Home /News /andhra-pradesh /

AP POLITICS JUNIOR NTR MAY GET IMPORTANCE IN TDP AFTER RRR MOVIE SUPER HIT FULL DETAILS HERE PRN

NTR: జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీకి మరో ఆప్షన్ లేదా..? ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత మారిన లెక్కలు..!

ఎన్టీఆర్, చంద్రబాబు (ఫైల్)

ఎన్టీఆర్, చంద్రబాబు (ఫైల్)

అప్పట్లో ఎన్టీఆర్ (NTR)తీరును టీడీపీ (TDP) నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అంతేకాదు వర్ల రామయ్య లాంటి నేతలు ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని (Kodali Nani), వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) వెనుక ఎన్టీఆర్ ఉన్నారన్న ఆరోపణలు కూడా తెలుగుతమ్ముళ్లు చేశారు. అంతేనా ఎన్టీఆర్ తమకేం పనంటూ కామెంట్స్ కూడా చేశారు.

ఇంకా చదవండి ...
  ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) ప్రస్తుతం ఎదురీదుతోంది. 2019 ఎన్నికల్లో జగన్ కొట్టిన దెబ్బ నుంచి ఆ పార్టీ ఇంకా కోలుకోలేదు. ముఖ్యనేతలు పార్టీని వీడటం.. ఉన్నవాళ్లలో క్రమశిక్షణ లేకపోవడంతో చంద్రబాబుకు తలనొప్పులు తప్పడం లేదు. ఇక నారా లోకేష్ (Nara Lokesh) నాయకత్వాన్ని సొంతపార్టీలో కొంతమంది నేతలే పూర్తిగా అంగీకరించలేని పరిస్థితి. ఇక వైసీపీ నేతలు కూడా లోకేష్ సమర్ధతపై తరచూ సెటైర్లు, జోకులు వేస్తున్నారు. ఇక నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ వారసుడిగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuru Bala Krishna) పార్టీలో ఉన్నా పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. పార్టీ విషయంలో పూర్తి నిర్ణయాధికారం చంద్రబాబుదే. కానీ అధినేత నిర్ణయాలు ఈ మధ్య తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదు.

  ఇదిలా ఉంటే పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలంటే జూనియర్ ఎన్టీఆర్ (NTR) ను రంగంలోకి దించాలన్న డిమాండ్లు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. గత ఏడాది చంద్రబాబు కుప్పం పర్యటనలో స్థానిక కార్యకర్తలే ఎన్టీఆర్ రావాలంటూ నినాదాలు చేశారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేతలు కూడా చిన్న రాముడ్ని తీసుకురావాలని బహిరంగంగానే డిమాండ్ చేశారు. ఐతే ఎన్టీఆర్ ను తీసుకురావాలన్న డిమాండ్లపై చంద్రబాబు మౌనంగానే ఉన్నారు. బాలకృష్ణ కూడా ఎవర్నీ పిలవమని పలుసార్లు స్పష్టం చేశారు.

  ఇది చదవండి: గౌతమ్ రెడ్డిని తల్చుకొని ఎమోషనల్ అయిన జగన్.. ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న సీఎం..


  ఐతే అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత నందమూరి కుటుంబమంతా ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఇతర నేతలపై మండిపడింది. ఆ సమయంలో ఫారిన్ టూర్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. అలాంటి వ్యాఖ్యలను ఖండిస్తూ వీడియో రిలీజ్ చేశారే తప్ప అందులో భువనేశ్వరి పేరుగానీ, వంశీ, కొడాలి నాని పేర్లుగానీ ప్రస్తావించలేదు.

  ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ బడ్జెట్ తో ఏపీలో ఈ పథకాలు అమలు చేయవచ్చు.. అవేంటంటే..!


  అప్పట్లో ఎన్టీఆర్ తీరును టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అంతేకాదు వర్ల రామయ్య లాంటి నేతలు ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వెనుక ఎన్టీఆర్ ఉన్నారన్న ఆరోపణలు కూడా తెలుగుతమ్ముళ్లు చేశారు. అంతేనా ఎన్టీఆర్ తమకేం పనంటూ కామెంట్స్ కూడా చేశారు. ఐతే ఆ విషయాలేమీ పట్టించుకోని ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎన్టీఆర్ కు ఎక్కడాలేని ఫేమ్ వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇదే బిగ్గెస్ట్ హిట్. ఎక్కడ చూసినా ఆయన నటనకు వందకు రెండొందల మార్కులు పడుతున్నాయి. ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ కు ఫిదా అవుతున్నారంటే తారక్ స్థాయి పెరిగింది. ఆయన స్టార్ డమ్ ఇంకా రెట్టింపైంది.

  ఇది చదవండి: ఏపీలో పెరగనున్న విద్యుత్ బిల్లులు..? కొత్త ఛార్జీలు ఇవేనా..!


  ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబుగానీ, టీడీపీగానీ వైఖరి మార్చుకోకుంటే మొదటికే మోసం వస్తుందని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఇకనైనా తారక్ విషయంలో విమర్శలు చేయకుండా , పార్టీకి ఆయన అభిమానులు, నందమూరి కుటుంబ శ్రేయోభిలాషులు దూరం కాకుండా జాగ్రత్తపడాల్సిన అవసరముందన్న సూచనలిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉండటం, రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉండటంతో ఆ పార్టీని ఓడించాలంటే ప్రతి ఒక్క అంశం కీలకమే. అలాంటి పరిస్థితిలో తారక్ విషయంలో ఛాన్స్ తీసుకునేకంటే.. ఆయన్ను దగ్గరకి తీసుకుంటే బెటరనే మాట వినిపిస్తోంది. మరి చంద్రబాబు ఈ విషయంలో పట్టువీడతారా..? చిన్నరాముడ్ని ఒప్పించి మరోసారి సైకిల్ ఎక్కిస్తారా..? అనేది వేచి చూడాలి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Jr ntr, Rrr movie

  తదుపరి వార్తలు