Home /News /andhra-pradesh /

AP POLITICS JOSH IN TELUGU DESHAM PARTY AFTER AAP WON IN PUNJAB ASSEMBLY EELCTION 2022 FOR THIS REASONS FULL DETAILS HERE PRN BK

TDP: పంజాబ్ లో ఆప్ విజయం.. ఏపీలో తెలుగు తమ్ముళ్ల జోష్.. కారణం ఆయనేనా..!

చంద్రబాబు, అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్)

చంద్రబాబు, అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్)

పంజాబ్ (Punjab Assembly Election) లో ఆప్ (AAP) విజయం దేశం దృష్టిని ఆకర్షించింది. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) పార్టీ విజయం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) లో జోష్ నింపింది. వ‌చ్చే ఎన్నిక‌ల్ల అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌నే ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    M Bala Krishna, Hyderabad, News18

    ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) నాలుగు రాష్ట్రాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే పంజాబ్ (Punjab Assembly Election) లో ఆప్ (AAP) విజయం దేశం దృష్టిని ఆకర్షించింది. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) పార్టీ విజయం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) లో జోష్ నింపింది. వ‌చ్చే ఎన్నిక‌ల్ల అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌నే ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఏపీలో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త, అభివృద్ది లేక‌పోవడం రాజ‌ధాని వంటి అంశాల్లో జ‌గ‌న్ స‌ర్కార్ ను టీడీపీ ఇరుకున‌పెడుతూ వ‌స్తోంది. ఇదే అంశాల‌కు సంబంధించి రాష్ట్ర‌వ్యాప్త ఉద్య‌మాలు కూడా చేస్తోంది. ప్ర‌తిప‌క్ష పార్టీ చేస్తోన్న ఆందోళ‌న‌ల‌కు ప్ర‌జ‌ల త‌రుపు నుంచి కూడా మ‌ద్ద‌తు రావ‌డంతో ప్ర‌స్తుతం ఏపీలో టీడీపీ ప‌రిస్థితి కాస్త బెట‌ర్ అనే అంటున్నారు రాజ‌కీయ‌విశ్లేష‌కులు.

    అయితే ఇన్ని అనుకూల ప‌రిస్థితిలో టీడీపీకి ఇప్పుడు పంజాబ్ లో ఆప్ విజ‌యం సాధించ‌డం పెద్ద గుడ్ న్యూస్ గా మారింది. ఎందుకంటే అక్క‌డ ఆప్ విజ‌యం సాధించ‌డానికి దోహ‌ద‌ప‌డ్డ పొలిటిక‌ల్ వ్యూహాక‌ర్త రాబిన్ శ‌ర్మనే ఇప్పుడు ఏపీలో టీడీపీకి కూడా వ్యూహ‌క‌ర్త‌గా ఉన్నారు. త‌న ఐడియాలో పంజాబ్ లో వ‌ర్క్ వుట్ అవ‌డంతో ఇప్పుడు ఏపీలో కూడా రాబిన్ శ‌ర్మ ఐడియాలు వ‌ర్క‌వుట్ అవుతాయ‌నే తెలుగు తమ్ముళ్లు హోప్స్ పెట్టుకుంటున్నారు.

    ఇది చదవండి: జనసేన సభ కొత్త పొత్తులకు వేదిక కానుందా..? పవన్ ప్రకటనపై సస్పెన్స్.. ఆ నేత ఆశలు ఫలిస్తాయా..?

    ఇదిలా ఉంటే తొలిత టీడీపీ వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్ ను సంప్ర‌దించిన‌ప్ప‌టికి తాను వ్యూహ‌క‌ర్త‌గా వ‌ర్క్ చేయాలంటే దాదాపుయ 300 కోట్ల ఫీజు చెల్లించాల‌ని ఆయ‌న ప్ర‌తిపాదించిన‌ట్లు స‌మాచారం. దీంతో ప్ర‌శాంత్ కిషోర్ స్థానంలో ఆయ‌న టీమ్ లో వ‌ర్క్ చేసిన రాబిన్ శ‌ర్మ‌ను చంద్ర‌బాబు నాయుడు త‌న వ్యూహ‌క‌ర్త‌గా అపాయింట్ చేసుకున్నారు. రాబిన్ శ‌ర్మ్ పార్టీ వ్యూహ‌క‌ర్త‌గా బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి సోష‌ల్ మీడియా లో వీక్ ఉన్న పార్టీ ని బ‌లోపేతం చేయ‌డంపై కృషిచేస్తున్నారు.

    ఇది చదవండి: వైసీపీలో కేబినెట్ బెర్త్ కోసం పోటాపోటీ.. ఆ జిల్లాలో చాంతాడంత లిస్ట్..


    దీంతో పాటు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌ధాన ఎజెండా తీసుకొని ప్ర‌జ‌ల్లోకి వెళ్లడానికి తెలుగు త‌మ్ముళ్లు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అందులో చాలా వ‌ర‌కు స‌క్సెస్ కూడా అయ్యారు. అయితే రాబిన్ శ‌ర్మ పంజాబ్ లో ఆప్ విజ‌యానికి చాలా గ్రౌండ్ వ‌ర్క్ చేశారు. ముఖ్యంగా అర‌వింద్ కేజ్రీవాల్ ఆ స్థాయిలో ఉచిత పథకాలు ప్ర‌క‌టించ‌డం వెనుక ఈయ‌న వ్యూహాలే ఉన్నాయని ఆప్ వర్గాలు చెబుతున్నాయి.

    ఇది చదవండి: కేబినెట్ లో కొనసాగేది వీరేనా..? సీఎం జగన్ మనసులో ఏముంది..?


    ఈ నేప‌ధ్యంలో ఏపీలో కూడా వ‌చ్చే ఎన్నికల్లో త‌మ‌ను రాబిన్ శ‌ర్మ గ‌ట్టెక్కించేస్తాడ‌నే గ‌ట్టి హోప్ తో ఉన్నారు తెలుగు త‌మ్ముళ్లు. అయితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలు ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యానికి కొన‌సాగితే టీడీపీ మ‌ళ్లీ పుంజుకునే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేష‌కులు. ఇప్ప‌టికే ఆర్ధిక లోటు, మూడు రాజ‌ధానిల అంశం, వివేకానంద‌రెడ్డి హాత్య వంటి ప‌లు అంశాలు జ‌గ‌న్ కు త‌ల‌నొప్పిగా మారాయి. వీటిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోగ‌లిగితే త‌ప్ప‌కుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగు త‌మ్ముళ్లు మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు పార్టీ లో కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు. అయితే పంజాబ్ లో స‌క్సెస్ అయిన రాబిన్ శ‌ర్మ వ్యూహాలు ఇక్క ఏపీ ప‌రిస్థితిల‌కు ఏ మేర‌కు సెట్ అవుతాయో చూడాలని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: AAP, Andhra Pradesh, AP Politics, TDP

    తదుపరి వార్తలు