Home /News /andhra-pradesh /

AP POLITICS JR NTR WILL LINE CLEAR TO CHANDRABABU NAIDU FOR NEXT ELECTIONS IN ANDHRA PRADESH NGS

Jr NTR: చంద్రబాబు నాయుడుకు లైన్ క్లియర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. రివర్స్ గేమ్ మొదలెడతరా..?

చంద్రబాబు ,జూనియర్ ఎన్టీఆర్

చంద్రబాబు ,జూనియర్ ఎన్టీఆర్

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ తో.. ఏపీ రాజకీయాల్లో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చేలా చేసింది. అంతేకాదు చంద్రబాబు నాయుడుకు ఓ విషయంలో లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఇకపై చంద్రబాబు వ్యూహం మారుస్తారా అంటూ ప్రచారం జరుగుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  Jr NTR: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రతిపక్ష పార్టీ  తెలుగు దేశం (Telugu Desam) అధినేత చంద్రబాబు నాయుడు (Chanadrababu Naidu) చాలా కాలంగా తీవ్ర ఒత్తిడి లో ఉన్నారు. ముఖ్యంగా తన సొంత నియోజవకవర్గం కుప్పం (Kuppam)లోనూ ఈ సారి ఇబ్బందులు తప్పడం లేదు. అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కుప్పంపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక పథకాలు ప్రకటిస్తున్నారు. వైసీపీ నేతలతో పాటు.. ప్రజలకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అధికారబలమంతా అక్కడ ఉపయోగించి.. చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులను వైసీపీలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో చంద్రబాబుపై ఒత్తిడి పెరిగింది. ఇక రెండో కారణం ఏంటంటే..? జూనియర్ ఎన్టీఆర్ నినాదం.. అవును 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత నుంచి.. పార్టీలో ఓ చర్చ మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకోవాలని.. సీనియర్ నేతలు సైతం డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తన సొంత నియోజకవర్గం కుప్పంలో.. చంద్రబాబు పర్యటనల సమయంలో.. కార్యకర్తల నుంచే ఈ డిమాండ్ వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని చంద్రబాబు ముందు నినాదాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రోజు రోజుకూ ఈ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గర చేర్చుకుంటే.. నారా లోకేష్ కు.. రాజకీయంగా భవిష్యత్తు లేనట్టే అన్నది బహిరంగ రహస్యమే.. అలా అని జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టే అవకాశం లేదు. ప్రస్తుతం సూపర్ హిట్ సినిమాలతో ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. అంతేకాదు ఓటర్లను ఆకట్టుకునే ఛరిష్మా తారక్ సొంతం. అందులోనూ మాట తీరు సైతం.. తాతకు తగ్గ మనవు అనిపించేలా ఉంటుంది. అందుకే టీడీపీ కార్యకర్తల్లోనూ ఎన్టీఆర్ పై అంత క్రేజ్ ఉంటుంది. ఇదీ చదవండి : మహిళలకు శుభవార్త.. నేడు చంద్రబాబు అడ్డా నుంచి నగదు జమ.. జగన్ 23 సెంటిమెంట్ కథ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే.. కచ్చితంగా బలం పెరుగుతుంది అన్నది ఎక్కువమంది అంచనా.. ఎన్టీఆర్ ను పక్కన పెడితే.. నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు దూరం చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తాయి. అందుకే ఎలా వెళ్లాలో తెలియక చంద్రబాబు సైలెంట్ గా ఉంటున్నారు. కానీ ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఓ ట్వీట్.. ఆ టెన్షన్ ను తగ్గించింది అనే చెప్పాలి. ఇదీ చదవండి : ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటున్నారా..? 5 వేలు నుంచి మొదలు.. ఆ నెంబర్ మాత్రం 2 లక్షలు తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్ఆర్ యూనివర్శిటీగా మార్చుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకు అతీతంగా అంతా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ మనవడైన.. జూనియర్ ఎన్టీఆర్ ఘుటుగా స్పందిస్తారని అంతా అనుకున్నారు. కానీ తారక్ మాత్రం.. అసలు ఆ విషయంలో ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. కర్ర విరగదు.. పాము చావదు అన్న రీతిలో.. వైఎస్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ ఒకే స్థాయి నేతలు అంటూ సరికొత్త అర్థం చెప్పారు. తాజాగా ఎన్టీఆర్ ట్వీట్ పై  టీడీపీ నేతలంతా గుర్రుగా ఉన్నారు. ఆయన అభిమానులు సైతం ఆయన  ట్వీట్ ను జీర్ణించుకోలేకపోతున్నారు. తాతను దైవంగా చెప్పుకునే ఎన్టీఆర్.. ధైర్యంగా  ఆయన పేరు తొలగించడం తప్పు అని ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోయారు అని ప్రశ్నిస్తున్నాు. ఇదీ చదవండి : కొడాలి నానికి లైన్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. మరి మాజీ మంత్రి స్పందిస్తారా..? ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలో తీసుకున్నా.. ఆయనలో మునపటి వేడి లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ముందుకు వెళ్తే.. సినిమాలపై ప్రభావం పడుతుందనే భయంతోనే ఆయన గట్టిగా మాట్లాడలేకపోతున్నారనే అంతా అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇకపై ఎవరూ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేసే అవకాశం లేదు. ఒకవేళ చేసినా.. తాతా పేరును తొలగిస్తే మాట్లాడని.. ఆయన.. ప్రభుత్వంపై ఇంకెలా పొరాడుతారంటూ చంద్రబాబు.. వారికి సమాధానం చెప్పే అవకాశం దొరికింది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Jr ntr, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు