Home /News /andhra-pradesh /

AP POLITICS JC PRABHKAR REDDY SENSATIONAL COMMENTS ON TELANGANA MINSTER KTR AND GAVE SOME SUGGESTIONS NGS

JC on KTR: అస్సలు తగ్గొద్దు.. కేసీఆర్ ను షర్మిల తిడుతోంది.. జగన్ ను కేటీఆర్ తిడితే తప్పేంటి.. జేసీ సలహా?

కేటీఆర్ కు జేసీ సలహా

కేటీఆర్ కు జేసీ సలహా

JC on KTR: తగ్గొద్దు.. తగ్గేదే లే అంటున్నారు జేసీ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు జేసీ ప్రభాకర్ రెడ్డిలు సలహా ఇస్తున్నారు. టంగ్ స్లిప్ అయ్యారని మాట మార్చడం ఎందుకు.. సీఎం కేసీఆర్ ను షర్మిల తిట్టినప్పుడు.. జగన్ ను కేటీఆర్ తిడితే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    JC Prabhakar Reddy on KTR : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మౌలిక వసతులుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (Telangana Minster KTR) చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా ఆగడం లేదు. ఆయన తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గినా.. ఏపీలో రాజకీయ పార్టీలు మాత్రం వదలడం లేదు. తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhkar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో నీళ్లు లేవు, కరెంట్ కోతలున్నాయి.. రోడ్లు బాగోలేవు అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలన్నీ నిజాలు కాదా అని ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నోరు జారినవి కాదని.. కేటీఆర్ అన్నీ వాస్తవాలే చెప్పారంటూ తెలిపారు. కేటీఆర్ టంగ్ స్లిప్ అవ్వలేదు, నిజమే చెప్పారని అభిప్రాయపడ్డారు. కేటీఆర్ చేసిన వాఖ్యలకు ధైర్యంగా కట్టుబడి ఉండాలని, భయపడాల్సిన పని లేదని పేర్కొన్నారు. ఏపీలో కరెంట్ (AP Current) లేదు, నీళ్లు లేవు, రోడ్లు బాగా లేవన్నారు. భవిష్యత్తు నాయకుడు ధైర్యంగా ఉండాలంటూ కేటీఆర్ కు జేసీ సూచించారు. కేటీఆర్ నిజాలు చెప్పి మాట మారుస్తారెందుకు? మాట మీద నిలబడండి అని అన్నారు. తగ్గొద్దు.. తగ్గేదేలే అంటూ కేటీఆర్ కు జేసీ ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ మీ వెంబడి తిరిగి ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపిస్తానని సూచించారు కూడా..

    జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నారంటే...? మాకు రోడ్లు లేవు. నీరు లేవు.. నిజమే. మా రాష్ట్రం పరిస్థితి అంతా అయిపోయింది. తనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ వెళ్లే రోడ్లు చాలా బాగున్నాయి. మీరు తగ్గొద్దు అంటూ పుష్ప డైలాగ్ ను రిపీట్ చేశారు. కేటీఆర్ మాట తప్పద్దు. మీరు రాబోయే లీడర్. మీరు మాట్లాడింది నిజమే. దాన్నుంచి వెనక్కి తగ్గద్దు. అన్నారు అలాగే.. బీజేపీలోకి వెళతానన్న వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. తనకు రావాల్సిన పార్టీలోనే టికెట్ వస్తుందన్నారు.

    ఇదీ చదవండి : భర్త వదిలేశాడు.. మరిది వేధిస్తున్నాడు.. అత్తింటిముందు ఆ మహిళ ఏం చేసిందంటే?

    తాను నిజంగా పార్టీ మారేది వుంటే ముందే చెబుతాం అన్నారు. అలాగే ఏపీలో పెరుగుతున్న క్రైమ్ పై మాట్లాడిన హోం మంత్రి తల్లి సరిగా పెంచలేదన్న వ్యాఖ్యలపై జేసీ మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి సరిగా పెంచడం కుదరక తాత దగ్గర జగన్ పెరిగారు. పెద్దాయన్ని ఏం అనద్దు. ఆయన బాగానే పెంచారు. మంత్రులు ఏపీలో ఏం చేయలేరు. సంతకాలు మాత్రం పెడతారు. ఎస్పీని కలిసి వచ్చాను. ఆయన మంచోడు. ఆయన చేతిలో ఏంలేదు. సజ్జల చేతిలోనే అంతా ఉంది అన్నారు.

    ఇదీ చదవండి : : వేసవిలో చల్లని ప్రయాణం చేయాలి అనుకుంటున్నారా? ఛలో అండమాన్.. తక్కువ ధరకే?

    మరోవైపు సీఎం కేసీఆర్‌ ను షర్మిల తిడుతోంది.. మరి జగన్‌ ను కేటీఆర్ తిడితే తప్పేంటి అని జేసీ ప్రభాకర్ రెడ్డి సలహా ఇచ్చారు. కేటీఆర్ ఎంత కథ చెప్పి స్లిప్ ఆఫ్ ది టంగ్ అని ఎందుకు అన్నారు. షర్మిలమ్మ రోజు మీ నాయనను, ప్రభుత్వాన్ని తిడుతోంది అది మనసులో పెట్టుకొని తిట్టారా అని ఎద్దేవా చేశారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Jc prabhakar reddy, Minister ktr

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు