హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: ఎంతో ఆలోచించి ఆ మాటలు అన్నాను.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..

Pawan Kalyan: ఎంతో ఆలోచించి ఆ మాటలు అన్నాను.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

Pawan Kalyan: మంగళగిరిలోని జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. జనసేన (Janasena) ఆవిర్భావ సభలో తాను చేసిన ఈ వ్యాఖ్యలు ఏదో సరదాగా చేసిన వ్యాఖ్యలు కాదని ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యలు ఎంతో ఆలోచించి చేసినవని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చెప్పుకొచ్చారు. అయితే తాము ఎవరి పల్లకినో మోయడానికి సిద్ధంగా లేమని.. ప్రజలను పల్లకి ఎక్కించడం తమ అభిమతమని అన్నారు. పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుని మరోసారి జనసేన కార్యకర్తలు మోసపోవద్దని వైసీపీ (Ysrcp) నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తమ మీద అంత ప్రేమ వైసీపీ నేతలకు అవసరం లేదని సూచించారు. తాము వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వబోమని చేసిన ఒక్క ప్రకటనతో అధికార వైసీపీ నేతలు భయపడిపోతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో అన్నం పెట్టే రైతు చనిపోతుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను లేని సమస్యల గురించి ప్రస్తావించడం లేదని.. ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.

అయితే ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వబోనని అనడం.. ఆ మాట ఎంతో ఆలోచించే అన్నానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి ఆయన పొత్తుల విషయంలో ఓ స్పష్టమైన అవగాహనతో ఉన్నారని తెలుస్తోంది. అయితే తాము ఎవరి పల్లకి మోయబోమంటూ.. ఎవరినో గద్దెనెక్కించడానికి సిద్ధంగా లేమంటూ పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇచ్చారు. తాము ప్రజలను పల్లకి ఎక్కిస్తామని అన్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో మరోసారి పూర్తి క్లారిటీ ఇవ్వలేదనే వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వబోమని అంటూనే.. తాము ఎవరి పల్లకి మోయబోమని పవన్ కళ్యాణ్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటన్న దానిపై చర్చ జరుగుతోంది.

MP Rammohan Naidu: టీడీపీ యువ ఎంపీతో ప్రధాని ముచ్చట్లు.. కూతురుకి చాక్లెట్లు ఇచ్చిన మోదీ సర్ ప్రైజ్

AP Government: ఏపీ ప్రభుత్వం మరో కొత్త ప్రాజెక్ట్.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

అయితే తమతో పొత్తు పెట్టుకోవాలని అనుకునేవాళ్లు.. తమకు మద్దతు ఇవ్వాలని అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని కొందరు చర్చించుకుంటున్నారు. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే.. తాము ఆ పార్టీకి జూనియర్ పార్టనర్‌గా ఉండబోమనే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జనసేన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆసక్తికర చర్చకు తెరలేపాయని చెప్పొచ్చు.

First published:

Tags: Andhra Pradesh