసి ఉంటారని కొడాలి నాని చెప్పకనే చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్‌ కలిసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఈ ఫోటోలో కొడాలి నానితో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు.పాత ఫోటోపై కొత్త చర్చ..

యంగ్‌ టైగర్ అభిమానులు షేర్ చేసిన ఈఫోటోలో ఎన్టీఆర్‌, కొడాలి నాని, వల్లభనేని వంశీ ముగ్గురూ పక్క పక్కనే కుర్చిల్లో కూర్చున్నారు. కాలు మీద కాలేసి కూర్చున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కాలిపై ఎన్టీఆర్‌ తన కాలు వేసి దర్జాగా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వంశీ, కొడాలి నాని ఎన్టీఆర్‌కి మంచి మిత్రులు. గతంలో ఎన్టీఆర్‌తో సినిమా తీశారు. ఆ షూటింగ్‌ సమయంలో దిగిన ఫోటోలా ఉంది. ఫోటో ఎలా ఉన్నా.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్‌, అమిత్‌షాపై కామెంట్స్ చేసిన టైమ్‌లో ఈ ఫోటో బయటకు రావడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.


అందుకే బయటపెట్టారా..?

ఎన్టీఆర్‌ ట్రెండ్స్‌ పేరుతో ఉన్న ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్ చేసిన ఈ ఓల్డ్ ఫోటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దీనిపైనే కామెంట్స్, కౌంటర్స్‌ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. కొడాలి నాని తొలిసారి గుడివాడ నుంచి పోటీ చేయడానికి టీడీపీ టికెట్‌ రావడానికి పరోక్షంగా ఎన్టీఆరే కారణమనే సంగతి అందరికి తెలిసిందే. ఆ తర్వాత కూడా మరోసారి టీడీపీ నుంచి గెలిచిన నాని వైసీపీలో చేరారు. ఆ పార్టీ గుర్తుతో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రాజకీయ అవసరాల కోసమే అమిత్‌షా ఎన్టీఆర్‌ని కలిసి ఉంటారని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గానే టీడీపీకి చెందిన నందమూరి అభిమానులు ఈ ఫోటో బయటపెట్టినట్లుగా అర్ధమవుతోంది.

Published by:Siva Nanduri
First published:

Tags: Andhra Pradesh, Jr ntr, Kodali Nani, Viral photo

ఉత్తమ కథలు