హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: ఏపీ మంత్రి మంచి వ్యక్తి.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదంటూ..

Pawan Kalyan: ఏపీ మంత్రి మంచి వ్యక్తి.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదంటూ..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Pawan Kalyan Comments: తనకు తెలిసినంత వరకు మంత్రి విశ్వరూప్ మంచి వ్యక్తి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయాల కోసం రెచ్చగొట్టే వ్యక్తి కాదని అభిప్రాయపడ్డారు.

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. పలు అంశాలపై స్పందించారు. కోనసీమ ఘటనలో మంత్రి విశ్వరూప్ కూడా బాధితుడేనని అన్నారు. కోనసీమ ఘటన జరిగి ఇన్నాళ్లైనా ప్రభుత్వం స్పందించకపోవడం చూస్తుంటే అనుమానాలు కలిగిస్తోందని తెలిపారు. తనకు తెలిసినంత వరకు మంత్రి విశ్వరూప్ మంచి వ్యక్తి అని పవన్ కళ్యాణ్ (Pawan kalyan) వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయాల కోసం రెచ్చగొట్టే వ్యక్తి కాదని అభిప్రాయపడ్డారు. వైసీపీ ఉన్నంతవరకు పోలవరం పూర్తి కాదని.. కొట్టడం తమ హక్కుగా వైసీపీ (ysrcp) భావిస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఉద్రిక్తతలు తగ్గాక కోనసీమలో (konaseema)  పర్యటిస్తానని అన్నారు.

  ఇక బీజేపీతో సంబంధాలపై పవన్ కళ్యాణ్ గతానికి భిన్నంగా వ్యాఖ్యానించారు. తనకు ఢిల్లీ బీజేపీ నేతలతోనే సంబంధమని.. ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. మహానాడు సక్సెస్ అయితే మంచిదే అని అన్నారు. వైసీపీ పాలన బాగుంటే పొత్తుల ప్రస్తావన ఎందుకొస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కొన్ని కులాలను వైసీపీ శత్రువులుగా భావిస్తోందని.. కమ్మ,కాపు, బీసీ, మత్స్యకార కులాలను శత్రువులుగా చూస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

  పవన్ కళ్యాణ్ పలు అంశాలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేపుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతల విషయంలో ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తనకు ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదని.. తనకు ఢిల్లీ బీజేపీ నేతలతోనే సంబంధం అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు.

  AP News: అక్కడ ఇంటింటికీ ఆర్గానిక్ మద్యం.. పైసా ఇవ్వనక్కర్లేదు.. అంతా ఫ్రీ..! హెల్త్ బెనిఫిట్స్ కూడా..

  Jobs in Andhra Pradesh: కృష్ణా జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం రూ.18,500.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

  దీన్ని బట్టి ఆయన ఏపీ బీజేపీ నేతలకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదని.. వారి నిర్ణయాలతో తనకు సంబంధం లేదని చెప్పినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు ఏపీ బీజేపీ నేతలను అవమానపరిచేలా ఉన్నాయనే వాదన కూడా ఉంది. మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Janasena, Pawan kalyan, Ysrcp

  ఉత్తమ కథలు