GT Hemanth Kumar, Tirupathi, News18
Jr NTR: రాజకీయాలకు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దూరంగా ఉంటున్నారు.. కానీ ఆయన్ను రాజకీయాలు వదలడం లేదు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా (Chittoor District)లో టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh).. యువగళం పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల యువతతో మాట్లాడిన ఆయన.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే ఆయన అభిమానులు హడావుడి చేశారు.. లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న పీలేరులో.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో హంగామా చేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రభంజనంతో విశ్వవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు మారు మోగుతోంది. ఓవైపు సినిమాల్లో బిజీ బిజీ గా గడిపేస్తూ... అంతర్జాతీయ అవార్డు కార్యక్రమాల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. తెలుగు రాష్ట్రల్లో సైతం ఆ క్రేజ్ కొనసాగుతోంది.
సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉంటే.. ఆయన అభిమానులు.. కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం యంగ్ టైగర్ రాజకీయ ఎంట్రీ ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. ఆ విషయం అధిష్టానానికి తెలిసేలా.. చేస్తున్నారు. ఆ మధ్య చంద్రబాబు సభల్లో ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెడుతూ తమ అభిమతం తెలిసే చేస్తున్నారు.
ఇటీవల యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతిలో హలో లోకేష్ అనే కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అంటూ కార్యకర్త ప్రశ్నించారు. దీనికి లోకేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. రాష్ట్రం బాగుండాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని, అలా వచ్చే అందర్నీ తాను ఆహ్వానిస్తానని చెప్పారు లోకేష్.. అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరెవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. దింతో నారాలోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను ప్రజలకోసం రాజకీయ అరంగేట్రం చేయాలనీ కోరారు. జూనియర్ ఎన్టీఆర్, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన.
ఇదీ చదవండి : అనంతపురంలో హై టెన్షన్.. టీడీపీ-వైసీపీ మద్దతు దారుల మధ్య రాళ్లదాడితో ఉద్రిక్తత
ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ ప్లెక్సీలు వెలిశాయి. పీలేరు పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం వరకు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. కానీ టీడీపీ శ్రేణులు ఆ ఫ్లెక్సీలు తొలగించాయి. సోమవారం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కావడంతో ఈ ఫ్లెక్సీలు కాావలనే తొలగించారని యంగ్ టైగర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: అరెస్టులు తప్పవా..? 10న అవినాష్ రెడ్డి, 12న భాస్కర్ రెడ్డి విచారణకు హాజరు..!
గతంలోనూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ నూతన జెండా తయారు చేసి ఆవిష్కరించారు. అది కూడా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని జనవరి చంద్రబాబు పర్యటించనప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ డిమాండ్ పై అధిష్టానం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అలాగని నో అని కూడా చెప్పలేదు. చంద్రబాబు సైతం సరే అంటూ అప్పుడు తల ఊపారు అంతే. అయితే జూనియర్ ఎన్టీఆర్ త్వరగా రావాలని ఫ్యాన్ మాత్రం కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Jr ntr