హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jr NTR-Balayya: అబ్బాయి నీరు.. బాబాయ్ ఫైర్.. ఎన్టీఆర్, బాలయ్య ట్వీట్ల వెనుక లెక్క ఏంటి..?

Jr NTR-Balayya: అబ్బాయి నీరు.. బాబాయ్ ఫైర్.. ఎన్టీఆర్, బాలయ్య ట్వీట్ల వెనుక లెక్క ఏంటి..?

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్

Jr NTR-Balayya: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నీరు అయితే.. రామ్ చరణ్ నిప్పు.. ఇప్పుడు అది నందమూరి కుటుంబానికి యాప్ట్ అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లషకులు.. ఎన్టీఆర్ నీరులా వివాదాన్ని చల్లారిస్తే.. బాలయ్య నిప్పులా వివాదాన్ని మరింత ముదిరేలా చేశారు. అయితే ఈ ట్వీట్ల లెక్క ఏంటి..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Jr NTR-Balayya: ఆంధ్రప్రదేశ్ ( Anhra Praesh) లో హెల్త్ యూనివర్శిటీ (Health Univerisity) పేరు మార్పు వివాదం రోజు రోజుకూ మరింత ముదురుతోంది. దీనిపై ఎవరి వాదన వారు వినిపిస్తోంది. సోషల్ మీడియా (Social Media)లో వివాదం రచ్చ రచ్చ అవుతోంది. ఇప్పుడు ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి.. నందమూరి అభిమానులు.. టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయేలా చేస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ.. వైఎస్ఆర్ యూనివర్శిటీగా పేరు మార్చడంపై.. అందరూ స్పందించినా.. అందరికీ చూపు నందమూరి కుటుంబంపైనే ఉంటుంది. ఊహించినట్టే ఆ కుంటుంబం నుంచి యాక్టివ్ గా ఉండేవారంతా స్పందించారు. ఎన్టీఆర్ తనయుడు బాలయ్య (Balayya), కూతురు పురందేశ్వరి (Purandeswari), మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కళ్యాణ్ రామ్ ( Kalyan Ram).. ఇతర కుటుంబ సభ్యులు సైతం తమదైన స్టైల్లో స్పందించారు..

  అందరూ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపడుతూనే మాట్లాడారు.. కానీ సీనియర్ ఎన్టీఆర్ కు అసలైన వారసుడిగా.. భవిష్యత్తు  నాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన అభిమానులు ప్రచారం చేసుకుంటారు.  తెలుగు దేశంలో కొందరు నేతలు సైతం..  తమ పార్టీకి భవిష్యత్తు జూనియర్ ఎన్టీఆరే అని అభిప్రాయపడతారు.  తారక్ సైతం తాత తనకు ఆరాధ్యం దైవం అని చెబుతుంటారు.  దీంతో తాతా పేరును తొలగించడంపై యంగ్ టైగర్ ఓ రేంజ్ లో విరుచుకుపడతారని అంతా ఊహించారు.. 

  ఆర్ఆర్ఆర్ సినిమా ఎఫెక్టో లేకా.. ప్రస్తుతం సినిమాల్లో ఉన్న తాను రాజకీయంగా కార్నర్ ఎందుకు అవ్వాలి అనుకున్నారో..? లేకా వైఎసర్ఆర్ ఫ్యామిలీపై సాఫ్ట్ కార్నర్ ఉందో..? అది కాకకుంటే.. తన మామ, సన్నిహితులు వైసీపీలో ఉన్నారు ఎందుకు రిస్క్ అనుకున్నారో.. కారణం ఏదైనా కర్ర విరగదు, పాము చావదు అన్న రీతిలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టకుండా.. పేరు మార్చినంత మాత్రాన వైఎస్ఆర్, ఎన్టీఆర్ లాంటి స్థాయి నాయకుల ఖ్యాతి తగ్గదు అంటూ ట్వీట్ చేశారు.

  ఎన్టీఆర్ ట్వీట్ వచ్చినప్పటి నుంచి సీనియర్  ఎన్టీఆర్ ను అభిమానించే వారు, తెలుగు దేశం నేతలు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు సైతం జూనియర్ పై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఫైర్ అవుతారు అనుకున్న యంగ్ టైగర్.. ఇలా వివాదంపై నీరు పోయడం ఏంటని.. కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోల్స్ ట్రెండింగ్ గా మారేలా చేస్తున్నారు.

  మరోవైపు అదే స్థాయిలో కొందరు జూనియర్ హార్డ్ కోర్ అభిమానులు సైతం ఆయన్న సపోర్ట్ చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ గొడవ మొదలైంది.

  ఇదే సమయంలో బాలయ్య ట్వీట్.. నందమూరి అభిమానుల్లో ఫైర్ నిపింది.. మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు.. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త… అంటూ మండిపడ్డారు. స్పందన అంటే ఇలా ఉండానలి అని ఇటు టీడీపీ నేతలు, అటు నందమూరి అభిమానులు పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. 

  ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు.. బాబాయ్.. అబ్బాయిలు ఇలా స్పందించడానికి బలమైన కారణాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ప్రస్తుతం ఆయన సినిమాలపైనే పూర్తి ఫోకస్ చేశారు.. రాజకీయాల్లోకి ఇప్పట్లో వచ్చే ఉద్దేశం లేదు. మరికొంతకాలం సూపర్ స్టార్ గా ఉండాలి అంటే అధికార పార్టీ మద్దతలు.. అన్ని పార్టీల కార్యకర్తల మద్దతు అవసరం అని అభిప్రాయపడి ఉండొచ్చు.. అలాగే పిల్లను ఇచ్చిన మామ వైసీపీ పార్టీలోనే ఉన్నారు.  ఆయనకు టికెట్ రావాలి అంటే జూనియర్ సపోర్ట్ అవసరం.. అలాగే సన్నిహతులు కొడాలి నాని , వంశీ కూడా అదే పార్టీలో ఉన్నారు. దీనికి తోడు ఆ పార్టీ తరపున ఎన్టీఆర్ సన్నిహితులు మరికొన్ని సీట్లు ఆశిస్తున్నారనే ప్రచారం ఉంది. వీటి నేపథ్యంలోనే ఆయన ఇలా స్పందించి ఉంటారని విశ్లేషనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

  ఇదీ చవండి : తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో చాప, తాడు కీలకం.. ఎక్కడ నుంచి తెచ్చారో తెలుసా..?

  జూనియర్ ఎన్టీఆర్ స్పందనతో నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు పూర్తిగా ఢీల పడ్డాయి. దీంతో వారిని మళ్లీ పోరాటం వైపు మర్చాలి అంటే.. ఘాటుగా స్పందని అవసరం.. అందుకే బాలయ్య రంగంలోకి దిగాల్సి వచ్చింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అంతేకాదు ఆయన ట్వీట్.. టీడీపీ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిచ్చింది అంటున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Jr ntr, Kalyan Ram Nandamuri, Nandamuri balakrishna, Nandamuri Family, Purandeswari

  ఉత్తమ కథలు