హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆ విషయంలో నిర్ణయం తీసుకోలేదా ? వైసీపీనే కారణమా ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆ విషయంలో నిర్ణయం తీసుకోలేదా ? వైసీపీనే కారణమా ?

 పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

Pawan Kalyan: జనసేన వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని చెప్పలేకపోతున్నాయి. అసలు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదనే వాదన కూడా ఉంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాబోయే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని డిసైడయ్యారు. వైసీపీని ఎలాగైనా ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం అవసరమైతే శత్రువుతో అయినా కలుస్తామని పరోక్షంగా టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదని స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు. ఇక ప్రస్తుతం స్నేహబంధంలో ఉన్న బీజేపీ, జనసేన మధ్య పెద్దగా సఖ్యత లేకపోవడంతో.. ఈ రెండు పార్టీలు ఎప్పుడైనా స్నేహానికి రాం రాం చెప్పే అవకాశం ఉందని ఏపీ రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీ, టీడీపీ వంటి పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమవుతుంటే.. జనసేన మాత్రం ఈ విషయంలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదనే వాదన ఉంది.
  మరోవైపు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిన పరిస్థితితో ఉన్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ .. తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. గత ఎన్నికల్లో భీమవరం,(Bhimavaram) గాజువాక(Gajuwaka) నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లోనూ ఓటమి చవిచూశారు పవన్ కళ్యాణ్. దీంతో ఈసారి ఈ రెండు నియోజకవర్గాలను వదిలేసి కొత్తగా తిరుపతి లేదా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని చాలాకాలం నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


  జనసేన వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని చెప్పలేకపోతున్నాయి. అసలు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదనే వాదన కూడా ఉంది. అయితే తమ సొంత సీటును ఖరారు చేసుకునేందుకు మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ లాంటి కీలక నేత.. ఈ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఆయనకు ఓ క్లారిటీ ఉందని.. అయితే ఈ విషయాన్ని ఆయన కావాలనే బయటపెట్టడం లేదని కొందరు చర్చించుకుంటున్నారు.
  Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అధినేత ఇచ్చిన హామీ ఏమైంది..? అమల్లోకి రాకపోవడానికి కారణం ఏంటి..?
  CM Jagan Kadapa Tour: సొంత జిల్లాకు సీఎం జగన్ .. రేపటి నుంచి మూడు రోజుల పర్యటన.. పూర్తి వివారలు ఇవే
  పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని ప్రకటిస్తే.. అక్కడ వైసీపీ ఇప్పటి నుంచి ఆయనను ఓడించేందుకు వ్యూహరచన చేయడం ఖాయం. ఇందుకోసం అధికార పార్టీ ఎలాంటి ఎత్తులైనా వేస్తుందని జనసేన అధినేత అనుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు పోటీ చేసే కుప్పం, లోకేశ్ పోటీ చేయాలని చూస్తున్న మంగళరిరి విషయంలో వైసీపీ ఇలాగే చేస్తోందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని టాక్. అందుకే తాను పోటీ చేయబోయే స్థానం ఏదనే విషయాన్ని ప్రకటిస్తే.. వైసీపీ ఇప్పటికే ఆ సీటుపై ఫోకస్ పెంచుతుందని.. అప్పుడు తనకు ఏదో రకంగా ఇబ్బందులు వస్తాయని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Pawan kalyan

  ఉత్తమ కథలు