Jr NTR: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (NTR Health University) పేరు.. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం (AP Government) నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లును ఏపీ అసెంబ్లీ (AP Assembly) ఆమోదించింది. అయితే ఈ పేరు మార్పుపై బుధవారం ఉదయం నుంచే నిరసనలు మొదలయ్యాయి. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నేతలు ఆందోళనలు చేపట్టారు. కేవలం తెలుగు దేశం నేతలే కాదు.. బీజేపీ (BJP), జనసేన (Janasena) సైత ప్రభుత్వం తీరును తప్పు పట్టాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం ఈ నిర్ణయం సరైంది కాదు అంటూ ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శించారు. నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికు ఎమ్మెల్యే బాలయ్య, పురేందశ్వరి ఇతర కుటుంబ సభ్యులు స్పందించారు. వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించారు.
ఆయన ఏమన్నారు అంటే.. ఎన్టీఆర్ , వైఎస్ఆర్ ఇద్దరూ ప్రజల్లో విశేష ఆధరణ ఉన్న వ్యక్తులే అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్చినంత మాత్రాన ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు ఏ మాత్రం దిగజారవు అన్నారు. ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టినంత మాత్రాన వారి స్థాయి పెరగదు అన్నారు. ఎన్టీఆర్ సంపాదించుకున్న పేరు, కీర్తి ప్రతిష్టలను చెరిపివేయడం సాధ్యం కాదన్నారు.
— Jr NTR (@tarak9999) September 22, 2022
అయితే ఈ విషయంలోనూ ఎన్టీఆర్ పై విమర్శలు తప్పేలా లేవు. ఈ నిర్ణయంపై ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పడతారని టీడీపీ నేతలు, ఆయన అభిమానులు ఆశించారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎప్పటిలానే.. కర్ర విరగదు.. పాము చావదు అన్న రీతిలో ట్వీట్ చేసి సరిపెట్టుకున్నారు. దీనిపై ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి.
ఎన్టీఆర్ ట్విట్టర్ సారాంశం చూస్తే.. ఆయన ఎక్కడా ప్రభుత్వాన్ని నిందంచలేదు.. ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్ధించలేదు.. కనీసం తాత పేరును కొనసాగించాలి అంటూ డిమాండ్ కూడా చేయలేదు. దీంతో మరోసారి ఆయన ట్వీట్ పై దుమారం రేగే అవకాశాలు ఉన్నాయి.
అయితే జూనియర్ ఎన్టీఆర్ మినహా.. నందమూరి కుటుంబ సభ్యులు అంతా ఘాటుగానే స్పందించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. బుధవారమే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్- వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడం దురదృష్టకరం అన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించడం తెలుగు జాతిని అవమానించడమే అని మండిపడ్డారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Cm jagan, Jr ntr, TDP